రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోంది: రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేథ్

Posted On: 21 JUL 2024 9:15PM by PIB Hyderabad

సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేథ్ పునరుద్ఘాటించారు. 2024 జూలై 21న కార్గిల్ విజయ్ దివస్ రజతోత్సవాన్ని పురస్కరించుకుని పాట్నాలో నిర్వహించిన వీర్ నారీ సమ్మాన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

ప్రస్తుత డిజిటల్ యుగంలో సంక్షేమ పథకాల ఫలాలు అర్హులందరికీ ఎలాంటి జాప్యం లేకుండా చేరేలా ప్రభుత్వం కృషిచేస్తోందని శ్రీ సంజయ్ సేథ్ అన్నారు.

కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లందరికీ ఆయన ఘనంగా నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ధైర్యవంతులైన బిడ్డలకు జన్మనిచ్చిన ధీర మాతలకు సెల్యూట్ చేశారు.

సైనిక కుటుంబాల మహిళలను స్ఫూర్తి ప్రదాతలని కొనియాడిన రక్షణశాఖ సహాయ మంత్రి, వారి ధైర్యం, నిబద్ధత, నిస్వార్థ త్యాగం, దేశభక్తి భావితరాల్లో ధైర్యాన్ని, జాతీయతా స్ఫూర్తిని పెంపొందిస్తాయన్నారు.



(Release ID: 2035066) Visitor Counter : 12