రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

‘‘సానుకూల భారత్ : భవిష్యత్ను సుగమం చేస్తున్న భారత రసాయనాలు, పెట్రో రసాయనాలు’’ ఇతివృత్తం తో ఇండియా కెమ్ 13 వ ఎడిషన్ను ప్రారంభించిన కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ జగ్ ప్రకాశ్ నడ్డా, కేంద్ర సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్.


ఇండియా కెమ్ 2024 థీమ్ అయిన సానుకూల భారత్:భవిష్యత్ను సుగమం చేస్తున్న భారత రసాయనాలు, పెట్రోరసాయనాలు, అనేది, 2025 నాటికి భారత్ను 5 ట్రిలియన్ల ఆర్ధిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ దార్శనికతకు అద్దంపట్టేదిగా ఉంది : శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా

రసాయనాలు, పెట్రో రసాయనాల రంగాన్ని బలోపేతం చేసేందుకు అవసరమైన విధానపరమైన నిర్ణయాలతో, ప్రభుత్వం ముందుకు వస్తుందని పరిశ్రమ ప్రతినిధులకు హామీ ఇచ్చిన కేంద్ర మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా.

పెట్టుబడుల అనుకూల సంస్కరణలపై స్పష్టమైన దృష్టి, విధానపరమైన అడ్డంకుల తొలగింపు ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత : కేంద్ర సహాయమంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్.

Posted On: 20 JUL 2024 3:36PM by PIB Hyderabad

"సానుకూల భారత్ : భవిష్యత్ను సుగమం చేస్తున్న భారత రసాయనాలుపెట్రో రసాయనాలు ఇతివృత్తం తో ఇండియా కెమ్ 13 వ ఎడిషన్ను  కేంద్ర రసాయనాలుఎరువుల శాఖ మంత్రి శ్రీ  జగ్ ప్రకాశ్ నడ్డాకేంద్ర సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్ సమక్షంలో శనివారం నాడు ఢిల్లీలో ప్రారంభిచారు. ఈ సందర్బంగా శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా ఇండియా కెమ్ 13 వ ఎడిషన్కు సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రసాయనాలుపెట్రో రసాయనాల శాఖ కార్యదర్శి శ్రీమతి నివేదిత శుక్ల వర్మమంత్రిత్వ శాఖకు చెందిన పలువురు సీనియర్ అధికారులతోపాటుపరిశ్రమ ప్రతినిధులు హాజరయ్యారు.

రసాయనాలుఎరువుల శాఖ మంత్రి శ్రీ జె.పి.నడ్డా మాట్లాడుతూఈ ఈవెంట్లకు సుదీర్ఘ చరిత్ర ఉందని ఈ ఏడాది అక్టోబర్లో ఇది ముంబాయిలో 13 వ ఎడిషన్ను జరుపుకునేందుకు  సిద్దంగా ఉందని అన్నారు. ఇండియా కెమ్ 2024 ఇతివృత్తం, “సానుకూల భారత్ : భవిష్యత్కు మార్గం సుగమం చేస్తున్న రసాయనాలుపెట్రోరసాయనాలు””  . 2025 నాటికి భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు ఇది అద్దంపట్టేదిగా ఉందని  మంత్రి అన్నారు.  అక్టోబర్ 17 నుంచి 19 వరకు ముంబాయిలో ఇండియా కెమ్ 13 వ ఎడిషన్ జరగనున్నందున 2024 ఎంతో కీలకమైన సంవత్సరమని ఆయన తెలిపారు. “దిగుమతులుపరిశోధనఅభివృద్ధిమానవ వనరుల శిక్షణపై దృష్టి పెట్టడం ద్వారా , 2047 నాటికి వికసిత్ భారత్ కలను సాకారం చేయడానికి ఈ రంగం  తన వంతు పాత్రను పోషించగలదన్న ఆకాంక్షను కేంద్ర మంత్రి వ్యక్తం చేశారు.

పరిశ్రమ ప్రగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందనిపరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేకించి రసాయనాల రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు వ్యవస్థాగత సంస్కరణలను చేపట్టిందని శ్రీజె.పి.నడ్డా తెలిపారు ప్రభుత్వానికి ఇది ఎంతో ప్రధానమైన రంగమని కూడా మంత్రి చెప్పారు. ఈ రంగాన్ని బలోపేతం చేసేందుకు  అవసరమైన విధానపరమైన చర్యలతో ప్రభుత్వం ముందుకు వస్తుందనిపరిశ్రమ ప్రతినిధులకు మంత్రి హామీ ఇచ్చారు. ‘‘ముంబాయిలో జరిగే చర్చల ఫలితాలను సాధించేందుకు అవసరమైన విధానపరమైన చర్యలను తమ మంత్రిత్వశాఖ ప్రారంభిస్తుందని ఆయన తెలిపారు..

ఈ కార్యక్రమానికి హాజరైన వారినుద్దేశించి మాట్లాడుతూ కేంద్ర సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియా పటేల్ఆటోమోటివ్నిర్మాణంఎలక్ట్రానిక్స్ఆరోగ్య సంరక్షణటెక్స్టైల్స్ఎఫ్.ఎం.సి.జిల రంగాల ఆర్ధిక అభివృద్ధిలో పెట్రో కెమికల్  రంగం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.  భవిష్యత్ అభివృద్ధికి అవకాశాల కల్పనలోఆర్ధిక అభివృద్ధిలో రసాయనాల రంగం పాత్ర నానాటికీ పెరుగుతున్నదని ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రపంచంలో వ్యవసాయ   రసాయనాలు, రసాయన అద్దకాలుఅద్దకపు రంగుల రంగంలో ఇండియా రెండో అతిపెద్ద ఎగుమతిదారుగా ఉందని ఆమె తెలిపారు.

ఇండియా కెమ్ ప్రారంభమైనప్పటి నుంచిమరిన్ని పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఈ రంగం అభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడింద’’” ని ఆమె తెలిపారు. పెట్టుబడులుఉపాధి కల్పనకు మన ఈ పరిశ్రమకు ఎంతగానో శక్తి ఉందని కూడా ఆమె అన్నారు.  పెట్టుబడుల అనుకూల సంస్కరణలపై ప్రధానంగా దృష్టిపెట్టడం విధానపరమైన అడ్డంకులను తొలగించడం ప్రభుత్వం ముందున్న అత్యంత ప్రాధాన్యతాంశాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మరింతగా నేర్చుకునేందుకునూతన అవకాశాలను అన్వేషించేందుకునెట్వర్క్కు ఈ అవకాశాన్ని   సద్వినియోగం చేసుకోవలసిందిగా ఆమె కోరారు.

ఇండియా కెమ్ 2024 అనేది రసాయనాలుపెట్రో రసాయనాల విభాగం ఫ్లాగ్షిప్ కార్యక్రమం. ఆసియా –పసిఫిక్ లో ఉమ్మడి అతిపెద్ద ఈవెంట్లలో ఇది ఒకటి. ఇందులో అంతర్జాతీయ ఎగ్జిబిషన్లుసదస్సులు ఉంటాయి. ఇండియా కెమ్ ఎగ్జిబిషన్భారతీయ రసాయనాల పరిశ్రమ  అలాగే ,రసాయనాలుపెట్రో కెమికల్స్ఆగ్రో కెమికల్స్ తదితర పారిశ్రామిక విభాగాలలో గల గొప్ప శక్తిని ప్రదర్శిచడంతోపాటుకీలక చర్చలకు దార్శనిక ఆలోచనలకు పారిశ్రామిక ప్రతినిధుల మధ్య వ్యూహాత్మక సహకారానికి ఇది మంచి వేదికను కల్పించనుంది.  భారతీయ రసాయన పరిశ్రమ విలువ ప్రస్తుతం 220 అమెరికన్ డాలర్లుగా ఉంది. 2030 నాటికి ఇది 300 బిలియన్ అమెరికన్ డాలర్లకుకు చేరుకుంటుందని , 2040 నాటికి 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.  అంతర్జాతీయ అస్థిర పరిస్థితుల నేపథ్యంలోనూ అద్బుతమైన అవకాశాలకు ఈ పరిశ్రమ ఇప్పటికీ క్రియాశీల కేంద్రంగా ఉంది.

***



(Release ID: 2034830) Visitor Counter : 18