కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

10వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి నాయకత్వం వహించిన డాక్టర్ మన్సుఖ్ మాండవియా


అద్భుతమైన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన
బహుమతి యోగా: కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి

కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

Posted On: 21 JUN 2024 4:35PM by PIB Hyderabad

 

కార్యక్రమంలో ప్రసంగించిన డాక్టర్ మన్సుఖ్ మాండవియా మన నిత్య జీవితంలో యోగాకున్న ప్రాధాన్యతను వివరించారు. భారతదేశం అనేక శతాబ్దాలుగా యోగా సాధన చేస్తోందని, అద్భుతమైన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన బహుమతి యోగా అని ఆయన అన్నారు.

యోగాను విస్తృతంగా ఆమోదించడంపై, కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి ఇలా వ్యాఖ్యానించారు, "యోగా ప్రపంచ వ్యాప్తంగా ఆమోదయోగ్యతను పొందుతోంది మరియు మానవులందరికీ ప్రయోజనాన్ని అందిస్తోంది".

2015 నుండి, ప్రపంచవ్యాప్తంగా ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ రోజు యోగాను జరుపుకోవడమే కాకుండా భారతదేశ సంస్కృతి, వారసత్వాన్ని దశదిశలా వ్యాపింపజేస్తుంది.

***



(Release ID: 2028155) Visitor Counter : 11