ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
జెనీవాలో జరిగిన 33వ పీఎంఎన్‌సీహెచ్ బోర్డు సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ జేపీ నడ్డా కీలకోపన్యాసం
Posted On:
05 JUL 2024 4:42PM by PIB Hyderabad
మహిళలు, పిల్లలు, కౌమారుల సంక్షేమం పట్ల పీఎంఎన్‌సీహెచ్ నిబద్ధతను ప్రసంశించిన నడ్డా..ఈ సమస్యపై ముందుకెళ్లటానికి, అర్థవంతమైన యువ భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి భారత ప్రభుత్వం ఇచ్చిన హామీని పునరుద్ఘాటించిన మంత్రి.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాల దిశగా పురోగతిని వేగవంతం చేయడం, 2030 అనంతర ఎజెండాకు సిద్ధమవటంపై దృష్టిని కొనసాగించానికి సంబంధించి ప్రాముఖ్యతను నొక్కి చెప్పిన అమాత్యులు
మాతా, నవజాత, శిశు ఆరోగ్యం కోసం భాగస్వామ్యం (పీఎమ్ఎన్‌సీహెచ్-పార్ట్‌నర్‌షిప్ ఫర్ మెటర్‌నల్, న్యూ బార్న్, చైల్డ్ హెల్త్) బోర్డు 33వ సమావేశం 2024 జూలై 4న స్విట్జర్లాండ్ లోని జెనీవాలో ప్రారంభమైంది. ఈ సమావేశం 2024 జూలై 5న ముగిసింది.
కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, పీఎంఎన్‌సీహెచ్ బోర్డు వైస్ చైర్మన్ శ్రీ. జగత్ ప్రకాశ్ నడ్డా వీడియో సందేశం ద్వారా బోర్డు సమావేశం ప్రారంభ సెషన్‌లో కీలకోపన్యాసం చేశారు. మహిళలు, పిల్లలు, కౌమారుల శ్రేయస్సు కోసం పీఎంఎన్‌సీహెచ్ నిబద్ధతను జగత్ ప్రకాష్ నడ్డా ప్రశంసించారు. ఈ సమస్యపై ముందుకెళ్లటానికి, అర్థవంతమైన యువ భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి భారత ప్రభుత్వం ఇచ్చిన హామీని పునరుద్ఘాటించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(ఎస్‌డీజీ) దిశగా పురోగతిని వేగవంతం చేయడం, 2030 అనంతర ఎజెండాకు సిద్ధమవటంపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కిచెప్పారు. ఉమ్మడి లక్ష్యాల సాధన విషయంలో భాగస్వామ్యాల శక్తి గురించి ప్రధానంగా ప్రస్తావించిన ఆయన బహుళ వాటాదారులు(స్టేక్ హోల్డర్స్) ఏకతాటిపై పనిచేయాలని కోరారు.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, మిషన్ డైరెక్టర్ (ఎన్‌హెచ్‌ఎం) శ్రీమతి ఆరాధన పట్నాయక్ జెనీవాలో జరుగుతోన్న పీఎంఎన్‌సీహెచ్ 33వ బోర్డు సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్నారు.
మహిళలు, పిల్లలు, కౌమారదశలో ఉన్నవారి ఆరోగ్యం, శ్రేయస్సు, హక్కులను రక్షించడానికి, ప్రోత్సహించడానికి కట్టుబడి ఉన్న ప్రపంచంలోని అతిపెద్ద కూటమి పీఎంఎన్‌సీహెచ్. ప్రతి మహిళ, చిన్నారి, కౌమారదశలో ఉన్నవారు తమ ఆరోగ్యం, శ్రేయస్సులకు సంబంధించిన హక్కును ఒక్కరు కూడా మిగిలిపోకుండా గుర్తించే ప్రపంచం సాధించాలన్నదే ఈ భాగస్వామ్యం దార్శనికత. పీఎంఎన్‌సీహెచ్ పరిపాలనను బోర్డు చూసుకుంటుంది. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) సెక్రటేరియట్ ఈ కూటమి నిర్వహణను చూసుకుంటోంది.
ప్రస్తుత 2021-2025 వ్యూహం చివరి కాలంలో మాతా, నవజాత, శిశు ఆరోగ్యం(ఎమ్ఎన్‌సీహెచ్).. లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యం, హక్కులు(ఎస్‌ఆర్‌హెచ్‌ఆర్).. కౌమార శ్రేయస్సు లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి పీఎంఎన్‌సీహెచ్‌కు ఉన్న అవకాశాలు, ప్రధాన ప్రాధాన్యతలపై అంగీకారానికి వచ్చేందుకు ఈ 33వ బోర్డు సమావేశం అవకాశాన్ని కల్పించింది. ఐక్యరాజ్యసమితి 2030 అనంతర అభివృద్ధి లక్ష్యాలను నిర్ణయించే ప్రక్రియలో తన సమస్యలు, తమ ప్రమేయాన్ని ఏ విధంగా ఉండేలా చూసుకోవాలన్న దానితో సహా 2026-2030కి సంబంధించి పీఎంఎన్‌సీహెచ్ వ్యూహ అభివృద్ధికి ఉన్న ప్రాధాన్యాతలపై ఈ సమావేశం చర్చను ప్రారంభిస్తుంది.
***
(Release ID: 2031279)
Visitor Counter : 69