యు పి ఎస్ సి
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్, 2024 యొక్క ఫలితాల ను ప్రకటించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్కమిశన్
Posted On:
01 JUL 2024 7:40PM by PIB Hyderabad
2024 జూన్ 16 వ తేదీ న నిర్వహించిన సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) ఎగ్జామినేషన్, 2024 యొక్క ఫలితాల ఆధారం గా, ఈ క్రింద పేర్కొన్న క్రమ సంఖ్యలను కలిగివున్న పరిక్షార్థులు సివిల్ సర్వీసెస్ (మెయిన్) ఎగ్జామినేషన్, 2024 లో ప్రవేశాని కి గాను అర్హత ను సంపాదించుకొన్నారని ప్రకటించడమైంది.
పరిక్షార్థుల యొక్క అభ్యర్థిత్వం తాత్కాలికం. పరిక్ష యొక్క నియమాల ను అనుసరించి, ఈ పరిక్షార్థులు అందరికి సివిల్ సర్వీసెస్ (మెయిన్) ఎగ్జామినేషన్, 2024 కోసం ఫార్మ్- I (డిఎఎఫ్- I) తాలూకు వివరాణాత్మక దరఖాస్తు ను సమర్పించవలసి ఉంటుంది. డిఎఎఫ్- I ని నింపడం మరియు దానిని దాఖలు చేసే తేదీలు మరియు ముఖ్య ఆదేశాల ను కమిశన్ యొక్క వెబ్ సైట్ లో తగిన సమయం లో తెలియజేయడం జరుగుతుంది.
సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) ఎగ్జామినేషన్, 2024 యొక్క మార్కుల ను కటాఫ్ మార్కుల ను మరియు సమాధానాల ‘కీ’ ని సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, 2024 యొక్క పూర్తి ప్రక్రియ ముగిసిన తరువాత మరియు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్, 2024 ముగిసిన తరువాత తుది ఫలితాలను ప్రకటించిన అనంతరం మాత్రమే కమిశన్ యొక్క వెబ్ సైట్ అయినటువంటి https://upsc.gov.in లో అప్ లోడ్ చేయడం జరుగుతుంది.
న్యూ ఢిల్లీ లోని శాహ్‌జహాఁ రోడ్డు లో ఉన్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమీపం లో ధౌల్ పుర్ హౌస్ ఆవరణ లో ఎగ్జామినేషన్ హాల్ భవనం దగ్గర ఒక ఫెసిలిటేషన్ కౌంటర్ ను ఏర్పాటు చేయడమైంది. పరిక్షార్థులు పైన ప్రస్తావించిన పరీక్ష తాలూకు వారి ఫలితాల విషయం లో ఏదైనా సమాచారం / స్పష్టీకరణ కావాలనుకుంటే అన్ని పని దినాల లో ఉదయం పూట 10 గంటలు మొదలుకొని సాయంత్రం పూట 5 గంటల మధ్య సౌలభ్య కేంద్రం నుండి వ్యక్తిగతం గా హాజరై గాని లేదా టెలిఫోన్ నంబర్ లు 011-23385271, 011-23098543 లేదా 011-23381125 కు ఫోన్ చేసి గాని తెలుసుకోవచ్చును.
పూర్తి ఫలితాలను చూడడం కోసం దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.
***
(Release ID: 2030195)
Visitor Counter : 109