రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

జాతీయ రాజమార్గప్రాజెక్టుల యొక్క వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక ను సమీక్షించడం కోసం ఒక ప్రత్యేకసెల్ ను  ఏర్పాటు చేసిన ఎన్ హెచ్ఎఐ

Posted On: 27 JUN 2024 4:51PM by PIB Hyderabad

జాతీయ రాజమార్గాల నిర్మాణం లో అత్యున్నతమైనటువంటి ప్రమాణాల సాధన కు, ప్రభావవంతమైన విధం గా ఖర్చు పెట్టడానికి మరియు ప్రాజెక్టుల ను అనుకున్న కాలానికల్లా పూర్తి చేయడానికి పూచీ పడడం కోసం నేషనల్ హైవేస్ ఆథారిటి ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఎఐ) ఒక వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక విభాగాన్ని (డిపిఆర్ సెల్) ను న్యూ ఢిల్లీ లోని ఎన్ హెచ్ఎఐ ప్రధాన కేంద్రం లో ఏర్పాటు చేసింది. ఈ సెల్ నిపుణుల సూచనల ను అందించడం తో పాటు జాతీయ రాజమార్గాల ప్రాజెక్టుల విషయం లో డిపిఆర్ ను చివరికంటా పర్యవేక్షించేందుకు వీలు ను కల్పిస్తుంది. డిపిఆర్ సంబంధి సమీక్ష ప్రక్రియ లో ఏకరూపత ను తీసుకు రావడం లో ఈ విభాగం సహాయకారి గా ఉండడం తో పాటు ప్రాజెక్టులు కార్యరూపాన్ని దాల్చే లోపే మంచి నాణ్యమైన డిపిఆర్ లు రూపొందేటట్లు గాను మరియు వాటి ని సమీక్షించేటట్లు గాను పూచీ పడుతుంది.

జాతీయ రాజమార్గ ప్రాజెక్టు విజయవంతం గా అమలు అవ్వాలి అంటే డిపిఆర్ రూపకల్పన అనేది అత్యవసరమైనటువంటి అంశం. దీనిలో ప్రాజెక్టు కు సంబంధించినటువంటి వేరు వేరు సర్వేక్షణ లు, పరిశోధన లు మరియు డిజైన్ లు ఉంటాయి. ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (ఐఆర్ సి) ప్రత్యేక లక్షణాల కు మరియు ప్రమాణాల కు అనుగుణం గా, హైవే కంపోనంట్స్ (హైవే ఎండ్ స్ట్రక్చర్స్) అన్నిటి కోసం విభిన్న కొలమానాలకు తుది రూపు ను ఇవ్వడం లో డిపిఆర్ సెల్ సహాయకారి గా ఉంటుంది.

డిపిఆర్ సెల్ లో సుమారు 40 మంది వృత్తి నిపుణుల తో కూడిన ఒక ప్రత్యేకమైన బృందం ఉంటుంది; ఈ బృందం లో ప్రధాన డిపిఆర్ నిపుణులు, రహదారి భద్రత, రాకపోకలు, భూమి సేకరణ, వంతెనలు, సొరంగాలు, భూ సాంకేతిక విజ్ఞ‌ాన నిపుణులు, సీనియర్ హైవే నిపుణులు, అటవీ ప్రాంత స్పెశలిస్టులు సహా వేరు వేరు రంగాల కు చెందిన నిపుణులు ఉంటారు.

ఈ నిపుణులు డిపిఆర్ ప్రాజెక్టు జీవన కాలం పర్యంతం సమీక్ష ప్రక్రియ ఏక రీతి న కొనసాగేటట్లుగా చూసేందుకు తగిన పర్యవేక్షక వ్యవస్థల ను మరియు యంత్రాంగాల ను అభివృద్ధి పరచడం లో తోడ్పడుతారు. దీనికి అదనం గా, ఈ జట్టు జాతీయ రాజమార్గ ప్రాజెక్టుల కు సంబంధించిన బిడ్ దస్తావేజుల ను మరియు టెక్నికల్ షెడ్యూల్స్ ను కూడను అధ్యయనం చేయడం, డిజైన్ వారీ గా వ్యయ అంచనాల ను కూడా అందిస్తుంది. నిర్మాణాన్ని చేపట్టే కంటే ముందు అమలు పరచవలసినటువంటి కార్యకలాపాల తాలూకు పథక రచన ను చేయడం లోను మరియు ప్రాజెక్టు ను హైవే ఇన్‌ఫర్మేషన్ మోడల్ సాఫ్ట్ వేర్ (హెచ్ఐఎమ్ఎస్)తో జతపరచడం లోను సాయపడుతుంది. ఈ విభాగం యొక్క అధికారులు డిపిఆర్/డిజైన్ కన్సల్టెంట్ల ద్వారా అందే ప్రతిపాదనల మూల్యాంకనం చేయడం కోసం ఆ యా స్థలాల ను సందర్శిస్తారు. ప్రాజెక్టు కు సంబంధించినటువంటి డిపిఆర్ లో నాణ్యత ను వృద్ధి చెందింప చేయడానికి వినూత్నమైన అభ్యాసాల ను గురించి కూడా వీరు సూచనల ను చేస్తారు.

కచ్చితమైన నివేదికల ను తయారు చేయడం లో డిపిఆర్ సెల్ సాయపడడం ద్వారా ప్రపంచ శ్రేణి జాతీయ రాజమార్గాల అభివృద్ధి కి దోహదం చేస్తుంది; మరి ఈ విధం గా ఇది దేశం యొక్క వృద్ధి కి తన వంతు తోడ్పాటు ను అందిస్తుంది.

***



(Release ID: 2029427) Visitor Counter : 12