శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
"భారతీయ సమస్యలకు భారతీయ పరిష్కారాలు, భారతీయ ఆవిష్కరణల కోసం భారతీయ డేటా మన స్పెక్ట్రమ్, మన మానవ సమలక్షణం కూడా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల కంటే భిన్నంగా ఉంటుంది" అని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్.
సాంప్రదాయ విజ్ఞానం మనకున్న ప్రత్యేక సంపద, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్ రెండు ప్రపంచాలలోను ఉత్తమమైన ఫలితాలను సాధించడానికి ‘సాంప్రదాయ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ’ని ప్రారంభించింది: డాక్టర్ సింగ్
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారతదేశం తన స్వంత ప్రమాణాలను ఏర్పరచుకుంది
"సైన్స్ విద్యార్థులు అయినందున, సాక్ష్యాధారాలతో మాట్లాడటాన్ని మనం నేర్చుకున్నాం, భారతీయతపై మా నమ్మకం జాతీయ అభిమానంతో మాత్రమే కాదు, ఇది మంచి శాస్త్రీయ పరిశోధనపై ఆధారపడి ఉంటుంది" అని స్పష్టం చేసిన డాక్టర్ జితేంద్ర సింగ్.
Posted On:
23 JUN 2024 3:36PM by PIB Hyderabad
"భారతీయ సమస్యలకు భారతీయ పరిష్కారాలు, మన స్పెక్ట్రమ్‌గా భారతీయ ఆవిష్కరణల కోసం భారతీయ డేటా, మన మానవ సమలక్షణం కూడా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల కంటే భిన్నమైనది" అని డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేసారు. ఇక్కడ ఎంఐటి-ఏడిటి యూనివర్సిటీలో జరిగిన విజ్ఞాన్ భారతి (విభా) 6వ జాతీయ సదస్సులో కేంద్ర శాస్త్ర, సాంకేతిక, భూ విజ్ఞాన శాఖల (ఇండిపెండెంట్ ఛార్జ్), పీఎంఓ, అణుశక్తి, అంతరిక్షం, సిబ్బంది, ప్రజా సమస్యల శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగించారు.
ఈ సదస్సుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ఇప్పటి వరకు జరిగిన అన్ని విభా సమావేశాలకు తాను హాజరయ్యానని కేంద్ర సహాయ మంత్రి అన్నారు. స్వదేశీ స్ఫూర్తితో, స్వదేశీ విజ్ఞానానికి ఇది ఒక ప్రభావశీల ఉద్యమంగా అభివర్ణించారు. శాస్త్రీయమైన స్వభావాన్ని భారతీయ ప్రాకృతిక స్వభావంగా ఇది మారుస్తుందని ఆయన అన్నారు. .
1980లలో ప్రారంభమైన విజ్ఞాన్ భారతి (విభా) ప్రయాణాన్ని గుర్తుచేస్తూ, సైన్స్ పట్ల నిబద్ధత ఉన్నవారు కలిసి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. 2007లో విభా 'నెహ్రూ అవార్డు'ను నాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అందజేశారని, సైన్స్ రంగంలో ఎలాంటి రాజకీయ అనుబంధాలకు అతీతంగా ఈ సంస్థ ఎదుగుతున్నడి అనడానికి ఇది నిదర్శనమని అన్నారు.
స్వయంగా ప్రఖ్యాత డయాబెటాలజిస్ట్ అయిన డాక్టర్ జితేంద్ర సింగ్, మన దేశంలో సెంట్రల్ ఒబేసిటీ, విసెరల్ ఒబేసిటీ ఎక్కువగా ఉన్నాయని అంటూ, ఇవి గుండె జబ్బులు, హైపర్ టెన్షన్ వంటి జీవక్రియ వ్యాధులకు ప్రమాద కారకులుగా ప్రసిద్ధి చెందాయని చెప్పారు. ఆరోగ్యంపై ప్రత్యేక డేటాను కలిగి ఉండాలని ఇది సూచిస్తుందని తెలిపారు. భారతీయ ఫినోటైప్ (సమలక్షణం) భిన్నమైనదని, మన డిఎన్‌ఎ ప్రపంచంలోని ఇతర దేశాల కంటే భిన్నంగా ఉంటుందని, అందువల్ల భారతదేశంలో కొన్ని వ్యాధులు ఎక్కువగా ప్రబలుతాయని ఆయన అన్నారు. వీటిని ఎదుర్కోవడానికి మనకు సమగ్రమైన, సంపూర్ణమైన విధానం, మన సాంప్రదాయ జ్ఞానం- ఆధునిక వైద్యం సమ్మిళితం కావలసిన అవసరముందని కేంద్ర మంత్రి అన్నారు.
సాంప్రదాయ జ్ఞానం మనకున్న ప్రత్యేక ఆస్తి. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం రెండు సీమల్లోనూ అత్యుత్తమమైన వాటిని సాధించేందుకు ‘సాంప్రదాయ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ’ని ప్రారంభించారని ఆయన తెలిపారు. ఓరియంటల్ మెడిసిన్ పట్ల పక్షపాతం ఉన్న వ్యక్తులు, కోవిడ్ సమయంలో తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారని కూడా ఆయన పేర్కొన్నారు. పాండమిక్ సమయంలో ఏదైనా ఆయుర్వేద ఉపాయం కోసం అభివృద్ధి చెందిన దేశాలు నుండి అంటున్న వ్యక్తులు తనను సంప్రదించేవారని ఆయన చెప్పారు.
గత దశాబ్దంలో సైన్స్ అండ్ టెక్నాలజీలో పురోగతిని ప్రముఖంగా ప్రస్తావిస్తూ, “2014 నుండి ప్రధాని మోదీ హయాంలో, మాకు పుష్కలమైన మద్దతు లభించింది, ఎటువంటి సానుకూల సూచన ఇచ్చినా దానికి ఆదరణ ఉండేది” అని డాక్టరో జితేంద్ర సింగ్ తెలిపారు. భారతదేశం అగ్రగామి దేశంగా మారిందని అభివృద్ధి చెందిన దేశాలు అని పిలవబడే దేశాలు కూడా ఇందుకు అంగీకరించాయని ఆయన అన్నారు.
"అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారతదేశం తన స్వంత ప్రమాణాలను ఏర్పరుచుకుంది" అని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. 2014లో 350 స్టార్టప్‌ల సంఖ్య 2024 నాటికి దాదాపు 1.5 లక్షలకు చేరుకున్న భారతదేశ వైజ్ఞానిక విప్లవాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రపంచ స్టార్టప్‌లలో భారతదేశం ఇప్పుడు 3వ స్థానంలో ఉందని ప్రపంచం గుర్తించిందని ఆయన అన్నారు. . ఇన్నోవేషన్, ఆర్ అండ్ డి కార్యకలాపాలను వివరిస్తూ, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో భారతదేశం 2014లో 81వ స్థానం ఉంటె ఇప్పుడు 40వ స్థానానికి చేరుకుందని ఆయన చెప్పారు. సైన్స్‌లో అత్యధిక పీహెచ్‌డీల్లో మూడో స్థానంలో ఉన్నామని ఆయన అన్నారు.
భారతదేశం గొప్ప సముద్ర వనరులు, 7,500 కి.మీ పొడవైన తీరప్రాంతం ఉందని, లోతులలోకి సముద్ర మిషన్ భారతదేశాన్ని నీలి ఆర్థిక వ్యవస్థకు, చేపల పెంపకంలో అతిపెద్ద ఎగుమతిదారులకు అతిపెద్ద సహకారిగా మారుస్తుందని కేంద్ర భూ విజ్ఞానాల మంత్రి తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రైవేట్ దిగ్గజాల కోసం అంతరిక్ష రంగం తలుపులు తెరిచిన భారత్ కొత్త అంతరిక్ష విధానం విజయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు డాక్టర్ జితేంద్ర సింగ్. "2022లో మనకు ఒకే ఒక స్టార్టప్ ఉంటె ఇప్పుడు 2024లో దాదాపు 200 స్టార్టప్‌లను కలిగి ఉన్నాము" అని అన్నారు.
అరోమా మిషన్ కు సంబంధించి డాక్టర్ శేఖర్ మండేను అభినందించిన కేంద్ర మంత్రి, అరోమా మిషన్‌లో ‘అగ్రిప్రెన్యూయర్స్’గా గ్రాడ్యుయేట్స్ కానీ వారు కూడా లక్షలు సంపాదిస్తున్నారని తెలిపారు. భారతదేశంలో శాస్త్రీయ దృక్పథానికి ఎప్పుడూ కొరత లేదని, ఇది మోదీ నాయకత్వం వల్లే సాధ్యమైందని ఆయన అన్నారు.
యువ వైజ్ఞానికులను ఉద్దేశించి మాట్లాడుతూ డా.జితేంద్ర సింగ్ , "సైన్స్ విద్యార్థులుగా ఉన్నందున, సాక్ష్యాధారాలతో మాట్లాడటం మనం నేర్చుకున్నామని, భారతీయతపై మన విశ్వాసం కేవలం జాతీయ అభిమానంతోనే కాదు, ఇది మంచి శాస్త్రీయ పరిశోధనపై ఆధారపడింది" అని అన్నారు. సమిష్టి కృషితో పబ్లిక్-ప్రైవేట్ రంగాల ఉమ్మడి ప్రయాణంతో సాంస్కృతిక, మూల వనరులకు అనుబంధంగా ఉండాలని ఆయన తెలిపారు.
సైన్స్ అభివృద్ధిలో విజ్ఞాన్ భారతి (విభా) కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. డిఆర్డిఓ మాజీ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి; విభా మాజీ అధ్యక్షుడు డాక్టర్ విజయ్ భట్కర్; విభా అధ్యక్షుడు డాక్టర్ శేఖర్ మండే; పూణే రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి శ్రీకాంతానంద మహారాజ్; పూణేలోని ఎంఐటి అధ్యక్షుడు ప్రొఫెసర్ విశ్వనాథ్ కరాడ్ కూడా హాజరయ్యారు.
***
(Release ID: 2028329)
Visitor Counter : 91