రక్షణ మంత్రిత్వ శాఖ
పాలమ్ లోని 13 బేస్ రిపేర్ డిపో (బిఆర్ డి) ని సందర్శించిన ఎఒసి-ఇన్-సి మెయిన్‌టెనెన్స్ కమాండ్
Posted On:
25 JUN 2024 1:13PM by PIB Hyderabad
పాలమ్ లోని బేస్ రిపేర్ డిపో (బిఆర్‌డి) ని మెయిన్‌టెనెన్స్ కమాండ్ యొక్క ఎయర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఎయర్ మార్షల్ శ్రీ విజయ్ కుమార్ గర్గ్ 2024 జూన్ 23 మరియు 24 తేదీ లలో సందర్శించారు. ఆయన వెంట వాయు సేన కుటుంబాల సంక్షేమ సంఘం ఎఎఫ్ఎఫ్‌డబ్ల్యుఎ (ప్రాంతీయ), ఎమ్‌సి యొక్క అధ్యక్షురాలు శ్రీమతి రుతు గర్గ్ ఉన్నారు. వారికి ఎయర్ మార్షల్ బేస్ రిపేర్ డిపో యొక్క ఎయర్ ఆఫీసర్ కమాండింగ్ ఎయర్ కమొడోర్ శ్రీ హర్ష్ బహల్ మరియు వింగ్ కమాండర్, ఇంకా ఎఎఫ్ఎఫ్‌డబ్ల్యుఎ (ప్రాంతీయ) అధ్యక్షురాలు శ్రీమతి రీనా బహల్ (రిటైర్డ్) లు స్వాగతం పలికారు. శ్రీ విజయ్ కుమార్ గర్గ్ మరియు శ్రీమతి రుతు గర్గ్ లు పాలమ్ లో బేస్ రిపేర్ డిపో కు చేరుకోవడం తోనే, వారికి వాయు యోధులు సంప్రదాయబద్ధమైనటువంటి గౌరవ వందనాన్ని సమర్పించారు.
ఎయర్ మార్శల్ శ్రీ విజయ్ కుమార్ గర్గ్ యాత్ర క్రమం లో, ఆ డిపో యొక్క ముఖ్య విధుల ను గురించి, మరి అలాగే శాంతి కాలం లోను, యుద్ధ కాలం లోను డిపో పోషించిన భూమికలతో పాటు గా ప్రస్తుతం అమలవుతున్నటువంటి ప్రాజెక్టుల పురోగతి ని కూడా వివరించడమైంది. డిపో సిబ్బందిని ఉద్దేశించి ఎఒసి-ఐఎన్-సి ప్రసంగిస్తూ, ఉత్కృష్టత పట్ల డిపో యొక్క నిబద్ధత ను మరియు భారతీయ వాయు సేన (ఐఎఎఫ్) యొక్క నిర్వహణ పరమైన సన్నద్ధత విషయం లో ప్రభావవంతం అయినటువంటి తోడ్పాటు ను అందిస్తున్నందుకు గాను సిబ్బందిని ప్రశంసించారు.
ఆయన పంచ్‌వటి లో గల వాయు సేన విద్యాలయాన్ని కూడాను సందర్శించారు; దీనికి 2023-24 విద్య సంవత్సరం లో ఆ పాఠశాల కేటగిరి లో ఉత్తమ పాఠశాల పురస్కారాన్ని ఇవ్వడమైంది. ఆ తరువాత ఎఒసి-ఐఎన్-సి మరియు ఎఎఫ్ఎఫ్‌డబ్ల్యుఎ (ప్రాంతీయ) అధ్యక్షురాలు అయిన కొత్తగా ఏర్పాటైన ‘ఉమ్మీద్ నికేతన్’ ను సందర్శించారు. డిపో లోని మరియు డిపో కు చుట్టుపక్కల ప్రాంతాల లోని ప్రత్యేక సామర్థ్యాలు కలిగిన బాలల కు చికిత్స ను అందించడం కోసం డిపో ఏర్పాటు చేసిన ఒక విశిష్ట సంస్థ యే ఉమ్మీద్ నికేతన్.
శ్రీమతి రుతు గర్గ్ తన యాత్ర లో సంక్షేమ కార్యకలాపాల పట్ల దృష్టి ని కేంద్రీకరించారు. డిపో సంగిని లతో మాటామంతీ జరిపారు. కుటుంబాల యొక్క జీవనం లో నాణ్యత ను మెరుగు పరచడం కోసం డిపో అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల ను గురించి ఆమె కు వివరించడమైంది. ఆమె వాయు సేన కుటుంబాల సంక్షేమ సంఘం ఎఎఫ్ఎఫ్ డబ్ల్యుఎ (స్థానిక) ఆధ్వర్యం లో నడుస్తున్న ముఖ్య సంస్థల ను కూడా సందర్శించారు.
****
(Release ID: 2028677)
Visitor Counter : 92