వ్యవసాయ మంత్రిత్వ శాఖ

భారత రైతుల గళాన్ని పెంపొందించేందుకు కృషి కథ బ్లాగ్‌సైట్‌తో పాటు వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద వడ్డీ రాయితీ క్లెయిమ్‌ల పరిష్కారానికి సంబంధించి వెబ్ పోర్టల్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్


రైతుల ఆదాయాన్ని పెంచడానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది: శివరాజ్ సింగ్ చౌహాన్


వ్యవసాయ మౌలిక సదుపాయల నిధి కింద ఇప్పటి వరకు 67,871 ప్రాజెక్టులకు రూ.43,000 కోట్లు మంజూరు చేయడంతో పాటు రూ.72,000 కోట్ల పెట్టుబడులను సమీకరించినట్లు తెలిపిన చౌహాన్


అవగాహన పెంపొందించడం, విజ్ఞాన మార్పిడిని సులభతరం చేయడం, సహకారాన్ని పెంపొందించడం, రైతు సాధికారత ఈ కార్యక్రమం లక్ష్యాలు

Posted On: 28 JUN 2024 4:47PM by PIB Hyderabad

వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఏఐఎఫ్) కింద సమర్పించిన బ్యాంకుల వడ్డీ రాయితీ క్లెయిమ్‌ల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయడానికి వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ (డీఏ&ఎఫ్‌డబ్ల్యూ), నాబార్డు సంయుక్తంగా రూపొందించిన వెబ్ పోర్టల్‌ను కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ భగీరథ్ చౌదరి, నాబార్డు చైర్మన్, డీఏ&ఎఫ్‌డబ్ల్యూ, బ్యాంకుల సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్.. మోడీ ప్రభుత్వం వివిధ చర్యలు ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కట్టుబడి ఉందన్నారు. పంటల నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి, రైతులకు నష్టాలను తగ్గించడానికి లక్ష కోట్ల నిధితో వ్యవసాయ మౌలిక సదుపాయల నిధిని ప్రధాని మోదీ ప్రారంభించారని ఆయన చెప్పారు. కొత్తగా ప్రారంభించిన రుణ క్లెయిమ్‌ల ఆటోమేషన్ ద్వారా సకాలంలో ఒక రోజులో క్లెయిమ్‌ పరిష్కరించవచ్చని, లేకపోతే మాన్యువల్‌గా పరిష్కరించేందుకు నెలల సమయం పడుతుందని అన్నారు. ఇది పారదర్శకతకు భరోసా ఇస్తుందని, అవినీతి పద్ధతులకు నివారిస్తుందని తెలిపారు. రైతు అనుభవాలను పంచుకోవడంపై ప్రారంభించిన కొత్త వెబ్‌సైట్… ఒకరి అనుభవాల నుంచి మరొకరు ప్రయోజనం పొందడానికి వ్యవసాయ సమాజానికి వీలు కల్పిస్తుందని అన్నారు. అనేక మంది రైతులు స్వీయ ప్రయోగాలు చేస్తున్నారని, వారి విజయగాధలను ఇతరులు అనుకరించేలా కృషిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వ్యవసాయ మౌలిక సదుపాయల నిధి కింద 67,871 ప్రాజెక్టులకు ఇప్పటికే రూ.43,000 కోట్లు మంజూరు చేయగా… మొత్తంగా రూ.72,000 కోట్ల పెట్టుబడులను సమీకరించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. వడ్డీ రాయితీ క్లెయిమ్‌ల వేగవంత పరిష్కారాన్ని బ్యాంకులు ఆశించవచ్చు.

మాన్యువల్‌గా చేసే పరిష్కారం వల్ల కలిగే మానవ తప్పిదాలను నివారించి క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరించేందుకు… పోర్టల్ ద్వారా ఖచ్చితమైన వడ్డీ రాయితీ అర్హతను లెక్కించడానికి ఆటోమేటెడ్ సిస్టమ్ సహాయపడుతుందని శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. బ్యాంకులు, డీఏ&ఎఫ్‌డబ్ల్యూ సెంట్రల్ ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ యూనిట్(సీపీఎంయూ), నాబార్డు ఈ పోర్టల్‌ను ఉపయోగించుకోనున్నాయి. వడ్డీ రాయితీ క్లెయిమ్, క్రెడిట్ గ్యారంటీ ఫీజు క్లెయిమ్ పద్ధతి ఆటోమేషన్ కావటం వల్ల పూర్తి ప్రక్రియకు పట్టే సమయం తగ్గి.. ఖచ్చితమైన వడ్డీ రాయితీని విడుదల చేసే విషయంలో ప్రభుత్వానికి సహయపడనుంది. తద్వారా రైతులు, వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహయం అందటమే కాకుండా… దేశంలో వ్యవసాయ అభివృద్ధి కోసం ఇలాంటి మరిన్ని ప్రాజెక్టులను చేపట్టడానికి వారిని ప్రోత్సహిస్తుంది.

 

 

కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ కృషి కథను ప్రారంభించారు. ఇది భారతీయ రైతుల స్వరాన్ని ప్రదర్శించడానికి డిజిటల్ వేదికగా ఉపయోగపడుతుంది. దేశవ్యాప్త రైతుల అనుభవాలు, పరిశీలనలు పంచుకునేందుకు వీలుకల్పిస్తుంది. తద్వారా విజయ గాథలను పెంచతుంది.

శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ,.. భారతీయ వ్యవసాయ విస్తారమైన, వైవిధ్యమైన తీరుతో రైతుల స్వరాలు, కథలు తరచుగా బహిర్గతం కావటం లేదన్నారు.  ప్రతి పంట, ప్రతి పొలం, ప్రతి పంట వెనుక పోరాటాలు, సవాళ్లు విజయ గాధలు ఉన్నాయన్నారు.  భారత వ్యవసాయ సమాజ కథనాలను, విజయ గాధలను పంచుకోవడానికి,  వేడుక చేసుకోవటానికి ఒక సమగ్రమైన, అద్భుతమైన వేదికగా ఉండటమే "కృషి కథ"  లక్ష్యం అని తెలిపారు.  


మన రైతుల గొంతుకను గుర్తించటం, విస్తరించం విషయంలో కృషి కథను ప్రారంభించడం ఒక ముఖ్యమైన ముందడుగు అని కేంద్ర మంత్రి ప్రధానంగా చెప్పారు. రైతుల ధైర్యం, సృజనాత్మకత కథలు మన వ్యవసాయ రంగానికి మూలస్తంభమని నొక్కిచెప్పిన ఆయన.. ఈ వేదిక ఇతరులకు ప్రేరణగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అవగాహన పెంచడం, జ్ఞాన మార్పిడిని సులభతరం చేయడం, సహకారాన్ని పెంపొందించడం, రైతులకు సాధికారత కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశాలని తెలిపారు.

సామాజిక వ్యవసాయ పరివర్తన శక్తితో పాటు వినూత్న వ్యవసాయ పద్ధతుల వినియోగం, వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన తీరును కృషి కథ పోర్టల్ ప్రధానంగా చూపించనుంది. 
భారతీయ రైతులను ప్రేరేపించడం, వారి కథలను ప్రదర్శించడం, వ్యవసాయ వృత్తి పట్ల గౌరవాన్ని  పెంపొందించడం పెంపొందించడం దీని లక్ష్యం. సంక్షిప్తంగా చెప్పాలంటే వ్యవసాయం, భారతీయ రైతులకు సంబంధించి వేడుక చేసుకునేందుకు ఈ వేదిక పనిచేయనుంది.

కోత అనంతరం పంట నిర్వహణకు సంబంధించి మౌలిక సదుపాయాల అభివృద్ధి, రైతులకు మెరుగైన విలువ అందించటం, వ్యవసాయంలో నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించటం, వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనకు పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి పథకం 2020లో ప్రారంభమైంది. మొత్తం రూ.లక్ష కోట్ల(2025-26 వరకు) వ్యయంతో ప్రారంభమైన ఈ పథకంలో నిధులను బ్యాంకులు, ఆర్థిక సంస్థల ద్వారా సమకూర్చనున్నారు. గరిష్టంగా ఏడేళ్ల కాలానికి బ్యాంకులు ఇచ్చే రూ.2 కోట్ల వరకు రుణాలపై లబ్ధిదారులకు 3 శాతం వడ్డీ రాయితీతో పాటు బ్యాంకులు చెల్లించే క్రెడిట్ గ్యారంటీ ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను ఈ పథకం అందిస్తుంది.

 

***



(Release ID: 2029625) Visitor Counter : 8