గనుల మంత్రిత్వ శాఖ
హైదరాబాద్‌లో ఖనిజాన్వేషణ హ్యాకథాన్ సహా నేషనల్ డిఎంఎఫ్ పోర్టల్‌కు కేంద్ర బొగ్గు-గనులశాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి శ్రీకారం
దేశం 2047కల్లా ‘వికసిత భారత్’గా రూపొందడంలో ఖనిజాల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి
Posted On:
20 JUL 2024 4:47PM by PIB Hyderabad
ఖనిజాన్వేషణలో వినూత్న పద్ధతులపై దృష్టి సారించడంలో భాగంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఖనిజాన్వేషణ హ్యాకథాన్‌ను కేంద్ర బొగ్గు-గనులశాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. బీహార్ ఉప ముఖ్యమంత్రి శ్రీ విజయ్ కుమార్ సిన్హా సహా గనులశాఖ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వాధికారులు, ప్రభుత్వ సంస్థల-పరిశ్రమల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
భూ-భౌతిక సమాచార సేకరణ, వివిధ ఖనిజాల అన్వేషణ ద్వారా సేకరించిన సమాచార సమాహారం సమన్వయంలో కృత్రిమ మేధ (ఎఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) వంటి వర్ధమాన సాంకేతికతల వినియోగాన్ని ప్రోత్సహించడం ఈ హ్యాకథాన్ నిర్వహణ ధ్యేయం. కొత్త ఖనిజ లక్ష్యాల గుర్తింపు, ప్రాథమిక సమాచారం, ఇప్పటికే అందుబాటులోగల అన్వేషణ సమాచారం కూడా ఈ సమాహారంలో భాగంగా ఉంటాయి. ముఖ్యంగా భూమి లోతుల్లో దాగిన/అంతర్భాగంగా మారిపోయిన ఖనిజ నిక్షేపాల కోసం గాలించడంలో వినూత్న సాంకేతికతల దిశగా కొత్త ఆలోచనలకు ఇది రూపమిస్తుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా ‘‘గ్లింప్స్ ఆఫ్ జియాలజీ అండ్ మినరల్ రిసోర్సెస్, తెలంగాణ’’, ‘‘మినరల్స్ ఇన్ తెలంగాణ- స్పాట్‌లైట్స్’’ పుస్తకాలను కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర భౌగోళిక స్థానం, దాంతోపాటు రాష్ట్రంలో సంభావ్య ఖనిజ లభ్యతపై ప్రధానంగా దృష్టి సారిస్తూ ఈ రచనలు వెలువడ్డాయి.
ఈ సందర్భంగా కీలక-వ్యూహాత్మక ఖనిజ క్షేత్రాల 2వ, 3వ విడత ఇ-వేలంలో భాగంగా ఎంపిక చేసిన 8 మంది బిడ్డర్లకు మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ధ్రువీకరణ పత్రాలను ప్రదానం చేశారు. ఈ మేరకు 2, 3 విడతల కింద విజయవంతంగా వేలం వేసిన క్షేత్రాల వివరాలు కింది విధంగా ఉన్నాయి:
2024 ఫిబ్రవరి 29నాటి ఎన్ఐటి ప్రకారం రెండో విడత వివరాలు
|
వ.
సం.
|
క్షేత్రం పేరు
|
రాష్ట్రం
|
జిల్లా
|
ఎంల్/
సిఎల్
|
ఎంపికైన బిడ్డర్
|
1.
|
గోలీఘట్ గ్రాఫైట్, వెనాడియం క్షేత్రాలు
|
మధ్యప్రదేశ్
|
బేతుల్
|
ఎంఎల్
|
శాంతి జిడి ఇస్పాత్ అండ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్
|
2.
|
గొల్లరహట్టి-మల్లెనహళ్లి నికెల్, క్రోమియం, పిజిఇ క్షేత్రాలు
|
కర్ణాటక
|
హసన్
|
సిఎల్
|
వేదాంత లిమిటెడ్
|
3.
|
బహెరా- గోరియారా గ్రాఫైట్, బేస్‌మెటల్ క్షేత్రాలు
|
మధ్యప్రదేశ్
|
సిద్ధి
|
సిఎల్
|
విన్‌మిర్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్
|
4.
|
ఖత్తాలీ ఛోటీ గ్రాఫైట్ క్షేత్రం
|
మధ్యప్రదేశ్
|
అలీరాజ్‌పూర్
|
సిఎల్
|
కోల్ ఇండియా లిమిటెడ్
|
2024 మార్చి 14నాటి ఎన్ఐటి ప్రకారం మూడో విడత వివరాలు
|
వ.
సం.
|
క్షేత్రం పేరు
|
రాష్ట్రం
|
జిల్లా
|
ఎంల్/
సిఎల్
|
ఎంపికైన బిడ్డర్
|
1.
|
పిప్రది-భుర్వా గ్లాకోనైట్ క్షేత్రం
|
బీహార్
|
రోహ్‌తాస్
|
సిఎల్
|
రుంగ్తా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్
|
2.
|
కుర్చా గ్లాకోనైట్ క్షేత్రం
|
ఉత్తరప్రదేశ్
|
సోన్‌భద్ర
|
సిఎల్
|
శోభా మినరల్స్
|
3.
|
చుటియా-నౌహట్టా గ్లాకోనైట్ క్షేత్రం
|
బీహార్
|
రోహ్‌తాస్
|
సిఎల్
|
రుంగ్తా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్
|
4.
|
జెంజనా నికెల్, క్రోమియం, పిజిఇ క్షేత్రం
|
బీహార్
|
గయ
|
సిఎల్
|
వేదాంత లిమిటెడ్
|
|
|
|
|
|
|
|
ఈ కార్యక్రమంలో భాగంగా నేషనల్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ (ఎన్‌డిఎంఎఫ్) పోర్టల్‌ను కూడా శ్రీ జి.కిషన్ రెడ్డి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా జిల్లా ఖనిజాభివృద్ధి సంస్థల సమాచార సేకరణ ఈ పోర్టల్ ఒక కేంద్రీకృత వేదికగా ఉపయోగపడుతుంది. ఈ మేరకు ‘డిఎంఎఫ్’ సమాచార సౌలభ్యంతోపాటు దానికింద అభివృద్ధి-వినియోగాలను అనుసరించడం ఈ పోర్టల్ ప్రారంభంలో ప్రధానోద్దేశం. దీనిద్వారా మరింత మెరుగైన పారదర్శకతతో దేశంలోని 645 ‘డిఎంఎఫ్’ల వివరాలను మన ముందుంచుతుంది. అలాగే కార్యకలాపాలన్నీ ఒకే వేదికపై కనిపిస్తాయి కాబట్టి- ప్రాజెక్టుల పర్యవేక్షణ, గతిశీల విశ్లేషణలు, ప్రభావశీల అమలు వగైరాల సంబంధిత అత్యుత్తమ విధానాల భాండాగారంగానూ ఇది ఉపయోగపడుతుంది.
ఈ కార్యక్రమం అనంతరం 2024 జూన్ 24నాటి ఎన్ఐటి ప్రకారం కీలక-వ్యూహాత్మక ఖనిజ క్షేత్రాల నాలుగో విడత ఇ-వేలం సంబంధిత రోడ్ షో నిర్వహించారు. ఇ-వేలం ప్రక్రియలో పరిశ్రమల భాగస్వామ్యం పెంచడం, సంభావ్య బిడ్డర్‌ల పరిచయం లక్ష్యంగా ఈ రోడ్ షోను గనుల మంత్రిత్వ శాఖ నిర్వహించింది. ఇందులో భాగంగా లావాదేవీల సలహాదారు ఎస్‌బిఐ కేపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ ద్వారా ఇ-వేలం ప్రక్రియ సంబంధిత వివరణాత్మక ప్రదర్శన ఉంటుంది. అలాగే ఇ-వేలం పోర్టల్ నిర్వాహక సంస్థ ఎంఎస్‌టిసి ద్వారా ఇ-వేలం వేదిక వినియోగం సంబంధిత మార్గదర్శకాలతోపాటు ఖనిజాన్వేషణ-సంప్రదింపుల సాంకేతిక సలహాదారు సంస్థ ద్వారా 21 కీలక-వ్యూహాత్మక ఖనిజ క్షేత్రాల సాంకేతిక వివరాలు కూడా తెలుసుకోవచ్చు.
***
(Release ID: 2034680)
Visitor Counter : 139