యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

ఖేలో ఇండియా రైజింగ్ టేలెంట్ ఐడెంటిఫికేషన్ (కెఐఆర్ టిఐ) కార్యక్రమానికి కేంద్ర మంత్రి డాక్టర్ మన్ సుఖ్ మాండవీయ వద్ద నుంచి సరికొత్త ప్రోత్సాహం

Posted On: 18 JUL 2024 2:31PM by PIB Hyderabad

పారిస్ ఒలింపిక్స్ సమీపిస్తున్న వేళ, ‘ఖేలో ఇండియా రైజింగ్ టేలెంట్ ఐడెంటిఫికేషన్ (కెఐఆర్ టిఐ.. ‘కీర్తి’) పేరుతో ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమానికి కేంద్ర యువజన వ్యవహారాలుక్రీడలు మరియు కార్మిక, ఉపాధి శాఖ మంత్రి  డాక్టర్ మన్ సుఖ్ మాండవీయ నుంచి సరికొత్త ప్రోత్సాహం లభించనుంది.  ఈ కార్యక్రమంలో రెండో దశను మంత్రి రేపు న్యూ ఢిల్లీలో ప్రారంభించనున్నారు.  ఇంతకుముందుకెఐఆర్ టిఐ ఒకటో దశ గత మార్చి 12న చండీగఢ్ లో ప్రారంభమైంది.

అన్ని రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకొంటూ మదింపు కోసం జిల్లాను ఒక యూనిట్ గా తీసుకొని ఆర్థిక సంవత్సరం 2024-25 లో 20 లక్షల మదింపుల లక్ష్యాన్ని సాధించాలనే ఉద్దేశంతో డాక్టర్ మన్ సుఖ్ మాండవీయ ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యాన్ని ఇవ్వనున్నారు.  ఈ ప్రాజెక్టు దేశంలో ప్రతి ఒక్క చిన్నారి చెంతకు క్రీడలను తీసుకుపోవడం, అంతిమంగా ఖేలో ఇండియా ఆవిష్కరించే పిరమిడ్ కోవకు చెందిన కార్యక్రమాల ద్వారా శ్రేష్ఠత్వాన్ని సాధించాలన్న గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృష్టి కోణానికి అనుగుణంగా ఉంది.

 

 

కెఐఆర్ టిఐ మొదటి దశలో  28 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు పరిధిలోని డెబ్భయ్ కేంద్రాలలో 3,62,683 రిజిస్ట్రేషన్ ల నుంచి సుమారు 51,000  మదింపులు జరిగాయి.  ఖేలో ఇండియా కార్యక్రమాలలో ప్రతిసారి రాణించిన మహారాష్ట్ర లో 9,168 మదింపులుహరియాణా లో 4820 మదింపులు జరిగాయిఈ రెండు రాష్ట్రాలలో మదింపులు గరిష్ఠ స్థాయిలో ఉన్నాయి.  4703 మదింపులతో అసోం మూడో స్థానంలో ఉంది. 

 

అభిలాష కలిగిన క్రీడాకారుల మదింపు ను 11 క్రీడాంశాలు - విలువిద్యఅథ్లెటిక్స్బ్యాడ్మింటన్బాక్సింగ్ఫుట్ బాల్హాకీ,  కబడ్డిఖో-ఖోవాలీబాల్వెయిట్ లిఫ్టింగ్మల్లయుద్ధం (రెస్లింగ్) లలో చేపట్టడమైంది.  అన్నింటి కంటే ఎక్కువ మదింపులు అథ్లెటిక్స్ (13804) , ఫుట్ బాల్ (13483)లో జరిగాయి.

 

 

 

నోటీఫై చేసిన ప్రతిభా మదింపు కేంద్రాల ద్వారా దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా 20 లక్షల మదింపులను పూర్తి చేయాలనేది కెఐఆర్ టిఐ లక్ష్యం.  ప్రతిభను అన్వేషించడంమదింపు చేయడం అనే కార్యక్రమాన్ని ఈ స్థాయిలో చేపట్టడం భారతదేశంలో ఇది మొట్టమొదటి సారి.   2036 నాటికి ప్రపంచంలో 10 అగ్రగామి క్రీడప్రధానదేశాల సరసన, 2047 నాటికి అగ్రగామి 5 క్రీడా దేశాల సరసన నిలవాలని దేశం ఆకాంక్షిస్తున్న వేళ ఈ కార్యక్రమం తెర మీదకు వచ్చింది.

 

‘క్రీడాకారులను కేంద్ర స్థానంలో నిలిపే’  కార్యక్రమం కెఐఆర్ టిఐ. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా పారదర్శకతకు ప్రాధాన్యాన్నిచ్చే ఎంపిక పద్ధతి తో ఈ కార్యక్రమం విశిష్టతను సంతరించుకొంది.  వృద్ధి లోకి రావాలని కోరుకొంటున్న క్రీడాకారులలో వారి క్రీడా కౌశలాన్ని గుర్తించడానికి కృత్రిమ మేధ (ఎఐ), డేటా విశ్లేషణ లను ఉపయోగించడం జరుగుతున్నది.

 

కెఐఆర్ టిఐ కార్యక్రమాన్ని గురించి:

 

ఆధునిక ఐసిటి సాధనాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ విధానాల ఆధారంగా ఒక సమగ్ర ప్రతిభా గుర్తింపు వ్యవస్థను అభివృద్ధి పరచడానికి ఖేలో ఇండియా రైజింగ్ టేలెంట్ ఐడెంటిఫికేషన్ (కెఐఆర్ టిఐ.. ‘కీర్తి’) ని రూపొందించడమైంది.   అట్టడుగు స్థాయిలో వున్న ప్రతిభను గుర్తించే పూర్తి ప్రక్రియను ఒకే వేదికను సమకూర్చడం ద్వారా సౌకర్యవంతంగా మార్చాలనేది దీని ఉద్దేశం.

 

క్రీడాకారులకు ప్రాధాన్యాన్ని ఇచ్చే దృష్టికోణం కెఐఆర్ టిఐ ప్రాజెక్టులో కీలకందీనిలో భాగంగా ప్రతి స్థాయిలో ప్రతిభను గుర్తించే ప్రక్రియను మరింత విస్తృతంగాను, అందరికీ అందుబాటులో ఉండే విధంగాను రూపొందించడమైంది.

 

ప్రాజెక్ట్ ‘‘కెఐఆర్ టిఐ’’  తన వికేంద్రీకృత ప్రక్రియ ద్వారాప్రతిభను గుర్తించి క్రీడలలో శ్రేష్ఠత్వాన్ని సాధించడంతో పాటు ఎక్కువ మందికి ప్రాతినిధ్యాన్ని కల్పించాలన్న ఖేలో ఇండియా పథకం లక్ష్యాలను రెండిటినీ సాధించడానికి తోడ్పడనుంది.

 

***



(Release ID: 2034085) Visitor Counter : 8