ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ వరల్డ్’ పట్ల లాక్ హీడ్ మార్టిన్ నిబద్ధతను ప్రశంసించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 19 JUL 2024 11:50AM by PIB Hyderabad

‘మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ వరల్డ్’ దార్శనికతను సాకారం చేసే దిశలో ప్రముఖ రక్షణ రంగ సంస్థ లాక్ హీడ్ మార్టిన్ కనబరుస్తున్న నిబద్ధతను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

 

 ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో లాక్ హీడ్ మార్టిన్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సిఇఒ) శ్రీ జిమ్ టైక్లెట్ గురువారం సమావేశమయ్యారు.

  

ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఓ) ‘ఎక్స్’ లో ఈ క్రింది విధంగా పేర్కొంది:

‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi  తో  @LockheedMartin సిఇఒ శ్రీ జిమ్ టైక్లెట్ సమావేశమయ్యారు.   భారత్, అమెరికా ల మధ్య ఏరోస్పేస్, రక్షణ సంబంధ పారిశ్రామిక సహకారంలో లాక్ హీడ్ మార్టిన్ ఒక కీలకమైన భాగస్వామిగా ఉంది.  ‘మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్’ అనే దార్శనికతను సాకారం చేసే దిశలో ఈ సంస్థ చాటుతున్న నిబద్ధతను మేం స్వాగతిస్తున్నాం.’’

 

***

DS/RT


(रिलीज़ आईडी: 2034351) आगंतुक पटल : 161
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , हिन्दी , Hindi_MP , Marathi , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam