సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డి ఈ పీడబ్ల్యూ డీతో వివిధ స్టార్టప్స్, ప్రైవేటు సంస్థల మధ్య ఎంఓయూలపై సంతకాల కార్యక్రమానికి డా. వీరేంద్ర కుమార్అధ్యక్షత వహించనున్నారు. జూలై 22,2024 న న్యూ ఢిల్లీ లో ఈ కార్యక్రమం జరుగుతుంది.


వివిధ వైకల్య రంగాల్లో దివ్యాంగ్జన్లకు ప్రయోజనం చేకూరేలా 70కి పైగా ఎంఓయూలపై సంతకాలు జరుగుతాయి.

Posted On: 21 JUL 2024 9:26AM by PIB Hyderabad

కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి, డా. వీరేంద్ర కుమార్, వికలాంగుల సాధికారత విభాగం (DEPwD) లోని నేషనల్ ఇన్స్టిట్యూట్స్ మరియు కంపోజిట్ రీజినల్ సెంటర్స్ (CRCs), వివిధ స్టార్టప్స్, ప్రైవేటు సంస్థల మధ్య జరిగే ఎంఓయూల సంతకాల  కార్యక్రమానికి అధ్యక్షత వహించనున్నారు.

వివిధ వైకల్య రంగాల్లో 70కి పైగా ఎంఓయూలపై  భౌతికంగా,వర్చువల్ గా సంతకాలు  చేస్తారు.  అందరినీ కలుపుకునిపోయే  ఒక సమిష్టి సమాజాన్ని ప్రోత్సహించే దిశగా ఇది ఒక ముందడుగు. ఈ కార్యక్రమాన్ని  డి ఈ పీడబ్ల్యూ డీ (DEPwD)  జూలై 22,2024 న న్యూ ఢిల్లీ లో  నిర్వహించనుంది.

ఈ సహకారఒప్పందాలు కేవలం అధికారిక ఒప్పందాలు మాత్రమే కాదు, ఇవి వివిధ రంగాల్లో దివ్యాంగ్జన్లకు ప్రయోజనాలను చేకూర్చే మైత్రీపూర్వక వ్యూహాత్మక చర్యలు. ప్రతి ఒక్కరూ సంతృప్తి తో జీవించే  గౌరవప్రదమైన సమాజాన్ని నిర్మించడంలో కీలకమైన  ముందడుగు కోసం ఈ ప్రయత్నం. 

****


(Release ID: 2034860) Visitor Counter : 50