రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

హైదరాబాద్ లోని బేగంపేట్ లో ఆయుధ వ్యవస్థల పాఠశాల నుప్రారంభించిన వాయు సేన ప్రధాన అధికారి

Posted On: 02 JUL 2024 2:11PM by PIB Hyderabad

ఆయుధ వ్యవస్థ ల పాఠశాల వెపన్ సిస్టమ్స్ స్కూల్ (డబ్ల్యుఎస్ఎస్) ను హైదరాబాద్ లోని బేగంపేట్ వాయుసేన స్థావరం లో 2024 జులై 1 వ తేదీ న వాయు సేన ప్రధాన అధికారి (చీఫ్ ఆఫ్ ఎయర్ స్టాఫ్ .. సిఎఎస్) ఎయర్ చీఫ్ మార్శల్ శ్రీ వి.ఆర్. చౌధరి ప్రారంభించడం తో భారతీయ వాయు సేన (ఐఎఎఫ్) యొక్క చరిత్ర లో ఒక నూతన అధ్యాయాని కి నాందీ ప్రస్తావన జరిగింది. 2022 వ సంవత్సరం లో ఐఎఎఫ్ యొక్క వెపన్ సిస్టమ్ (డబ్ల్యుఎస్) శాఖ లో అధికారుల నూతన బ్రాంచ్ కు ఆమోదం లభించిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకొంది. భారతీయ వాయు సేన ను రాబోయే కాలాని కి తగిన సేన గా తీర్చిదిద్దడం లక్ష్యం గా పెట్టుకొని ఈ కొత్త శిక్షణ సంస్థ ను ఏర్పాటు చేయడం తో మొత్తం మీద సాయుధ దళాలు, మరీ ముఖ్యం గా భారతీయ వాయు సేన ఒక పెద్ద ముందంజ ను వేసినట్లు అవుతోంది.

 

వెపన్ సిస్టమ్స్ స్కూల్ కమాండెంట్, ఎయర్ వైస్ మార్షల్ ప్రేమ్ కుమార్ కృష్ణస్వామి సిఎఎస్ కి స్వాగతం పలికారు. ఈ ప్రారంభ కార్యక్రమం లో పాలుపంచుకొన్నవారిలో ఎయర్ మార్శల్ శ్రీ నాగేశ్ కపూర్, ట్రైనింగ్ కమాండ్ యొక్క ఎయర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ లతో పాటు ఎయర్ ఫోర్స్ అకాడమీ, కమాండెంట్, కాలేజీ ఆఫ్ ఎయర్ వార్ ఫేర్, హకీం పేట వాయు సేన స్థావరం యొక్క ఎయర్ ఆఫీస్ కమాండింగ్, ఇంకా బేగంపేట్ లోని ఎయర్ ఫోర్స్ స్టేషన్ కు చెందిన స్టేషన్ కమాండర్ లు సహా ఐఎఎఫ్ లోని ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు.

 

సమకాలీన స్థితుల కు తగ్గట్లుగా ప్రభావశీలత ఆధారితమైనటువంటి శిక్షణ ను డబ్ల్యుఎస్ఎస్ అందించడం తో పాటు ఐఎఎఫ్ యొక్క భావి కాలం అవసరాల కు అనుగుణం గా నూతనం గా ఏర్పాటు చేసిన శాఖ యొక్క అధికారుల ను సన్నద్ధం చేయనుంది. డబ్ల్యుఎస్ఎస్ ను ప్రారంభించడం తో, డబ్ల్యుఎస్ బ్రాంచ్ యొక్క ఫ్లైట్ కేడెట్స్ వారి రెండో సమిస్టర్ తాలూకు శిక్షణ ను ఈ సంస్థ లో పొందనున్నారు. కొత్త శాఖ లో నాలుగు విభాగాలు ఉంటాయి; వాటిలో సుఖోయి-30 ఎమ్‌కెఐ, ఇంకా సి-130జె ల వంటి గగనతల వేదికల లో ఆయుధాల మరియు వ్యవస్థల నిర్వహించేందుకు ఉద్దేశించిన ఫ్లయింగ్ స్ట్రీమ్, దూరం నుండి విమానాన్ని నడపడానికి గాను రిమోట్ స్ట్రీమ్, నేల మీది నుండే నింగికి మరియు ఉపరితలం నుండి ఆకాశ మార్గాని కి, ఉపరితలం నుండి ఉపరితలం పైన దాడి చేసే ఆయుధ వ్యవస్థలు మరియు అంతరిక్షం ఆధారిత రహస్య సమాచారం మరియు ఇమేజరీ ని సంబాళించడం కోసం మిషన్ కమాండర్ మరియు ఆపరేటర్ లకు సంబంధించిన విభాగం కలసి ఉంటాయి.

 

వాయు సేన ప్రధాన అధికారి మాట్లాడుతూ, ఆయుధ వ్యవస్థల పాఠశాల బ్రాంచ్ ని ఏర్పాటు చేయడం తో భూతల నిర్దేశిత మరియు ప్రత్యేక ఆయుధ వ్యవస్థల ఆపరేటర్ లు ఒక గొడుగు కిందకు వస్తారని, ఫలితంగా వాయు సేన యొక్క యుద్ధ నిర్వహణ సామర్థ్యం వృద్ధి చెందుతుందని తెలిపారు. సరిక్రొత్తగా ఏర్పాటు చేసిన శాఖ లో బోధకులు మార్గదర్శి వంటి వారని, సంకల్పించినటువంటి యావత్తు శిక్షణ ప్రణాళిక కు వారు మూలస్థంభాలు గా ఉండి దృఢం గా నిలచి నిర్ణయాత్మకం గా ఉండేటటువంటి వాయు శక్తి కి చోదకులు గా వ్యవహరిస్తారని ఉద్బోధించారు. ఈ పాఠశాల యొక్క వ్యవస్థాపక సభ్యుల ను సిఎఎస్ అభినందిస్తూ, సంబంధిత ఉద్యోగులు అందరూ ఈ పాఠశాల ను దేశం లో ఆయుధ వ్యవస్థల శిక్షణ కు ఒక నోడల్ సెంటర్ గా నిలబెట్టాలని విజ్ఞప్తి చేశారు.

 

వాయు సేన ప్రధాన అధికారి 2022 వ సంవత్సరం అక్టోబరు 8 వ తేదీ నాడు జరిగిన వాయు సేన దినం కవాతు కార్యక్రమం లో పాలుపంచుకొన్నప్పుడు వెపన్ సిస్టమ్స్ బ్రాంచి ని స్థాపించనున్నట్లు ప్రకటించారు.

 

***

ABB/AM/IS



(Release ID: 2030232) Visitor Counter : 19