నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
ఎస్ఐజీహెచ్‌టీ పథకం(మొదటి విధానం, రెండో విడత) కింద గ్రీన్ హైడ్రోజెన్ అమలు కోసం పథక మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ
Posted On:
05 JUL 2024 2:58PM by PIB Hyderabad
'స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ ఫర్ గ్రీన్ హైడ్రోజెన్ ట్రాన్సిషన్(ఎస్ఐజీహెచ్‌టీ) కార్యక్రమం - కాంపొనెంట్ II: హరిత ఉదజని(గ్రీన్ హైడ్రోజెన్) ఉత్పత్తి( మోడ్ 1 కింద)- విడత-II కోసం ప్రోత్సాహక పథకం' అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ(ఎంఎన్ఆర్ఈ) జూలై 3, 2024 నాడు ప్రకటించింది.
విడత-IIలో 4,50,000 టీపీఏ హరిత ఉదజని సామర్థ్యం ఉండనున్నది. ఇందులో 40,000 టీపీఏ సామర్థ్యం బయోమాస్ ఆధారిత మార్గాలకు(బకెట్-II)కి ప్రత్యేకంగా కేటాయించగా, మిగతాది ఇతర సాంకేతికత ఆధారిత మార్గాలు(బకెట్-I) కేటాయిస్తారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఈసీఐ) ఈ విడత కార్యక్రమాన్ని అమలు చేసే సంస్థగా బాధ్యత వహించనుంది. త్వరలోనే రిక్వెస్ట్ ఫర్ సెలక్షన్(ఆర్ఎఫ్ఎస్)ను ఎస్ఈసీఐ జారీ చేయనుంది.
వేలందారు పేర్కొన్న కనీస సగటు ప్రోత్సాహకం ఆధారంగా వేలం నిర్వహిస్తారు. బకెట్-I కింద కనిష్ట బిడ్ 10,000 టీపీఏ కాగా గరిష్ట బిడ్ 90,000 టీపీఏగా ఉంటుంది. బకెట్-IIలో కనిష్ట బిడ్ సామర్థ్యం 500 టీపీఏ కాగా గరిష్ట సామర్థ్యం 4000 టీపీఏ. వేలంలో పాల్గొనేవారు రెండింటికీ లేదా ఏదైనా ఒక బకెట్‌కు పాల్గొనవచ్చు. ఈ విడతలో ఒక్కరికి గరిష్ట సామర్థ్యంగా 90,000 టీపీఏ వరకు కేటాయిస్తారు.
జాతీయ హరిత ఉదజని మిషన్‌ను 2029-30 ఆర్థిక సంవత్సరం వరకు చేపట్టేలా రూ.19,744 కోట్ల వ్యయంతో జనవరి 4, 2023లో ప్రారంభించారు. స్వచ్ఛ ఇంధనం ద్వారా ఆత్మ నిర్భర్(స్వయం సమృద్ధి) సాధించాలనే, ప్రపంచ స్వచ్ఛ ఇంధన పరివర్తనకు ఆదర్శంగా నిలవాలనే భారతదేశ లక్ష్యానికి ఇది దోహదపడుతుంది. ఆర్థిక వ్యవస్థలో డీకార్బనైజేషన్ కోసం, శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు, హరిత ఉదజనిలో కొత్త సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు, మార్కెట్ లీడర్‌గా మారేందుకు ఈ మిషన్ తోడ్పడనుంది.
***
(Release ID: 2031085)
Visitor Counter : 121