ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

జాతీయ మెడికల్ కమిషన్ అధ్యక్షుడిగా డా. బి.ఎన్ గంగాధర్ నియామకం

Posted On: 03 JUL 2024 7:50PM by PIB Hyderabad

జాతీయ మెడికల్ కమిషన్, స్వయం ప్రతిపత్తి బోర్డుల పోస్టులకు కేబినెట్ అపాయింట్మెంట్ కమిటీ (ఏసీసీ) పలువురిని నియమించింది. నియమితులైన వ్యక్తులు, నాలుగేళ్ల కాలానికి లేదా  70 ఏళ్ల వయసు వచ్చే వరకు (ఏది ముందుగా వస్తే అది) పోస్టులో కొనసాగుతారు.

నియమితులైన సభ్యుల వివరాలు:

 

డా. బి.ఎన్. గంగాధర్, మెడికల్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డు అధ్యక్షుడు, జాతీయ మెడికల్ కమిషన్ అధ్యక్షునిగా నియామకం (ఎన్ఎంసీ చట్టం, 2019 సెక్షన్ 4 ప్రకారం).

 

డా. సంజయ్ బిహారీ శ్రీ చిత్ర తిరునాళ్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ, తిరువనంతపురం సంచాలకులు, మెడికల్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డు అధ్యక్షుడిగా నియామకం (ఎన్ఎంసి చట్టం, 2019 లోని సెక్షన్ 17 (2) ప్రకారం)

 

డా. అనిల్ డిక్రూజ్,  అపోలో ఆసుపత్రి ముంబై, సంచాలకులు (ఆంకాలజీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు పూర్తికాల సభ్యుడిగా నియామకం (ఎన్ఎంసి చట్టం, 2019 లోని సెక్షన్ 17 (2) ప్రకారం)


కేబినెట్ నియామక కమిటీ ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్ లో పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్  డా. రాజేంద్ర అచ్యుత్ బద్వేను అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డులో తాత్కాలిక సభ్యుడిగా రేండేళ్ల కాలానికి లేదా 70 ఏళ్లు వచ్చే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


***



(Release ID: 2030609) Visitor Counter : 51