జల శక్తి మంత్రిత్వ శాఖ
'స్వీయ, సమాజం కోసం యోగా' అనే ఇతివృత్తంతో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించిన జల శక్తి మంత్రిత్వ శాఖ
మన జీవితాన్ని ఒత్తిడి లేని, ఆరోగ్యకరమైన, ఆనందదాయకంగా మార్చడానికి యోగా ఒక ప్రత్యేకమైన సాధనం: శ్రీ సి.ఆర్. పాటిల్
Posted On:
21 JUN 2024 2:38PM by PIB Hyderabad
కేంద్ర జల శక్తి మంత్రి శ్రీ సి.ఆర్.పాటిల్ ఈ రోజు సూరత్‌లోని చారిత్రాత్మక చౌక్ కోటలో 'స్వీయ, సమాజం కోసం యోగా' అనే ఇతివృత్తంపై నిర్వహించిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐవైడి) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి యోగా సాధనలో పాల్గొన్నారు. ఒత్తిడి లేని జీవితం కోసం, ఆరోగ్యకరమైన, ఆనందదాయకంగా మార్చేందుకు యోగా ఒక ప్రత్యేకమైన సాధనమని పేర్కొన్నారు. సమాజంలో సానుకూల మార్పును తీసుకురావడానికి, జీవితాన్ని ఆరోగ్యంగా, సంతోషంగా, సామరస్యంగా మార్చడానికి ప్రతి ఒక్కరూ ఈ పవిత్ర మార్గంలో ముందుకు సాగాలని ఆయన కోరారు.
తుమకూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన అంతర్జాతీయ యోగ దినోత్సవ కార్యక్రమంలో జల శక్తి, రైల్వే శాఖ సహాయ మంత్రి శ్రీ వి.సోమన్న పాల్గొన్నారు. యోగా శక్తితో ప్రపంచానికి వెలుగులు నింపి, సంతోషకరమైన, ఆరోగ్యకరమైన మానవాళికి బాటలు వేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి డాక్టర్ రాజ్ భూషణ్ చౌదరి యోగా దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని దిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో యోగా సాధన చేశారు. జల వనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవన శాఖ (డీవోడబ్ల్యూఆర్, ఆర్డీ, జీఆర్) ఉన్నతాధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, యోగా, ఆధ్యాత్మికత ప్రపంచవ్యాప్తంగా అసమాన రీతిలో వ్యాప్తి చెందిందని డాక్టర్ చౌదరి 'ఎక్స్' సామాజిక మాధ్యమంలో ఒక పోస్ట్ లో పేర్కొన్నారు. ఇది భారతదేశ ప్రతిష్టను పెంచిందని ఆయన పేర్కొన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2024ను పురస్కరించుకుని దిల్లీలో జరిగిన యోగా సెషన్లలో తాగునీరు, పారిశుద్ధ్య శాఖకు చెందిన 60 మందికి పైగా అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
***
(Release ID: 2028147)
Visitor Counter : 35