మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2024-25 విద్యా సంవత్సరం కోసం ఎన్ఎంఎంఎస్ఎస్ పథకం కింద దరఖాస్తులను (తాజా/రిన్యూవల్) సమర్పించడానికి జాతీయ ఉపకారవేతన పోర్టల్ (ఎన్.ఎస్.పి) ప్రారంభం ( 30 జూన్ 2024 నుండి)


ఎన్.ఎస్.పి.లో 2024-25 కోసం విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ఎస్ కోసం తాజా/రిన్యూవల్ దరఖాస్తులను సమర్పించడానికి చివరితేదీ 31 ఆగస్టు 2024.

Posted On: 02 JUL 2024 3:53PM by PIB Hyderabad
నవీకరించిన హోమ్ పేజీ, కొత్త మొబైల్ యాప్, వెబ్ వెర్షన్‌తో కూడిన వన్-టైమ్ రిజిస్ట్రేషన్ (ఓ టి ఆర్) అప్లికేషన్ ప్రారంభించబడి, ప్రత్యక్షంగా ప్రజలకు అందుబాటులో ఉండడం వలన, విద్యార్థులు ఓటిఆర్ కోసం ఆన్‌లైన్‌లో సుఖంగా నమోదు చేసుకోవడానికి నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (ఎన్ ఎస్ పి) వీలు కల్పిస్తుంది. ఓటిఆర్ తో సహా ఎన్.ఎస్.పి  అప్లికేషన్, అత్యాధునిక సాంకేతికతను మరియు మెరుగైన వినియోగదారు ఇంటర్‌ఫేస్‌ను కలిగిఉంది. ఎన్.ఎస్.పి  పోర్టల్ ఇప్పుడు వన్-టైమ్ రిజిస్ట్రేషన్ కోసం అలాగే తాజా మరియు రిన్యూవల్ స్కాలర్‌షిప్‌ల దరఖాస్తు కోసం తెరవబడింది.

 
ఎన్.ఎస్.పి లో తాజా మరియు రిన్యువల్ దరఖాస్తుల సమర్పణ కోసం ఓటిఆర్ అవసరం. ఓటిఆర్ మాడ్యూల్ విద్యార్థులకు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది. ఓటిఆర్ అనేది ఆధార్/ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడి (ఇఐడి) ఆధారంగా జారీ చేయబడే ప్రత్యేకమైన 14-అంకెల సంఖ్య. ఎన్ ఎస్ పి లో స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోడానికి ఒటిఆర్ అవసరం. ఒటిఆర్ ని విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, విద్యార్థి యొక్క మొత్తం విద్యా జీవితచక్రం పొడవునా చెల్లుబాటు అయ్యే ఒటిఅర్-ఐడి జారీ చేస్తారు. దరఖాస్తును సమర్పించిన తర్వాత, సిస్టమ్ ఒటిఅర్-ఐడి కి సంబంధించి అప్లికేషన్-ఐడి ని రూపొందిస్తుంది. సిస్టమ్ ఏ సమయంలోనైనా ఒక  ఒటిఆర్-ఐడి కి సంబంధించి  ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్-ఐడిలు  క్రియాత్మకంగా ఉండకుండా నిర్ధారిస్తుంది. ఎన్.ఎస్.పి.లో 2024-25 సంవత్సరానికి  విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ఎస్  కోసం తాజా/రిన్యూవల్ దరఖాస్తులను సమర్పించడానికి చివరితేదీ 31 ఆగస్టు 2024. 

 
విద్యా సంవత్సరం  2023-24లో ఎన్.ఎస్.పి.లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు పోర్టల్ ద్వారా ఒటిఆర్/రిఫరెన్స్ సంఖ్య కేటాయించడమే కాక మొబైల్ సందేశం  ద్వారా తెలియజేయడం. విద్యాసంవత్సరం  2023-24 లో ఎన్.ఎస్.పి.లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఒటిఅర్-సంబంధిత సూచనలు క్రింది విధంగా ఉన్నాయి:
అ) ఒటిఆర్ సంఖ్య అందుకున్న విద్యార్థులకు సూచనలు
I. ఎన్.ఎస్.పి ఇంతకు ముందు మదింపు సంవత్సరం 2023-24లో ఫేస్-అథెంటికేషన్ సేవను ప్రారంభించింది మరియు విద్యార్థులు తమ ఫేస్-అథెంటికేషన్ ఉపయోగించడం అనేది ఐచ్ఛికం.
II. మదింపు సంవత్సరం 2023-24లో ఫేస్-అథెంటికేషన్ ఉపయోగించుకున్న  విద్యార్థుల కోసం ఎన్.ఎస్.పి., ఒటిఅర్ సంఖ్యను రూపొందించింది మరియు ఆ వివరాలను  దరఖాస్తుదారుకు వారు నమోదు చేసుకున్న  మొబైల్ నంబర్ కు సందేశం  ద్వారా పంపింది.
III. ఒటిఆర్ సంఖ్యను అందుకున్న విద్యార్థులు నేరుగా ఎన్.ఎస్.పి. పోర్టల్ లో స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
IV. ఒకవేళ ఒటిఅర్ నంబర్ మొబైల్ సందేశం ద్వారా రాని విద్యార్థులు, ఎన్.ఎస్.పి. లో అందుబాటులో ఉన్న “know your OTR” ద్వారా తిరిగి పొందవచ్చు.

 
ఆ) రెఫెరెన్స్ నంబర్ (సూచిత సంఖ్య) పొందిన విద్యార్థులకు సూచనలు :
I. మదింపు సంవత్సరం 2023-24లో ఓటిపి-ఆధారిత ఈ-కెవైసిని పూర్తి చేసిన మరియు వారి ఫేస్-అథెంటికేషన్ (ముఖ-ప్రామాణీకరణను ) పూర్తి చేయని విద్యార్థులకు ఎన్.ఎస్.పి. ఒక  సూచిత సంఖ్యను కేటాయించింది.
II. ఎన్.ఎస్.పి. లో ఫేస్ అథెంటికేషన్ పూర్తి చేసి ఇప్పుడు ఒటిఅర్ నంబర్ ను పొందవచ్చు.
III. ఒటిఅర్ నంబర్‌ను రూపొందించడానికి క్రింది విధానాలు అవసరం:
అ) ఆండ్రాయిడ్ మొబైల్ లో  ఆధార్ ఫేస్ ఆర్ డి సేవలను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయండి.

    (link: https://play.google.com/store/apps/details?id=in.gov.uidai.facerd)

ఆ)గూగుల్ ప్లే స్టోర్  నుండి ఎన్.ఎస్.పి ఓటిఆర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయండి

    (link: https://play.google.com/store/apps/details?id=in.gov.scholarships.nspotr&pli=1)

ఇ) మొబైల్ యాప్ తెరిచిన తర్వాత ఎరుపు రంగులో హైలైట్ చేయబడిన “FaceAuth తో eKYC” వికల్పాన్ని ఎంచుకోండి.

 

ఎన్.ఎస్.పి.  పోర్టల్‌లో ఎన్ఎంఎంఎస్ఎస్  కోసం రెండు స్థాయిల ధృవీకరణ ఉంటుంది: స్థాయి-1 ధ్రువీకరణను సంస్థ నోడల్ అధికారి (ఐ ఎన్ ఓ) మరియు స్థాయి-2 ధ్రువీకరణను జిల్లా నోడల్ అధికారి(డి ఎన్ ఓ) చేస్తారు. ఐఎన్ఓ స్థాయి (L1) ధృవీకరణకు చివరి తేదీ 15 సెప్టెంబర్ 2024 మరియు డిఎన్ఓ స్థాయి (L2) ధృవీకరణకు చివరి తేదీ 30 సెప్టెంబర్ 2024.

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన   ప్రతిభావంతులైన విద్యార్థులు VIII వ తరగతితో చదువు ఆపకుండా తమ ఉన్నత చదువులను కొనసాగించేలా ప్రోత్సహించే లక్ష్యంతో  స్కాలర్‌షిప్‌లను అందించాలని  కేంద్ర ప్రభుత్వం  'నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్' (ఎన్ఎంఎంఎస్ఎస్ ) ను ప్రారంభించబడింది. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ-సహాయక మరియు స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుకోవడానికి ప్రతి సంవత్సరం IXవ తరగతికి చెందిన ఎంపికైన విద్యార్థులకు ఒక లక్ష తాజా స్కాలర్‌షిప్‌లు మంజూరు చేయబడి X నుండి XII తరగతులకు కొనసాగింపు/నవీకరణ ద్వారా  అందించబడతాయి. ఎన్ఎంఎంఎస్ఎస్ పథకం నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో ఆన్‌బోర్డ్ చేయబడింది.

 

***


(Release ID: 2030776) Visitor Counter : 90