పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని దిల్లీలోని రాజీవ్‌గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి


యోగాను ప్రపంచవ్యాప్తం చేయడంలో ప్రధానమంత్రి మోదీ పాత్రను ప్రశంసించిన మంత్రి, యోగా మనస్సును, శరీరాన్ని సమన్వయం చేసే, ఆలోచనను చర్యతో ఏకం చేసే, వ్యక్తిగత పరిపూర్ణతను నెలకొల్పే సమతుల్య చర్య అన్నారు.

Posted On: 21 JUN 2024 3:42PM by PIB Hyderabad

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు దిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ కార్యదర్శి శ్రీ వుమ్‌లున్‌మాంగ్ వుల్నమ్బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీడైరెక్టర్ జనరల్ శ్రీ జుల్ఫికర్ హసన్ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీ సంజీవ్ కుమార్మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

సమావేశాన్ని ఉద్దేశిస్తూ కేంద్రమంత్రి శ్రీ నాయుడు మాట్లాడుతూ, "యోగా అనేది మనస్సుశరీరాన్ని సమన్వయపరుస్తూఆలోచనను చర్యతో ఏకం చేసివ్యక్తిగత పరిపూర్ణతను స్థాపించే సమతుల్య చర్యగా పేర్కొన్నారు. యోగా సాధన శారీరకమానసికఆధ్యాత్మిక అంశాలను సమ్మిళితం చేయడం ద్వారాఆరోగ్యంశ్రేయస్సుకు సంపూర్ణ మార్గాన్ని అందిస్తుంది. మన ఈ ఉరుకుల పరుగుల జీవితంలో శాంతికి చాలా అవసరమైన వనరుగా యోగా ను పేర్కొన్నారు.

 

యోగాకు ప్రపంచ ఖ్యాతిని తీసుకురావడంలోఅంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించుకోవడంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రయత్నాన్ని కేంద్ర మంత్రి ప్రశంసించారు. యోగా భారతీయ సంస్కృతితో ముడిపడి ఉన్న విలువైన వారసత్వమనిదాని ఖ్యాతి ప్రస్తుతం విదేశాలకు వ్యాపించిందని మంత్రి అన్నారు. యోగా భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందింది. భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చొరవ ఫలితంగా 2015 సంవత్సరం నుంచి ప్రతి ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఇక్కడ సమావేశం కావడం గర్వకారణమనమని మంత్రి పేర్కొన్నారు.

 

ప్రస్తుత యుగంలో యోగా ప్రాముఖ్యత గురించి మనందరికీ బాగా తెలుసు. యోగా ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తూప్రతి ఏడాది యోగా దినోత్సవానికి ఒక ప్రత్యేక ఇతివృత్తాన్ని నిర్ణయిస్తారు. ఈ ఏడాది 10 వ అంతర్జాతీయ యోగా దినోత్సవ ఇతివృత్తం, "స్వీయసమాజం కోసం యోగా". ఇది పూర్వకాల క్రమశిక్షణ ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది. యోగా అనేది కేవలం వ్యక్తిగత శ్రేయస్సుకు సంబంధించినది మాత్రమే కాదుఇది అంతర్గతబాహ్య ప్రపంచం మధ్య సంబంధాన్ని ప్రోత్సహిస్తుంది.

 

***



(Release ID: 2027801) Visitor Counter : 25