నౌకారవాణా మంత్రిత్వ శాఖ
దిబ్రూఘర్ ఎల్ ఎస్ సీ, దిబ్రూఘర్ సిటీలో వరద పరిస్థితులను సమీక్షించిన కేంద్ర నౌకాశ్రయాలు, నౌకాయానం, జల రవాణా శాఖ మంత్రి శ్రీ శర్వానంద సోనోవాల్
దిబ్రూఘర్ నగరాన్ని ముంచెత్తిన ఆకస్మిక వరదలు, తద్వారా తలెత్తిన పరిస్థితుల గురించి తెలుసుకున్న శ్రీ సోనోవాల్
వరద ప్రాంతాల్లోని గట్లను, కరకట్టలను సంరక్షిస్తూనే ప్రజలకు వరద సహాయాన్ని అందించాలని అధికారులకు కేంద్రమంత్రి ఆదేశాలు
దిబ్రూఘర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని తగ్గించడానికి చేపట్టాల్సిన చర్యలపై అస్సాం ప్రధాన కార్యదర్శితోను, దిబ్రూఘర్ జిల్లా కమిషనర్ తోనూ చర్చించిన కేంద్రమంత్రి
Posted On:
30 JUN 2024 7:47PM by PIB Hyderabad
దిబ్రూఘర్ నగరంలోను, దిబ్రూగర్ లోక్ సభ నియోజకవర్గంలోనూ వరదల కారణంగా తలెత్తిన పరిస్థితులను కేంద్ర నౌకాయానశాఖ మంత్రి శ్రీ శర్వానంద సోనోవాల్ సమీక్షించారు. ప్రజలకు అందుతున్న సహాయ చర్యల గురించి తెలుసుకున్నారు. వరదల ప్రభావంతో తలెత్తే నష్టాల్ని వీలైనంతమేరకు తగ్గించడానికి గాను ఏఏ చర్యలు చేపట్టింది అధికారులు కేంద్రమంత్రికి వివరించారు.
కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా తలెత్తిన పరిస్థితులనుంచి ప్రజలను కాపాడడానికి, అత్యవస పరిస్థితుల్లో చేపట్టాల్సిన సహాయ చర్యల గురించి తెలుసుకున్న కేంద్ర మంత్రి వరదనష్టాన్ని వీలైంతమేరకు తగ్గించేలా పని చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
బ్రహ్మపుత్రానది ప్రమాదకరస్థాయిని దాటి ప్రవహిస్తుండడంతో తద్వారా దిబ్రూఘర్ నగరంలో ఏర్పడిన వరద పరిస్థితుల గురించి శ్రీ సోనోవాల్ తెలుసుకున్నారు. నగరంలోని పలు ప్రాంతాలు వరదబారిన పడి జనజీవనం స్తంభించింది. వరద నష్టాలను సాధ్యమైనంత తగ్గించేలా చూడాలని, ఇందుకోసం చేపట్టే చర్యలు ఉన్నత స్థాయిలో వుండాలని, రానున్న రోజుల్లో వర్షాలు పడతాయని వాతావరణ నివేదికలు చెబుతున్న కారణంగా జాగ్రత్తగా వుండాలని అధికారులకు కేంద్ర మంత్రి సూచించారు. అస్సాం మంత్రులు శ్రీ సంజయ్ కిషన్, రంజీత్ కుమార్ దాస్ లతో మాట్లాడి వరద సహాయక చర్యలపై దిశానిర్దేశం చేశారు. తినుసుకియా, దిబ్రూఘర్ జిల్లాల సంరక్షక మంత్రిగా కూడా వ్యవహరిస్తున్న రంజీత్ కుమార్ దాస్ రేపు రెండు జిల్లాల్లోనుపర్యటించి స్వయంగా వరద సహాయక చర్యలను పర్యవేక్షంచబోతున్నారు.
సమీక్షా సమావేశం తర్వాత మాట్లాడిన శ్రీ సోనోవాల్ వరదల కారణంగా దిబ్రూఘర్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఏర్పడిన పరిస్థితులు ఆందోళనకరంగా వున్నాయని అన్నారు. వర్షాలు ఆగకుండా కురుస్తుండడంతో మరిన్ని రోజులపాటు వర్షాలు పడతాయనే హెచ్చరికల నేపథ్యంలో అత్యవసర సహాయ చర్యలు అందుబాటులో వుండేలా చూస్తున్నామని అన్నారు. అవసరమైనవారందరికీ వరద సహాయ చర్యలందిస్తున్నామని చెప్పారు. దిబ్రూఘర్ నగరాన్ని వరద ముంచెత్తిందని అది అందరిలో ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు. నగరంలో వరద ప్రభావాన్ని తగ్గించడానికి చేపట్టిన చర్యలపై సంబంధిత అధికారులతో అత్యవసర చర్చలు చేయడం జరిగిందని కేంద్రమంత్రి తెలిపారు. అత్యవసర సహాయక చర్యలు చేపట్టడంద్వారా వరదలద్వారా తలెత్తే నష్టాలను తగ్గించడానికి అధికారులు శాయశక్తులా కృషి చేస్తున్నారని ఆయన వివరించారు.
దిబ్రూఘర్ ఎమ్మెల్యే ప్రశాంత ఫుకాన్ తో పాటు దిబ్రూఘర్ మునిసిపల్ కార్పొరేషన్ ఉన్నతాధికారులతో శ్రీ శర్వానంద సోనోవాల్ పరిస్థితిని సమీక్షించారు. మేయర్, డిప్యూటీ మేయర్, వార్డ్ కమిషనర్లు, ఇంకా ఇతర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోటా రవి, జిల్లా కమిషనర్ విక్రమ్ కైరి ఈ సమావేశంలో పాల్గొన్నారు. అధికారులందరితో మాట్లాడిన కేంద్ర మంత్రి వరద బాధితులందరికీ వెంటనే సహాయక చర్యలు అందించాలని ఆదేశించారు.
***
(Release ID: 2029842)
Visitor Counter : 49