రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

2024 పారిస్ ఒలింపిక్స్‌ కి 24 మంది సైనిక సర్వీసుల క్రీడాకారులతో పాటు మొత్తం 117 మంది భారతీయ అథ్లెట్లు


మళ్లీ అత్యున్నత పురస్కారాల కోసం పోటీ పడేందుకు
సిద్ధం అయిన స్టార్ జావెలిన్ త్రోయర్ సుబేదార్ నీరజ్ చోప్రా

తొలి సరిగా మహిళా సైనిక సిబ్బంది ఈ బృందంలో భాగస్వామ్యం;
విజయమే లక్ష్యంగా పాల్గొంటున్న హవల్దార్ జైస్మిన్ లంబోరియా, సీపీఓ రీతికా హుడా

Posted On: 20 JUL 2024 9:53AM by PIB Hyderabad

పారిస్ ఒలింపిక్స్ కి భారత్ బృందం సర్వ సన్నద్ధమైంది ఈ జూలై 26న ప్రారంభమయ్యే పారిస్ ఒలింపిక్స్‌లో దేశం గర్వపడేలా చేయడానికి సిద్ధంగా ఉన్న 117 మంది భారతీయ అథ్లెట్లు తమ సత్తా చాటేందుకు రంగంలోకి దిగుతున్నారు. వీరిలో 24 మంది సాయుధ దళాల నుండి పాల్గొంటున్నారు. ఈ 24 మంది అథ్లెట్లలో స్టార్ జావెలిన్ త్రోయర్ సుబేదార్ నీరజ్ చోప్రాతో సహా 22 మంది పురుషులు ఉన్నారు. ఇద్దరు మహిళలున్నారు. ఒలింపిక్స్‌లో మహిళా సర్వీస్ అథ్లెట్ల తొలి సరిగా పాల్గొంటున్నారు. 

2020 టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అయిన సుబేదార్ నీరజ్ చోప్రా, 2023 ఆసియా క్రీడలు, 2023 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్, 2024 డైమండ్ లీగ్, 2024 పావో నుర్మి గేమ్‌లలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుని అసాధారణ ప్రదర్శన చేశాడు. ఈ నేపథ్యంలో పారిస్ ఒలింపిక్స్‌లో కూడా అత్యున్నత ప్రతిభను ప్రదర్శించి దేశానికి గౌరవంగా  నిలుస్తాడని క్రీడా ప్రేమికులు ఆకాంక్షిస్తున్నారు. 

2022 కామన్వెల్త్ గేమ్స్ కాంస్య పతక విజేత హవిల్దార్ జైస్మిన్ లంబోరియా, 2023 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సీపీఓ రీతికా హుడా ఇద్దరు మహిళా సేవా సిబ్బంది మొదటిసారిగా గేమ్స్‌లో పాల్గొంటూ, చరిత్ర సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. వారు వరుసగా బాక్సింగ్, రెజ్లింగ్‌ క్రీడంశాలలో సత్తా చాటనున్నారు.

సుబేదార్ అమిత్ పంఘల్ (బాక్సింగ్); సీపీఓ తాజిందర్‌పాల్ సింగ్ టూర్ (షాట్-పుట్); సుబేదార్ అవినాష్ ముకుంద్ సేబుల్ (3000మీ స్టీపుల్‌చేజ్); సీపీఓ ముహమ్మద్ అనస్ యాహియా, పిఓ (జిడబ్ల్యూ) ముహమ్మద్ అజ్మల్, సుబేదార్ సంతోష్ కుమార్ తమిళరసన్, జేడబ్ల్యూఓ మిజో చాకో కురియన్ (4X400ఎం పురుషుల రిలే); జెడబ్ల్యూఓ అబ్దుల్లా అబూబకర్ (ట్రిపుల్ జంప్); సుబేదార్ తరుణ్‌దీప్ రాయ్, ధీరాజ్ బొమ్మదేవర (ఆర్చరీ), సుబేదార్ సందీప్ సింగ్ (షూటింగ్) కూడా దేశానికి అవార్డులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్న సేవా సిబ్బందిలో ఉన్నారు. సర్వీస్ ప్లేయర్‌ల పూర్తి జాబితా క్రింది విధంగా ఉంది:

క్రీడాంశం 

ర్యాంకు, పేరు 

కేటగిరీ 

ఆర్చరీ 

సుబేదార్ ధీరజ్ బొమ్మదేవర

 

రికర్వ్ ఇండీల్, బృందం  

సుబేదార్ తరుణ్ దీప్ రాయ్ 

సుబేదార్ ప్రవీణ్ రమేష్ 

అథ్లెటిక్స్ 

ఎస్ఎస్ఆర్ అక్షదీప్ సింగ్ 

20కేఎం ఆర్డబ్ల్యూ 

పిఓ వికాస్ సింగ్ 

20కేఎం ఆర్డబ్ల్యూ

ఎస్ఎస్ఆర్ పరంజీత్ బిస్త్ 

20కేఎం ఆర్డబ్ల్యూ

పిఓ సూరజ్ పన్వర్ 

 

రేస్ వాకింగ్ మిక్స్డ్ మారథాన్ 

సుబేదార్ అవినాష్ 

3000M SC

సుబేదార్ మజ్ నీరజ్ చోప్రా 

జావెలిన్ త్రొ

సీపీఓ తేజిందర్ పాల్ తూర్ 

పురుషుల షాట్ ఫుట్ 

జెడబ్ల్యూఓ, అబ్దుల్లా అబూబక్ర్ 

పురుషుల ట్రిపుల్ జంప్ 

హవల్దార్ సర్వేశ్ కూశారే 

 

పురుషుల హై జంప్ 

 

సీపీఓ మొహమ్మెద్ అనస్ యాహియా 

4X400మీ. పురుషుల రిలే 

 

పిఓ (జిడబ్ల్యూ)

4X400మీ. పురుషుల రిలే  

సుబేదార్ సంతోష్ కుమార్ తమిళరసన్ 

 

4X400మీ. పురుషుల రిలే 

జెడబ్ల్యూఓ మిజో చాకో కురియన్ 

 

4X400మీ. పురుషుల రిలే 

బాక్సింగ్ 

సుబేదార్ అమిత్ పంగల్ 

పురుషుల ఫ్లయివెయిట్ 

హవల్దార్ జాస్మిన్ లంబోరియా 

మహిళల ఫెదర్ వెయిట్ 

హాకీ 

సీపీఓ జుగ్రాజ్ సింగ్ 

పురుషుల హాకీ రిజర్వ్ 

రోయింగ్ 

బాలరాజ్ పన్వర్ 

మిక్స్ (పురుషుల సింగిల్ స్కల్)

సెయిలింగ్ 

సుబేదార్ విష్ణు శరవణన్ 

పురుషుల వన్ పర్సన్ డింగీ 

షూటింగ్ 

సుబేదార్ సందీప్ సింగ్ 

10 మీ. ఎయిర్ రైఫిల్ 

టెన్నిస్ 

సుబేదార్ శ్రీరామ్ బాలాజి 

పురుషుల డబుల్స్ 

కుస్తీ 

సీపీఓ రీతిక హూడా 

మహిళల 76 కిలోల (ఫ్రీ స్టైల్) 

24 మంది అథ్లెట్లతో పాటు పారిస్ ఒలింపిక్స్ కి వెళ్తున్న బృందంలో 5గురు అధికారులున్నారు. వారి వివరాలు:

క్రీడాంశం 

పేరు 

పాత్ర 

బాక్సింగ్ 

లెఫ్టనెంట్ కల్నల్ కబిలన్ సాయి అశోక్ 

రిఫరీ, జడ్జ్ 

బాక్సింగ్ 

సుబేదార్ సిఏ కట్టప్ప 

కోచ్ 

ఆర్చరీ 

సుబేదార్ సోనమ్ సెరింగ్ భూటియా 

కోచ్ 

సెయిలింగ్ 

హవల్దార్ సిఎస్ దేలై 

టెక్నికల్ ఆఫీసర్ 

సెయిలింగ్ 

నాయక్ పీవీ శరద్ 

ఫీజియో 

పారిస్ ఒలింపిక్స్‌లో సైనిక సిబ్బంది పాల్గొనడం దేశ వ్యాప్తంగా క్రీడా స్పృహను పెంపొందిస్తూ, క్రీడా నైపుణ్యాన్ని ప్రోత్సహించడంలో ఉపయోగపడుతుంది. క్రీడా స్ఫూర్తిని, సంస్కృతిని పెంపొందించడంలో సాయుధ దళాల నిబద్ధతను చాటుతుంది. ఈ అథ్లెట్ల ప్రదర్శనలను చూసేందుకు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. పాల్గొనే ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు చెబుతూ, తిరుగులేని మద్దతును అందించడంలో సమైక్యంగా నిలుస్తుంది.

***


(Release ID: 2034823) Visitor Counter : 66