సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

ప్రభుత్వం తలపెట్టిన ‘100 రోజుల కార్యక్రమం’లో భాగంగా 133 అటాచ్డ్, అనుబంధ కార్యాలయాల్లో, స్వయం ప్రతిపత్తి సంస్థల్లో ‘ఈ-ఆఫీస్’ విధానం అమలు


అటాచ్డ్, అనుబంధ కార్యాలయాల్లో, స్వయం ప్రతిపత్తి సంస్థల్లో ‘ఈ- ఆఫీస్’ విధానం అమలు నిమిత్తం మార్గదర్శక సూత్రాలను జారీ చేసిన ప్రభుత్వం; పాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం (డి.ఏ.ఆర్.పీ.జీ.) సమన్వయ శాఖగా, నేషనల్ ఇన్ఫోర్మాటిక్స్ సెంటర్ (ఎన్.ఐ.సీ.) సాంకేతిక భాగస్వామిగా వ్యవహరిస్తాయి

డి.ఏ.ఆర్.పీ.జీ. జులై 10, 2024 న ఏర్పాటు చేసిన అంతర్ మంత్రిత్వ శాఖల సమావేశానికి అటాచ్డ్, అనుబంధ కార్యాలయాల, స్వయంప్రతిపత్తి సంస్థల అధికారుల హాజరు, ‘ఈ- ఆఫీస్’ ప్రక్రియ అమలయ్యేందుకు నిర్దేశిత కాలపరిమితి కల పటిష్టమైన ప్రణాళిక సిద్ధం

Posted On: 11 JUL 2024 11:01AM by PIB Hyderabad

కేంద్ర సచివాలయంలో 2019-2024 మధ్యకాలంలో ‘ఈ- ఆఫీస్’కి ప్రాముఖ్యం పెరిగి, 37 లక్షల దస్త్రాలు (దాదాపు 94 శాతం) ఈ-ఫైళ్ల రూపంలో చలామణి కాగా, 95 శాతం మేర ఫైళ్లను ఎలెక్ట్రానిక్ రూపంలో స్వీకరించారు. ‘ఈ- ఆఫీస్’ విధానం మరింత సమర్ధవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ‘ఈ-ఆఫీస్ అనలిటిక్స్’ను అభివృద్ధి పరిచింది. కేంద్ర సచివాలయంలో  ‘ఈ- ఆఫీస్’ వేదిక విజయవంతంగా అమలు కావడంతో, ‘డి.ఏ.ఆర్.పీ.జీ. 100-రోజుల కార్యక్రమం’ లో భాగంగా అన్ని అటాచ్డ్, అనుబంధ కార్యాలయాల, స్వయంప్రతిపత్తి సంస్థలలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్ మంత్రిత్వ శాఖల సమావేశం అనంతరం 133 అటాచ్డ్, అనుబంధ కార్యాలయాలు, స్వయంప్రతిపత్తి కల సంస్థలను ‘ఈ-ఆఫీస్’  విధాన అమలు నిమిత్తం గుర్తించారు.  ‘ఈ-ఆఫీస్’  విధానం అమలు కోసం డి.ఏ.ఆర్.పీ.జీ. అటాచ్డ్, అనుబంధ కార్యాలయాలు, స్వయంప్రతిపత్తి సంస్థలకు  24 జూన్ 2004 న మార్గదర్శకాలను జారీ చేసింది.

డి.ఏ.ఆర్.పీ.జీ. కార్యదర్శి శ్రీ వీ. శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల సమావేశంలో ‘ఈ- ఆఫీస్’  విధానం అమలుకు సంబంధించిన విధి విధానాలను, సాంకేతిక అంశాలనూ చర్చించారు. సమావేశానికి అన్ని మంత్రిత్వ శాఖల/విభాగాల అధికారులు, 133 అటాచ్డ్, అనుబంధ కార్యాలయాలు, స్వయంప్రతిపత్తి సంస్థల  సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఎన్.ఐ.సీ. బృందానికి ప్రాతినిధ్యం వహించిన ఆ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీమతి రచనా శ్రీవాస్తవ, ‘ఈ- ఆఫీస్’ విధానం అమలులో ఎదురయ్యే సాంకేతిక అంశాలను గురించి వివరించారు. 

అన్ని మంత్రిత్వ శాఖలూ తమ పరిధిలోని  అటాచ్డ్, అనుబంధ కార్యాలయాలు, స్వయంప్రతిపత్తి సంస్థలతో సమన్వయం చేసుకుంటూ, నోడల్ అధికారుల నియమకం, డేటా కేంద్రాల ఏర్పాటు చేపట్టాలని, ప్రభుత్వ ‘100-రోజుల కార్యక్రమం’ లో భాగంగా ‘ఈ- ఆఫీస్’ అమలు  ప్రక్రియను నియమిత కాలంలో పూర్తి  చేసేందుకు వీలుగా తమకు అవసరమైన వాడకందారులు లైసెన్సుల సంఖ్య తెలియచేస్తూ ఎన్.ఐ.సీ. కి  అభ్యర్ధనలు పంపాలని కూడా నిర్ణయించారు.

 

***



(Release ID: 2032432) Visitor Counter : 196