రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

ఒలింపిక్ పతక విజేత సైనా నెహ్ వాల్ తో కలసి ఆట ఆడిన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము

Posted On: 10 JUL 2024 10:15PM by PIB Hyderabad

రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కు క్రీడలన్నా, ఆటలన్నా సహజంగానే ఎంత ఇష్టమో తెలిపే ఘట్టమిది. శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రముఖ క్రీడాకారిణి సైనా నెహ్ వాల్ తో కలసి రాష్ట్రపతి భవన్ లోని  బాడ్మింటన్ కోర్టు లో బాడ్మింటన్ ఆడారు. రాష్ట్రపతి వేసిన ఈ ప్రేరణాత్మకమైన ముందడుగు బాడ్మింటన్ లో ఒక తిరుగులేని శక్తి గా భారతదేశం ఎదిగిన తీరుకు, ముఖ్యంగా ఆ ఆట లో ప్రపంచ క్రీడాంగణం లో మన మహిళా క్రీడాకారిణులు కలగజేస్తున్న పెను ప్రభావానికి అనుగుణంగా ఉంది.

 

పద్మ శ్రీ’, ‘పద్మ భూషణ్’ పురస్కారాల ను అందుకొన్న ప్రముఖ భారతీయ క్రీడాకారిణి సైనా నెహ్ వాల్, ‘పద్మ పురస్కారాలను సాధించిన మహిళల తో కూడిన ఆమె కథ – నా కథ’ ఉపన్యాసాల పరంపర లో ఓ భాగం గా రేపటి రోజున రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రం లో శ్రోతలతో సమావేశమై వారితో మాట్లాడనున్నారు.

ఒక చిన్న వీడియో ను ఈ కింద పోస్ట్ చేసిన లింకు లో చూడవచ్చు.

https://www.instagram.com/reel/C9P28PyMCXq/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

 

 

 

***


(Release ID: 2032690) Visitor Counter : 48