సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిన సామాజిక న్యాయం, సాధికారత శాఖ
Posted On:
26 JUN 2024 12:19PM by PIB Hyderabad
ప్రతీ ఏడాది జూన్ 26వ తేదీని “అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినం”గా పాటిస్తారు. సామాజిక న్యాయం, సాధికారత శాఖ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని నేడు (26 జూన్, 2024 ఆ శాఖ సహాయ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్, సీనియర్ అధికారుల సమక్షంలో న్యూఢిల్లీలోని 15 జన్ పథ్ లో ఉన్న డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది.
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని మంత్రిత్వ శాఖ 20.06.2024 నుంచి 26.06.2024 వరకు వారం రోజుల పాటు ఆన్ లైన్ కార్యకలాపాలు నిర్వహించింది. ఆ కార్యక్రమాల్లో వ్యాసరచన పోటీ; మాదక ద్రవ్య రహిత జీవనం కోసం యోగా, ధ్యాన కార్యక్రమం; ఎన్ఎంబిఏ కింద ఉత్తమ ఆచరణల ప్రదర్శన, మాదక ద్రవ్య రహిత సమాజ ప్రచారంలో విశ్వవిద్యాలయ విద్యార్థులకు భాగం కల్పించడం, మాదక రహిత సమాజ సాధనలో మహిళల పాత్ర అనేవి ఉన్నాయి. ఈ కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా ఈ ప్రచారం ప్రజా ఉద్యమంగా మారుతుంది.
మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా రాష్ర్ట, జిల్లా స్థాయిల్లో “నషా ముక్త్ భారత్ అభియాన్” కార్యక్రమంలో భాగంగా ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సెమినార్లు, వర్క్ షాప్ లు, ప్రతిజ్ఞా కార్యక్రమాలు నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకోవాలని దేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, డిసి/డిఎంలకు సూచించారు.
వీటితో పాటు మంత్రిత్వ శాఖ పరిధిలో పని చేస్తున్న స్వయంప్రతిపత్తి సంస్థ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ (ఎన్ఐఎస్ డి) 2024 జూన్ 26 నుంచి 28 వరకు క్విజ్ పోటీలు, చైతన్య కార్యక్రమాలు; బాధిత కుటుంబాల సభ్యులు, నిపుణులతో గోష్ఠి; వారి అనుభావాలు పంచుకోవడం వంటి పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోవడం కోసం ఎన్ జిఓలు/విఓలు ప్రతిజ్ఞా స్వీకారం, చిత్రలేఖన పోటీ, వ్యాసరచన పోటీలు, మొక్కలు నాటే కార్యక్రమం, నుక్కడ్ నాటక పోటీ, ఇండోర్ గేమ్స్ పోటీలు, మారధాన్/ వాకథాన్/ సైకిల్/ బైక్ ర్యాలీలు వంటి కార్యక్రమాలు నిర్వహించాయి.
నషా ముక్త్ భారత్ అభియాన్ (ఎన్ఎంబిఏ)
మంత్రిత్వ శాఖ నషా ముక్త్ భారత్ అభియాన్ (ఎన్ఎంబిఏ) కార్యక్రమం ప్రారంభించింది. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువతపై ప్రతికూల ప్రభావంపై ఈ కార్యక్రమం ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది.. ఉన్నత విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయ క్యాంపస్ లు, పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. అలాగే ఈ కార్యక్రమంలో సమాజాన్ని కూడా భాగస్వామిని చేయడం, తద్వారా అభియాన్ నిర్వహణ సమాజం తీసుకునేలా చర్యలు తీసుకున్నారు.
ఎన్ఎంబిఏ సాధించిన విజయాలు
· ఇప్పటివరకు క్షేత్ర స్థాయిలో నిర్వహించిన పలు కార్యక్రమాల ద్వారా మాదక ద్రవ్యాల దురలవాటుపై 11 కోట్ల మంది పైగా ప్రజలను చైతన్యవంతులను చేశారు. వారిలో 3.50 కోట్ల మందికి పైగా యువత, 2.32 కోట్ల మందికి పైగా మహిళలు ఉన్నారు.
· అభియాన్ సందేశం బాలలు, యువతకు చేరేందుకు వీలుగా 3.35 లక్షలకు పైగా విద్యా సంస్థలు ఈ ప్రచారోద్యమంలో పాల్గొన్నాయి.
· 8000 మంది పైగా మాస్టర్ వలంటీర్లను (ఎంవి) గుర్తించి శిక్షణ ఇచ్చారు.
· అభియాన్ కు చెందిన సామాజిక మాధ్యమ వేదికలు ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ల ద్వారా కూడా చైతన్యం కల్పించే ప్రచారం చేశారు.
· ఎన్ఎంబిఏ కార్యకలాపాల గురించిన సమాచారం సేకరించేందుకు ఎన్ఎంబిఏ మొబైల్ అప్లికేషన్ కూడా అభివృద్ధి చేశారు. జిల్లా, రాష్ర్ట, జాతీయ స్థాయిలో జరుగుతున్న కార్యకలాపాలన్నీ ఈ డాష్ బోర్డులో అందుబాటులో ఉంటాయి.
· ఎన్ఎంబిఏ వెబ్ సైట్ (http://nmba.dosje.gov.in) అభియాన్, ఎన్ఎంబిఏ ఆన్ లైన్ చర్చా వేదిక, ఎన్ఎంబిఏ డాష్ బోర్డు, ఇ-ప్లెడ్జ్ గురించిన సమాచారాన్ని సందర్శకులకు అందచేస్తుంది.
· జాతీయ స్థాయిలో ఆన్ లైన్ ద్వారా చేపట్టిన మాదక ద్రవ్య రహిత ప్రమాణ కార్యక్రమంలో 99,595 విద్యా సంస్థలకు చెందిన 1.67 కోట్ల మందికి పైగా విద్యార్థులు మాదక ద్రవ్యాలు వినియోగించబోమని ప్రతిన చేశారు.
· యువత, విద్యార్థులు, ఇతర వర్గాలన్నింటి భాగస్వామ్యం, అనుసంధానత కోసం ‘‘నషే సే అజాదీ లాంటి జాతీయ స్థాయిలో యువత, విద్యార్థుల మధ్య గోష్ఠి కార్యక్రమం’’, ‘‘న్యాయ భారత్, నషా ముక్త్ భారత్’’, ‘‘ఎన్ సిసితో ఎన్ఎంబిఏ గోష్ఠి’’ వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
· ఎన్ఎంబిఏకు మద్దతు ఇవ్వడంతో పాటు ప్రజా చైతన్య కార్యక్రమాల నిర్వహణ కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్, బ్రహ్మకుమారీస్, సంత్ నిరంకారీ బిషన్, రామచంద్ర మిషన్ (దాజీ), ఇస్కాన్, అఖిల ప్రపంచ గాయత్రీ పరివార్ వంటి ఆధ్యాత్మిక/సామాజిక సేవా సంస్థలతో ఎంఓయులపై సంతకాలు చేశారు.
· ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వంటి వేదికల్లో హ్యాండిల్స్ ఏర్పాటు చేయడం ద్వారా టెక్నాలజీని, సామాజిక మాధ్యమాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని ఆన్ లైన్ లో అభియాన్ సందేశం అందరికీ చేరేలా చేయగలిగారు.
· జిల్లాలు, మాస్టర్ వలంటీర్ల స్థాయిలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు తెలియచేసేందుకు ఆండ్రాయిడ్ ఆధారిత మొబైల్ యాప్ రూపొందించారు. గూగుల్ ప్లే స్టోర్ లో ఈ యాప్ అందుబాటులో ఉంది.
· డీ ఎడిక్షన్ కేంద్రాలను ప్రజలకు తేలిగ్గా అందుబాటులో ఉంచేందుకు వీలుగా వాటిని జియో టాగింగ్ చేశారు.
దేశంలో మాదక ద్రవ్యాల డిమాండును అదుపు చేయడంలో కృషి చేసేందుకు సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. మాదక ద్రవ్యాల వినియోగ నిరోధం, సమస్య తీవ్రత మదింపు, నివారణ చర్యలు, చికిత్స, బాధితుల పునరావాసం, సమాచార పంపిణీ వంటి కార్యక్రమాలన్నింటినీ ఈ శాఖ సమన్వయం చేస్తుంది.
మాదక ద్రవ్యాల వినియోగ సంబంధిత వైకల్యం దేశంలో సామాజిక జిగిని తీవ్రంగా భంగపరుస్తుంది. మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యం, బాధితుల కుటుంబాలను దెబ్బ తీయడమే కాదు, యావత్ సమాజాన్ని కల్లోలితం చేస్తుంది. మస్తిష్కంపై ప్రభావం చూపే కొన్ని రకాల మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తి ఆధారనీయతకు దారి తీస్తుంది. కొన్ని రకాల మాదక ద్రవ్యాలు న్యూరో-సైకియాట్రిక్ వ్యాధులు, కార్డియో వాస్కులర్ వ్యాధులకు కారణం అవుతాయి. ప్రమాదాలు, ఆత్మహత్యలు, దౌర్జన్యకాండ వంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. అందుకే మాదక ద్రవ్యాల వినియోగాన్ని సైకో-సోషల్-మెడికల్ సమస్యగా పరిగణనలోకి తీసుకోవాలి.
***
(Release ID: 2031782)
|