వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ప్రజల భద్రతకు అనుగుణంగానే పెట్రోలియం మరియు పేలుడు పదార్థాల పరిశ్రమలకు అనుమతులు: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖామంత్రి శ్రీ పీయూష్ గోయల్


పి.ఇ.ఎస్.ఓ. ద్వారా మంజూరయ్యే లైసెన్సుల కోసం మహిళా వ్యాపారవేత్తలకు 80%, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు 50% లైసెన్స్ ఫీజు రాయితీ ప్రకటించిన శ్రీ గోయల్

30 నుండి 50 మీటర్ల లోపు నివాస ప్రాంతాలు గల ప్రాంతాలలో పెట్రోల్ పంపుల నిర్వహణకు అనుమతించడానికి భద్రతా చర్యల విధానాన్ని పి.ఈ.ఎస్.ఓ. రూపొందిస్తుంది: శ్రీ గోయల్

పెట్రోలియం మరియు పేలుడు పదార్థాల పరిశ్రమ మరియు పి.ఈ.ఎస్.ఓ. వాటాదారులతో చర్చించిన శ్రీ గోయల్

Posted On: 04 JUL 2024 3:35PM by PIB Hyderabad

పెట్రోలియం మరియు పేలుడు పదార్థాల భద్రత సంస్థ (పి.ఈ.ఎస్.ఓ.) పనితీరు సామర్థ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో పెట్రోలియం, పేలుడు పదార్థాలు, బాణసంచా మరియు ఇతర సంబంధిత పరిశ్రమల ప్రముఖుల దృక్కోణాలను మరియు అభిప్రాయాలను తెలుసుకునేందుకు కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అధ్యక్షతన నిన్న న్యూఢిల్లీలో వాటాదారుల సదస్సు నిర్వహించారు. పెట్రోలియం మరియు పేలుడు పదార్థ పరిశ్రమలకు అనుమతులు ప్రజా భద్రతకు అనుగుణంగానే జారీ చేయాలని శ్రీ గోయల్ పేర్కొన్నారు. ఈ వాటాదారుల సదస్సు డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డి.పి.ఐ.ఐ.టి.) ఆధ్వర్యంలో నిర్వహించబడింది.

పి.ఈ.ఎస్.ఓ. ద్వారా మంజూరయ్యే లైసెన్సుల కోసం మహిళా వ్యాపారవేత్తలకు 80%, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు 50% లైసెన్స్ ఫీజు రాయితీని శ్రీ గోయల్ ప్రకటించారు. 30 నుండి 50 మీటర్లలోపు నివాసాలు ఉన్న ప్రాంతాలలో పెట్రోల్ పంపుల రిటైల్ అవుట్‌లెట్లను నిర్వహించేలా భద్రతా చర్యల విధానాన్ని రూపొందించడానికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సి.పి.సి.బి.) మరియు పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ (ఎం.ఓ.పి.ఎన్.జి.)తో సంప్రదించి మార్గదర్శకాలను రూపొందించాలని పి.ఈ.ఎస్.ఓ.ని ఆయన ఆదేశించారు.

గ్యాస్ సిలిండర్స్ రూల్స్ (జీసీఆర్) ముసాయిదాలో సిలిండర్ల కోసం క్యూఆర్ కోడ్‌ను కేటాయించడం గురించి పొందుపరిచామని, త్వరలోనే దానికి సంబంధించి తుది నోటిఫికేషన్ వెలువడుతుందని మంత్రి తెలిపారు. పేలుడు పదార్థాలు, వాటి రవాణా, తయారీకి సంబంధించి పదేళ్లపాటు లైసెన్సు ఇవ్వడంలో సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. పేలుడు పదార్ధాలు మినహా అన్ని లైసెన్సులు పదేళ్ల కాలానికి ఇవ్వబడుతున్న క్రమంలో వీటి కోసం కూడా లైసెన్స్ యొక్క చెల్లుబాటును 10 సంవత్సరాలకు పెంచే అంశాన్ని ఆ కమిటీ పరిశీలిస్తుంది.

ఈ ప్రక్రియ మరింత సజావుగా కొనసాగించుటకు, మరిన్ని ప్రాంతాల్లో థర్డ్ పార్టీ ఇన్‌స్పెక్షన్ ఏజెన్సీలను (టి.పి.ఐ.ఎ.) దీనిలో భాగం చేయడానికి కృషి చేయాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటికీ ఆఫ్‌లైన్‌ విధానంలో కొనసాగుతున్న కొన్ని ఏరియాల కోసం ఆన్‌లైన్ పర్మిషన్ మాడ్యూల్స్‌ పి.ఈ.ఎస్.ఓ. ద్వారా అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. పి.ఈ.ఎస్.ఓ.లో ఖాళీల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని శ్రీ గోయల్ ఆదేశించారు.

పెట్రోల్ పంప్ లైసెన్సులు పెట్రోలియం నిబంధనలు 2002 యొక్క ఫారం XIV ప్రకారం జారీ చేస్తుండగా అవే పెట్రోల్ రిటైల్ అవుట్‌లెట్‌లలో నిర్వహించబడుతున్న సి.ఎన్.జి. డిస్పెన్సింగ్ సదుపాయాలకు గ్యాస్ సిలిండర్ నిబంధల యొక్క ఫారం జి ప్రకారం లైసెన్స్ జారీ చేస్తున్నారు. రెండు లైసెన్సులు వేర్వేరు నిబంధనలు, చట్టాల ప్రకారం జారీ చేయబడుతున్న క్రమంలో, అదే పెట్రోల్ పంపులోని సి.ఎన్.జి. సదుపాయాల కోసం లైసెన్స్ మంజూరు చేసిన తరువాత ఫారం XIV లోని లైసెన్సులో కూడా సవరణలు చేయాల్సి ఉంటుంది. ఈ సవరణ మాడ్యూల్స్‌లో అవసరమైన మార్పులతో చేయబడుతుంది. ఇది అనుమతులు మంజూరు చేయడంలో భారాన్ని తగ్గిస్తుంది అలాగే పి.ఈ.ఎస్.ఓ. పనిభారాన్ని తగ్గిస్తుంది.

చర్చల సందర్భంగా, శ్రీ పీయూష్ గోయల్ పి.ఈ.ఎస్.ఓ.లోని ప్రక్రియలను మరియు అనుమతులను సులభతరం చేయాలని ప్రధానంగా ప్రస్తావించారు అలాగే పెట్రోలియం మరియు పేలుడు పదార్థాల నియంత్రణ కోసం ప్రపంచవ్యాప్తంగా అనుసరించబడుతున్న అత్యుత్తమ పద్ధతులను అవలంబించాలని ఆదేశించారు. దరఖాస్తులను పరిష్కరించుటకు పీ.ఈ.ఎస్.ఓ. అధికారులు కచ్చితంగా సమయపాలన పాటించాలని కోరారు. వివిధ అనుమతులు, లైసెన్సుల కోసం తరచుగా అడిగే ప్రశ్నలను రూపొందించి అందించాలని కూడా నిర్ణయించారు. లైసెన్సింగ్ సిస్టమ్ ఫర్ డిస్ట్రిక్ట్ అథారిటీ (ఎల్‌.ఎస్‌.డి.ఎ.) ఆన్‌లైన్ సిస్టమ్ ద్వారా జిల్లా అధికారులు ఎన్‌.ఓ.సి. జారీ చేయాలని మంత్రి ఆదేశించారు.

చర్చల సందర్భంగా పరిశ్రమ అందించిన సూచనలు మరియు లేవనెత్తిన సమస్యలపై మంత్రి స్పందిస్తూ, వారు చేసిన సూచనల వివరాలను రూపొందించడానికి కమిటీలను ఏర్పాటు చేయాలని ఎం.ఓ.పి.ఎన్.జి., సంబంధిత పరిశ్రమ సంఘాలను మంత్రి ఆదేశించారు. ఈ కమిటీలు అత్యుత్తమ పద్ధతులు మరియు ప్రమాణాలను అధ్యయనం చేసి సిఫార్సులను అందించే బాధ్యత కలిగి ఉంటాయన్నారు. అనుమతుల ప్రక్రియలు వేగంగా, సజావుగా జరిగేందుకు నియంత్రణకు సంబంధించిన నిబంధలను, విధానాన్ని సమీక్షించి సవరణలను ప్రతిపాదించాలని ఆయన పరిశ్రమ కమిటీలకు సూచించారు. పరిశ్రమకు చెందిన ప్రతినిధులు, పి.ఈ.ఎస్.ఓ. అధికారులు, డి.పి.ఐ.ఐ.టి. అధికారులు, సి.పి.సి.బి, ఎమ్.ఓ.పి.ఎన్.జి. మరియు చమురు కంపెనీల అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి వారు సూచించిన సంస్కరణలపై సమయానుకూలంగా పనిచేయాలని డి.పి.ఐ.ఐ.టిని ఆయన ఆదేశించారు.

ఈ సదస్సు కోసం దేశవ్యాప్తంగా గల పెట్రోలియం, పేలుడు పదార్థాలు, ఇతర సంబంధిత రంగాలకు చెందిన 150కి పైగా వాటాదారులు ఒకే చోటకు చేరారు. సమావేశ సమయంలో, ఫెడరేషన్ ఆఫ్ అగ్రివాల్యూ చైన్ మానుఫాక్చరర్స్ అండ్ ఎక్స్ పోర్టర్స్ (ఎఫ్.ఎ.ఎమ్.ఇ.), ఎక్స్‌ప్లోజివ్స్ మానుఫాక్చరర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఇ.ఎమ్.డబ్ల్యూ.ఎ.), ఇండియన్ అమోనియమ్ నైట్రేట్ మానుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఐ.ఎ.ఎన్.ఎమ్.ఎ.) అలాగే ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ గ్యాస్ మానుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఎ.ఐ.ఐ.జి.ఎమ్.ఎ) వంటి పరిశ్రమ అనుబంధ సంఘాలు విధానాలను క్రమబద్ధీకరించడానికి మరియు వ్యాపారాన్ని సులభతరం చేయడానికి నిబంధనలు, కార్యాచరణను మెరుగుపరచడం కోసం కీలకమైన సూచనలను ప్రస్తావించాయి.     

విచారణలకు త్వరిత ప్రతిస్పందనలు అందించేలా చూడడం ద్వారా ఎన్.ఓ.సీలు మరియు లైసెన్స్‌లను సకాలంలో జారీ చేస్తూ పి.ఈ.ఎస్.ఓ. ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా డిజిటలైజేషన్ మరియు పారదర్శకతను మెరుగుపరిచేందుకు సిఫార్సులు చేశారు.

పేలుడు పదార్థాల చట్టం, 1884, పెట్రోలియం చట్టం, 1934 ప్రకారం రూపొందించబడిన నిబంధనల అమలులో డి.పి.ఐ.ఐ.టి. నేతృత్వంలో పనిచేసే పి.ఈ.ఎస్.ఓ. కీలక పాత్ర పోషిస్తుంది. ఇటీవలి సంవత్సరాలలో, పి.ఈ.ఎస్.ఓ., పేపర్‌లెస్ లైసెన్సింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టడం, అనుమతుల కోసం ఖచ్చితమైన వేళలకు కట్టుబడి ఉండడం, థర్డ్-పార్టీ ఇన్‌స్పెక్షన్ ఏజెన్సీలను ఏకీకరించడం సహా అనేక సంస్కరణలను ప్రవేశపెట్టినది అయితే అవన్నీ అనుమతి మంజూరు విధానాలను సులభతరం చేయుటను, ప్రమాదకర పదార్థాలతో వ్యవహరించే ఈ పరిశ్రమల అంతటా భద్రతా ప్రమాణాలను బలోపేతం చేయుటను లక్ష్యంగా కలిగి ఉన్నాయి.

ఈ వాటాదారుల సదస్సు పెట్రోలియం మరియు పేలుడు పదార్థాల రంగాలలో అనుకూలమైన నియంత్రణ వాతావరణాన్ని పెంపొందించడానికి పరస్పర సహకారంతో పనిచేయాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పాయి. అనుమతుల జారీ విషయంలో భారాన్ని తగ్గించడంవ్యాపారాన్ని సులభతరం చేయడం, దేశవ్యాప్తంగా పరిశ్రమ ప్రమాణాలను కాపాడుటకు డి.పి.ఐ.ఐ.టి స్థిరమైన నిబద్ధత కలిగి ఉంది. డి.పి.ఐ.ఐ.టి ప్రస్తుత వాటాదారుల భాగస్వామ్యం పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటించింది, పి.ఈ.ఎస్.ఓ.లోని నిబంధనల ప్రక్రియలను మరింత సరళీకరించాలనే అభిప్రాయాన్ని అమలు చేయుటకు ప్రతిజ్ఞ చేసింది. నియంత్రణకు ప్రమాద-ఆధారిత విధానాన్ని అవలంబించే కార్యక్రమాల అమలునియంత్రణ సంస్థల సామర్థ్యాన్ని పెంపొందించడం మరియు మెరుగైన డిజిటల్ పరివర్తనలు మంత్రిత్వ శాఖ ప్రధాన ప్రాధాన్యతలుగా పేర్కొనబడినవి.

***



(Release ID: 2030875) Visitor Counter : 8


Read this release in: Tamil , English , Urdu , Hindi