రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

వింగ్స్ టు అవ‌ర్ హోప్స్‌; ఆశావోన్ కి ఉడాన్‌; క‌హానీ రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ కి; రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌: హెరిటేజ్ మీట్స్ ది ప్ర‌జెంట్ పుస్త‌కాల తొలి ప్ర‌తుల‌ను అందుకున్న భార‌త రాష్ట్ర‌ప‌తి


రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లోని సాంస్కృతిక కేంద్రంలో జ‌రిగిన వేడుక‌లో ఈ పుస్త‌కాల‌ను ఆవిష్క‌రించిన‌ కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్

Posted On: 18 JUL 2024 6:35PM by PIB Hyderabad

‘వింగ్స్ టు అవ‌ర్ హోప్స్‌’; ‘ఆశావోన్ కి ఉడాన్‌’; ‘క‌హానీ రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ కి’; ‘రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌: హెరిటేజ్ మీట్స్ ది ప్ర‌జెంట్’ పుస్త‌కాల తొలి ప్ర‌తుల‌ను రాష్ట్ర‌ప‌తి శ్రీమ‌తి ద్రౌప‌ది ముర్ము అందుకున్నారు. గురువారం(జూలై 18, 2024) రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో కేంద్ర వ్య‌వ‌సాయ‌, రైతు సంక్షేమ‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివ‌రాజ్ సింగ్ చౌహాన్ ఆమెకు ఈ పుస్తకాల‌ను అందించారు. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ప్ర‌ముఖుల్లో స‌మాచార‌, ప్ర‌సార‌, పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖల‌ స‌హాయ మంత్రి డాక్ట‌ర్ ఎల్‌.మురుగ‌న్‌, ప్ర‌చుర‌ణ‌ల విభాగం డైరెక్ట‌రేట్ అధికారుల‌తో పాటు స‌మాచార‌, ప్ర‌సార శాఖ అధికారులు పాల్గొన్నారు.

ప్ర‌చుర‌ణ‌ల విభాగం డైరెక్ట‌రేట్ ప్ర‌చురించిన ఈ పుస్త‌కాల‌ను గురువారం రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లోని సాంస్కృతిక‌ కేంద్రంలో కేంద్ర వ్య‌వ‌సాయ‌, రైతు సంక్షేమ‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివ‌రాజ్ సింగ్ చౌహాన్, స‌మాచార‌, ప్ర‌సార‌, పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖల‌ స‌హాయ మంత్రి డాక్ట‌ర్ ఎల్‌.మురుగ‌న్‌, స‌మాచార‌, ప్ర‌సార శాఖ కార్య‌ద‌ర్శి శ్రీ సంజ‌య్ జాహు లాంఛ‌నంగా ఆవిష్క‌రించారు.

రాష్ట్ర‌ప‌తి శ్రీమ‌తి ద్రౌప‌ది ముర్ము త‌న ప‌ద‌వీకాలం తొలి ఏడాదిలో చేసిన ప్ర‌సంగాల్లో కొన్ని ఎంపిక చేసిన వాటి సేక‌ర‌ణ‌నే ‘వింగ్స్ టు అవ‌ర్ హోప్స్‌’; ‘ఆశావోన్ కి ఉడాన్‌’ పుస్త‌కాలు. ‘క‌హానీ రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ కి’ అనేది రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌, రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు సంబంధించిన స‌మాచారంతో పిల్ల‌ల కోసం ఆస‌క్తి క‌లిగించే రీతిలో, సులువైన భాష‌లో రాసిన పుస్త‌కం. ‘రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌: హెరిటేజ్ మీట్స్ ది ప్ర‌జెంట్’ రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ చ‌రిత్ర‌, నిర్మాణ‌శైలిని చూపే చిత్రాల‌తో కూడిన పుస్త‌కం. ఇందులో అంద‌రు మాజీ రాష్ట్ర‌ప‌తుల‌కు సంబంధించిన స‌మాచారం కూడా ఉంది. రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు సంబంధించిన స‌మాచారం, ఆమె ప‌ద‌వీకాలం జ‌రిగిన ప్ర‌ధాన కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన చిత్రాలు కూడా ఈ పుస్త‌కంలో పొందుప‌రిచారు.

****


(Release ID: 2034327) Visitor Counter : 117