సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

46వ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశం కోసం ప్రాజెక్ట్ 'పారి' ని ప్రారంభించిన సాంస్కృతిక మంత్రిత్వ శాఖ


దేశ గతిశీల సాంస్కృతిక నిర్మాణానికి దోహదపడే సంభాషణగా, ప్రతిబింబంగా, స్ఫూర్తిని
ప్రేరేపించడం ప్రాజెక్ట్ 'పారి' లక్ష్యం

దేశం నలుమూలల నుండి 150 మందికి పైగా విజువల్ ఆర్టిస్టులు రాబోయే ఈవెంట్ కోసం జాతీయ రాజధానిలోని వివిధ సైట్‌లలో పబ్లిక్ ప్రదేశాలను అందంగా తీర్చిదిద్దుతున్నారు.

Posted On: 06 JUL 2024 6:50PM by PIB Hyderabad

భారతదేశం చాలా కాలంగా కళాత్మక వ్యక్తీకరణకు శక్తివంతమైన కేంద్రంగా ఉంది, దాని గొప్ప పబ్లిక్ ఆర్ట్ దేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది. పురాతన గుహాలయాలు, సంక్లిష్టమైన కుడ్యచిత్రాల నుండి గ్రాండ్ పబ్లిక్ శిల్పాలు, శక్తివంతమైన వీధి కళల వరకు, భారత్ ప్రకృతి దృశ్యాలు ఎల్లప్పుడూ కళాత్మక అద్భుతాలతో అలంకరించుకుంది. చారిత్రాత్మకంగా, కళ రోజువారీ జీవితం, మతపరమైన పద్ధతులు, సామాజిక ఆచారాలతో లోతుగా ముడిపడి, నృత్యం, సంగీతం, థియేటర్, దృశ్య కళల వంటి వివిధ పద్ధతుల ద్వారా వ్యక్తమవుతుంది.

ప్రాజెక్ట్ పారి (పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా) అనేది లలిత కళా అకాడమీ, నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ చొరవ. సహస్రాబ్దాల కళాత్మక వారసత్వం (లోక్ కళా/లోక్ సంస్కృతి) నుండి ప్రేరణ పొందే ప్రజా కళను ఆధునిక ఇతివృత్తాలు, సాంకేతికతలను కలుపుతూ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఈ వ్యక్తీకరణలు భారతీయ సమాజంలో కళకు ఉన్న అంతర్గత విలువను నొక్కి చెబుతాయి, సృజనాత్మకత, కళాత్మక వ్యక్తీకరణ పట్ల దేశం శాశ్వత నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ప్రాజెక్ట్ పారి కింద మొదటి కార్యక్రమం ఢిల్లీలో జరుగుతోంది. ఇది 21-31 జూలై 2024 మధ్య కొత్త దిల్లీలో జరగనున్న వరల్డ్ హెరిటేజ్ కమిటీ  46వ సెషన్‌తో సమానంగా ఉంటుంది.

బహిరంగ ప్రదేశాలలో కళ చాలా ముఖ్యమైనది, ఇది దేశ గొప్ప, విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. వివిధ ప్రదేశాలలో  ఉండే కళల ద్వారా ప్రజాస్వామ్యీకరణ పట్టణ ప్రకృతి దృశ్యాలను అందుబాటులో ఉండే గ్యాలరీలుగా మారుస్తుంది. ఇక్కడ కళ మ్యూజియంలు, గ్యాలరీల వంటి సాంప్రదాయ వేదికల పరిమితులను అధిగమించింది. వీధులు, ఉద్యానవనాలు, రవాణా కేంద్రాలలో కళను ఏకీకృతం చేయడం ద్వారా, ఈ కార్యక్రమాలు కళాత్మక అనుభవాలు అందరికీ అందుబాటులో ఉండేలా చూస్తాయి. ఈ కలుపుకొని ఉన్న విధానం భాగస్వామ్య సాంస్కృతిక గుర్తింపును పెంపొందిస్తుంది. సామాజిక ఐక్యతను పెంచుతుంది, పౌరులను వారి రోజువారీ జీవితంలో కళతో నిమగ్నమవ్వడానికి ఆహ్వానిస్తుంది. ప్రాజెక్ట్ పారి దేశ గతిశీల సాంస్కృతిక నిర్మాణానికి దోహదపడే సంభాషణగా, ప్రతిబింబంగా,  స్ఫూర్తిని ప్రేరేపించడం లక్ష్యంగా నిలుస్తుంది.

ఈ ప్రాజెక్ట్ కింద సిద్ధమవుతున్న వివిధ వాల్ పెయింటింగ్‌లు, కుడ్యచిత్రాలు, శిల్పాలు, ఇన్‌స్టాలేషన్‌లను రూపొందించడానికి దేశం నలుమూలల నుండి 150 మందికి పైగా దృశ్య కళాకారులు ఒకే వేదికపైకి వచ్చారు. సృజనాత్మక కాన్వాస్‌లో ఫాడ్ పెయింటింగ్స్ (రాజస్థాన్), థంగ్కా పెయింటింగ్ (సిక్కిం/లడఖ్), మినియేచర్ పెయింటింగ్ (హిమాచల్ ప్రదేశ్), గోండ్ ఆర్ట్ (మధ్యప్రదేశ్), తంజోర్ పెయింటింగ్‌ల ద్వారా ప్రేరణ పొందిన మరియు/లేదా గీసిన కళాకృతులు ఉన్నాయి. తమిళనాడు), కలంకారి (ఆంధ్రప్రదేశ్), అల్పోనా ఆర్ట్ (పశ్చిమ బెంగాల్), చెరియాల్ పెయింటింగ్ (తెలంగాణ), పిచ్వాయ్ పెయింటింగ్ (రాజస్థాన్), లంజియా సౌరా (ఒడిశా), పట్టచిత్ర (పశ్చిమ బెంగాల్), బని థాని పెయింటింగ్ (రాజస్థాన్), వార్లీ ( మహారాష్ట్ర), పితోరా ఆర్ట్ (గుజరాత్), ఐపాన్ (ఉత్తరాఖండ్), కేరళ కుడ్యచిత్రాలు (కేరళ), అల్పనా ఆర్ట్ (త్రిపుర) ఇంకా మరిన్ని కలలతో ముందుకు వచ్చారు.

ప్రాజెక్ట్ పారి కోసం రూపొందిస్తున్న ప్రతిపాదిత శిల్పాలలో ప్రకృతికి నివాళులు అర్పించడమే కాకుండా విస్తృత ఆలోచనలు, నాట్యశాస్త్రం, గాంధీజీ, భారతదేశపు బొమ్మలు, ఆతిథ్యం, పురాతన జ్ఞానం, నాద్ లేదా ప్రాచీన సౌన్, జీవిత సామరస్య స్ఫూర్తితో కూడిన ఆలోచనలు,  కల్పతరు – దివ్య వృక్షం మొదలైనవి ఉన్నాయి.  

ప్రతిపాదిత 46వ వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్‌తో సమకాలీకరించబడి, కొన్ని కళాఖండాలు, శిల్పాలు బింబెట్కా వంటి ప్రపంచ వారసత్వ ప్రదేశాల నుండి ప్రేరణ పొందాయి. భారతదేశంలోని 7 సహజ ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ప్రతిపాదిత కళాఖండాలలో ప్రత్యేక స్థానాన్ని పొందాయి. మహిళా కళాకారులు ప్రాజెక్ట్ పారిలో అంతర్భాగంగా ఉన్నారు. వారి పెద్ద సంఖ్యలో పాల్గొనడం భారత్ నారీ శక్తికి నిదర్శనం.  ప్రాజెక్ట్ పారిలోని ప్రదర్శనాంశాలతో మీ సెల్ఫీని క్లిక్ చేయండి. మీ చిత్రాలను సోషల్ మీడియాలో #ProjectPARIతో షేర్ చేయండి. 

కళాకృతులకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో https://lalitkala.gov.in/pariprojectలో అందుబాటులో ఉంటాయి

***


(Release ID: 2031441) Visitor Counter : 120