జల శక్తి మంత్రిత్వ శాఖ
స్టాప్ డయేరియా (అతిసారవ్యాధి నిరోధక) జాతీయ ప్రచారంతో చేతులు కలిపిన రక్షిత మంచినీరు, పారిశుద్ధ్య విభాగం
Posted On:
05 JUL 2024 12:50PM by PIB Hyderabad
రక్షిత మంచినీరు ఉపయోగించడాన్ని, గ్రామ, పంచాయతీ స్థాయిలలో పారిశుద్ధ్య పద్ధతులను అనుసరించడాన్ని ప్రోత్సహించేందుకు 1 జులై 2024 నుంచి స్వచ్ఛ గాంవ్, శుద్ధ్ జల్ - బెహతర్ కల్ (స్వచ్ఛ గ్రామం -రక్షిత నీరు - మెరుగైన భవిష్యత్తు)నినాదంతో రెండు నెలల అవగాహనా ప్రచారాన్ని ప్రారంభించిన డిడిడబ్ల్యుఎస్ గ్రామీణ పారిశుద్ధ్య మిషన్- జాతీయ స్టాప్ డయేరియా ప్రచారం మధ్య సమన్వయం ప్రజారోగ్యం పట్ల దృఢసంకల్పాన్ని నొక్కి చెప్తుంది శ్రీ సి.ఆర్. పాటిల్
న్యూఢిల్లీ, 5 జులై (పిఐబి)ః కేంద్ర ఆరోగ్య మంత్రి శ్రీ జె.పి. నడ్డా, కేంద్ర సహాయమంత్రులు, కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాల సీనియర్ అధికారులు, అభివృద్ధి భాగస్వాముల ప్రతినిధులతో కలిసి 24 జూన్ 2024న ప్రారంభించిన జతీయ స్టాప్ డయేరియా ప్రచారంతో జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధీనంలోని రక్షిత మంచి నీరు - పారిశుద్ధ్య విభాగం (డిడిడబ్ల్యుఎస్) చేతులు కలిపింది.
ఈ భాగస్వామ్యం ప్రాముఖ్యతను కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ సి.ఆర్. పాటిల్ ఉద్ఘాటించారు. గ్రామీణ పారిశుద్ధ్య మిషన్, జాతీయ స్టాప్ డయేరియా ప్రచారం మధ్య సమన్వయం ప్రజారోగ్యం పట్ల మా తిరుగులేని నిబద్ధతను నొక్కి చెప్తుంది. ఈ సమిష్టి కృషి ద్వారా, బాలల మరణాలను తగ్గించడమే కాకుండా గ్రామీణ భారతంలో ఆరోగ్యం, పారిశుద్ధ్య సంస్కృతిని ప్రోత్సహించడాన్ని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం, అని ఆయన వివరించారు.
డిడిడబ్ల్యుఎస్ కార్యదర్శి విని మహాజన్ మాట్లాడుతూ, మన పిల్లల, సమూహాల ఆరోగ్యాన్ని పరిరక్షించే దిశలో ఈ చొరవ కీలకమైందంటూ తన నిబద్ధతను ప్రకటించారు. జాతీయ స్టాప్ డయేరియా ప్రచారంతో తమ కృషిని సమన్వయం చేయడం ద్వారా, అతిసార వంటి నివారించగలిగిన వ్యాధులతో పిల్లలు మరణించకుండా నిరోధించడం తమ లక్ష్యమన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం రక్షిత మంచినీరు, పారిశుద్ధ్యం పై తాము దృష్టి పెట్టడం కీలకమన్నారు.
రెండు నెలల కాలంలోసమగ్రమైన, బహుళ క్షేత్ర విధానాన్ని అనుసరిస్తూ బాలల మరణాన్ని పూర్తిగా అరికట్టాలన్నది జాతీయ స్టాప్ డయేరియా ప్రచార లక్ష్యం.
కీలకంగా దృష్టి పెట్టే అంశాలు-
ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంః ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య కేంద్రాల నిర్వహణ, అత్యవసర వైద్య సరఫరాల (ఓఆర్ఎస్, జింక్) పంపిణీకికు హామీ.
రక్షిత నీరు, పారిశుద్ధ్యం మరింత అందుబాటులోకి తేవడంః రక్షిత మంచినీరు, పారిశుద్ధ్యానికి నిలకడైన, స్థిరమైన నాణ్యతా ప్రమాణాల నియంత్రణతో పద్ధతులు పాటించడం
పౌష్టికాహార కార్యక్రమాలు పెంపుః అతిసార వ్యాధుల నిరోధానికి పోషకాహార లోపాన్ని సవిరించేందుకు చర్యలు
పారిశుద్ధ్య విద్యకు ప్రోత్సాహంః పాఠశాలల్లో అవసరమైన సౌకర్యాలను అందించడం, పారిశుద్ధ్యం గురించి పిల్లలలో అవగాహన పెంచడం
ఈ చొరవకు పూరకంగా, 1జులై నుంచి 31 ఆగస్టు 2024వరకు స్వచ్ఛ గాంవ్, శుద్ధ జల్ - బెహర్‌కల్ నినాదంతో రక్షిత నీరు, పారిశుద్ధ్యంపై అవగాహనా ప్రచారాన్ని డిడిడబ్ల్యుఎస్ ప్రారంభించింది. గ్రామ, పంచాయతీ స్థాయిలో అవగాహనను పెంచడం, రక్షిత నీరు, పారిశుద్ధ్య పద్ధతులను అనుసరించేందుకు ఈ ప్రచారాన్ని రూపొందించింది.
అతిసార వ్యాధి కారణంగా బాల్యంలో మరణాలను తగ్గించడం, సంపూర్ణ స్వాస్థ్య, స్వచ్ఛ భారత్ దిశగా గ్రామాలు బహిర్గత మలవిసర్జన రహిత ప్లస్ నమూనా హోదాను నిలకడగా సాధించడాన్ని సమర్ధిస్తూ, గ్రామీణ భారతంలో సంపూర్ణ ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడమనే లక్ష్యంతో ప్రారంభించిన జాతీయ స్టాప్ డయేరియా ప్రచారం ఈ కృషి దోహదం చేస్తుంది.
కీలక ప్రచార కార్యకలాపాలుః
సామాజిక భాగస్వామ్యంః గ్రామీణ జల, పారిశుద్ధ్య కమిటీలు, నీటి సమితులు, స్థానిక సంస్థలు కలిసి సమాజంలోని అన్ని వర్గాలు ఇందులో పాలుపంచుకుని, పూర్తి స్థాయిలో భాగస్వాములను చేసేందుకు కృషి చేస్తాయి.
నీటి నాణ్యత పరీక్షలుః ఫీల్డ్ టెస్ట్ కిట్‌ల ద్వారా క్రమం తప్పకుండా నీటిని పరీక్షించడం, ఎడబ్ల్యుసి, పాఠశాలలు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, కమ్యూనిటీ సెంటర్లలో ఫలితాలను ప్రదర్శించడం.
చైతన్యం కోసం వర్క్‌షాప్‌లుః స్థానిక సమూహాలు, ప్రభుత్వ అధికారులు, ఇతర భాగస్వాములకు జల నిర్వహణ, పారిశుద్ధ్యం, పరిశుభ్రతను ప్రోత్సహించడంలో జిల్లా జల, పారిశుద్ధ్య మిషన్లు శిక్షణనిస్తాయి.
లీకేజీలను గుర్తించి, మరమ్మత్తుల చర్యలుః కాలుష్యాన్ని నివారించేందుకు, జల సంరక్షణకు జల సరఫరా వ్యవస్థల తనిఖీ, మరమ్మత్తులు
ప్రజావగాహనా ప్రచారాలుః పరిశుభ్రమైన మంచినీరు, పరిశుభ్రత కోసం రక్షిత పారిశద్ధ్య పద్ధతులు, ఐహెచ్‌హెచ్ఎల్/ సిఎస్‌సి వినియోగం, నీటిద్వారా సంక్రమించే వ్యాధులను నిరోధించడం
బలహీనవర్గాలపై ప్రత్యేక దృష్టిః అతిసార, ఇతర నీటి సాంక్రమిక వ్యాధుల ఘటనలను తగ్గించేందుకు ఐదేళ్ళ వయసు లోపు పిల్లలను, వృద్ధులను లక్ష్యంగా చేసుకోవడం
విద్యా చొరవలుః బాలింతలు, కౌమారంలో ఉన్న బాలికలకు సరైన పారిశుద్ధ్యం, ఆరోగ్యవంతమైన పద్ధతులతో పాటు చిన్న పిల్లల మలవిసర్జనను సరైన పద్ధతిలో పారవేయడం, చేతుల పరిశుభ్రతపై వర్క్‌షాప్‌లు, శిక్షణా సెషన్ల నిర్వహణ
దశలవారీ అమలు
వారాలు 1&2 ః ప్రచార కార్యక్రమం ప్రారంభం, సమైక్య సమావేశాలు, నీటి నాణ్యత పరీక్షించడం, అవగాహన సదస్సులు
వారాలు 3&4 ః గ్రామీణ పారిశుద్ధ్యం కోసం లీకేజీని గుర్తించి, మరమ్మత్తుల చర్యలు, ప్రజావగాహనా ప్రచారాలు, పారిశుద్ధ్య డ్రైవ్‌లు , సంస్థలలో సబ్బుతో చేతులు కడుక్కొనే సౌకర్యానికి హామీ.
వారాలు 5&6 ః క్లోరిన్ పరీక్ష, ప్రజావగాహనా ప్రచారాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలలో ప్రత్యేక దృష్టితో సాధారణ వాడుకనీటి నిర్వహణ (గ్రీన్ వాటర్), పని చేయని మరుగుదొడ్ల నిర్వహణ
వారాలు 7&8ః స్థానిక సమాజాలతో కలవడం, వర్షపు నీటి నిల్వ, ఆవాసాలలో వ్యక్తిగత మరుగుదొడ్ల (ఐహెచ్‌హెచ్ఎల్) కోసం ప్రత్యేక డ్రైవ్‌లు, సామాజిక పారిశుద్ధ్యం భవనం (సిఎస్‌సి) నిర్మాణం, ఆరోగ్యం కోసం రక్షిత మంచినీటిపై ఇంటింటికీ కరపత్రాలు పంచడం
***
(Release ID: 2031008)
Visitor Counter : 117