ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఆహారం, అనుబంధ రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులతో ముంబాయిలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ చిరాగ్ పాశ్వాన్.
రానున్న వరల్డ్ ఫుడ్ ఇండియా 2024 సమావేశాల సందర్భంగా కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ మంత్రిత్వశాఖతో భాగస్వామ్యానికి గల అవకాశాలు, భారతదేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీల భవిష్యత్ ప్రణాళికల గురించి ఈ సమావేశంలో పరిశ్రమ వర్గాలతో చర్చ.
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో సెప్టెంబర్ 19 నుంచి 22 వరకు జరగనున్న వరల్డ్ ఫుడ్ ఇండియా 2024 సమావేశాలు.
Posted On:
13 JUL 2024 6:39PM by PIB Hyderabad
ఆహారం, అనుబంధ రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులతో ముంబాయిలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ చిరాగ్ పాశ్వాన్ అధ్యక్షత వహించారు. రానున్న వరల్డ్ ఫుడ్ ఇండియా 2024 సమావేశాల సందర్భంగా కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ మంత్రిత్వశాఖతో భాగస్వామ్యానికి గల అవకాశాలు, భారతదేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీల భవిష్యత్ ప్రణాళికల గురించి ఈ సమావేశంలో చర్చించారు. వరల్డ్ ఫుడ్ ఇండియా 2024 సమావేశాలు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో సెప్టెంబర్ 19నుంచి 22 వరకు నిర్వహించనున్నారు. పరిశ్రమ వర్గాలతో జరిగిన ఈ సమావేశంలో సుమారు 30 ఫుడ్ ప్రాసెసింగ్, అనుబంధ రంగాలకు చెందిన కంపెనీలు పాల్గొన్నాయి.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీ చిరాగ్ పాశ్వాన్ మాట్లాడుతూ, కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వశాఖ ఎంతో ప్రత్యేక స్థానం కలిగినదని, ఈ రంగంలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు. వరల్డ్ ఫుడ్ ఇండియా 2024 లో పాల్గొన వలసిందిగా పరిశ్రమ వర్గాలను ఆయన హృదయపూర్వకంగా ఆహ్వానించారు. పరిశ్రమ వర్గాలు ఎదుర్కొంటున్న ఏ అంశపై అయినా పరిశ్రమవర్గాలతో కలసి పనిచేయడానికి శ్రీ చిరాగ్ పాశ్వాన్ ఆసక్తి కనబరిచారు. ఈ రంగానికి చెందిన స్టేక్ హొల్డర్లందరి అంటే ప్రొడ్యూసర్లు, ప్రాసెసర్లు, విద్యారంగానికి చెందిన వారు, స్టార్టప్లు, ఆవిష్కర్తలు ఆత్మనిర్భర భారత్, వికసిత్ భారత్ దార్శనికతను సాధించేందుకు సాగిస్తున్న నిర్విరామ కృషిని మంత్రి అభినందించారు.
వరల్డ్ ఫుడ్ ఇండియా 2024 సందర్భంగా సెప్టెంబర్ 20 , 21 తేదీలలో గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్ల సమ్మేళనం జరుగుతుందని, దీనిని ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ ఏర్పాటు చేస్తున్నదని కూడా మంత్రి తెలిపారు.
సంయుక్త కార్యదర్శి శ్రీ రంజిత్ సింగ్ మాట్లాడుతూ, భారత ఆర్ధిక వ్యవస్థలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగం పోషిస్తున్న కీలక పాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు. స్టేక్ హోల్డర్లు అంటే, పరిశ్రమ వర్గాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వం అకుంఠిత దీక్షతో చేపట్టిన చర్యల కారణంగా ఈ రంగం కీలక మైలు రాళ్లను సాధించగలుగుతోందని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో పాల్గొన్న పరిశ్రమ సభ్యులు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి సంబంధించి భారతీయ మార్కెట్ అవకాశాలపై ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలను వారు ప్రశంసించారు. ఇవి వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరిచాయన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఉత్పత్తితో ముడిపడిన ప్రోత్సాహక పథకం, ఎఫ్.పి.ఐ మంత్రిత్వశాఖ ఫ్లాగ్షిప్ కార్యక్రమమైన ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజనలను వారు ప్రశంసించారు. గతంలో జరిగిన వరల్డ్ ఫుండ్ ఇండియా విషయంలో కూడా వారు తమ కృతజ్ఞతలు తెలిపారు. వరల్డ్ ఫుడ్ ఇండియా 2024లో పాల్గొనేందుకు తమ ఆసక్తిని వ్యక్తం చేశారు. ఈ రంగాన్ని సమష్టిగా మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు, పెద్ద ఎత్తున వరల్డ్ ఫుడ్ ఇండియా 2024లో పాల్గొనేందుకు కట్టుబడి ఉన్నామని పరిశ్రమ వర్గాలు ఈ సందర్భంగా హామీ ఇచ్చాయి.
***
(Release ID: 2033111)
Visitor Counter : 72