రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సర్సవా లో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్ రజత జయంతి 2024 వేడుకలు

Posted On: 14 JUL 2024 10:05AM by PIB Hyderabad

 

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) కు  1999 కార్గిల్ యుద్ధంలో బలిదానంతో  చిరస్థాయి శౌర్య పరాక్రమాలతో  వీరోచితంగా  పోరాడిన  వారసత్వం ఉంది. 1999 లో జరిగిన కార్గిల్ యుద్ధం (ఆపరేషన్ సఫేద్ సాగర్) లో ఐ ఏ ఎఫ్ ( IAF) ఆపరేషన్లు మిలిటరీ ఏవియేషన్ చరిత్రలో ఒక మైలురాయి అని చెప్పవచ్చు. 16000 అడుగుల ఎత్తులో ఉన్న కార్గిల్ యుద్ధభూమిలో, అరుదైన ఆపరేషనల్ కష్టాలను ఎదుర్కొంటూ శత్రువు లక్ష్యాలను గుర్తించడం అనేది ఐ ఏ ఎఫ్ సామర్థ్యానికి సాక్ష్యంగా నిలిచింది . సాంకేతిక మార్పులు మరియు ఆన్-ది-సిబ్బంది కి విధినిర్వహణ లో భాగంగా ఇచ్చిన శిక్షణ కారణంగా ఐ ఏ ఎఫ్ తమ వైమానిక శక్తిని ఉపయోగించి ఈ యుద్ధంలో విజయం సాధించింది. మొత్తం మీద, ఐ ఏ ఎఫ్ దాదాపు 5000 స్ట్రైక్  మిషన్స్, 350 గూఢచారి / ఏ ఎల్  ఐ ఎన్  టి  మిషన్స్ మరియు సుమారు 800 స్కార్ట్ ఫ్లైట్లు చేపట్టింది. ఐ ఏ ఎఫ్  హెలికాప్టర్ సార్టీలు  క్షతగాత్రుల  తరలింపులు ప్రమాదంలో ఉన్న వారిని రక్షించడంమరియు వైమానిక రవాణా కోసం సంబందించి 2000 కంటే ఎక్కువ ఆపరేషన్‌లు నిర్వహించింది.

కార్గిల్ విజయానికి 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా, దేశానికి అత్యున్నత సేవలు  ఆత్మబలిదానం చేసిన వీరులను గౌరవిస్తూభారత వాయుసేన 'కార్గిల్ విజయ్ దివస్ రజత్ జయంతి' ని 12 జూలై నుండి 26 జూలై 24 వరకు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సర్సావా లో జరుపుకుంటోంది.  152 హెలికాప్టర్ యూనిట్ 'ది మైటీ ఆర్మర్' సఫేద్ సాగర్ ఆపరేషన్ సమయంలో కీలక పాత్ర పోషించింది.1999 మే 28 న, స్క్వాడ్రన్ లీడర్ ఆర్ పుందిర్, ఫ్లైట్ లెఫ్టినెంట్ ఎస్ ముఖిలన్, సర్జెంట్ పివిఎన్ ఆర్ ప్రసాద్ మరియు సర్జెంట్ ఆర్ కె సాహు లు 152 హెచ్ యూ నుండి 'నుబ్రా' ఫార్మేషన్ గా టొలోలింగ్ వద్ద శత్రువు స్థావరాలపై ప్రత్యక్ష దాడికి వెళ్లినప్పుడు వారి హెలికాప్టర్ను  ఒక శత్రువు స్టింగర్ మిస్సైల్ ఢీకొంది, దానితో  నలుగురు అమూల్యమైన ప్రాణాలను కోల్పోయారు. ఈ అసామాన్య ధైర్యసాహస చర్యకు   వాయు సేన మెడల్ తో వారిని మరణానంతరం సత్కరించారు. వారి సర్వోత్తమత్యాగం వలన వారి పేర్లు భారత వాయుసేన చరిత్రలో శాశ్వతంగా నిలిచి ఉంటాయి.

చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వి ఆర్ చౌధరి, వైమానిక శాఖ సీనియర్  అధికారులు ,వీరజవాన్ల కుటుంబాలు, ఐ ఏ ఎఫ్  ఆఫీసర్లు సమక్షం  లో , స్టేషన్ వార్ మెమోరియల్ వద్ద ఎయిర్ వారియర్స్ కి ఘనంగా నివాళులు అర్పించారు. సి ఏ ఎస్  ఈ సందర్భంగా వారి కుటుంబసభ్యులను సన్మానించి వారితో సంభాషించారు.

ఈ సందర్భంగా  అద్భుత వైమానిక ప్రదర్శన నిర్వహించారు, ఇందులో 'ఆకాశ్ గంగా టీం' వారి వైమానిక విన్యాసాల్లో , 'జాగ్వార్', 'సు-30 ఎం కే ఎల్ ' మరియు 'రాఫేల్' యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. అమరులను స్మరించుకుంటూ  'మిస్సింగ్ మాన్ ఫార్మేషన్'గా ఎం ఐ -17 వి 5 గాలిలోకి ఎగిరింది. ఐ ఏ ఎఫ్  హెలికాప్టర్‌లు ఎం ఐ -17 వి, చీతా, చినూక్ ల  ప్రదర్శనతో పాటు 'ఎయిర్ వారియర్ డ్రిల్ టీం', 'ఎయిర్ ఫోర్స్ బ్యాండ్' ప్రదర్శనలను కూడా నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని  , స్కూల్ పిల్లలు, స్థానిక నివాసితులు, మాజీ సైనికులు, సహరన్‌ఫూర్ స్థానిక ప్రజలు మరియు రూర్కీ, డెహ్రాడూన్ ,అంబాలా కంటోన్మెంట్ల  సిబ్బంది సహా సుమారు 5000 మంది వీక్షించారు. 

***



(Release ID: 2033542) Visitor Counter : 44