బొగ్గు మంత్రిత్వ శాఖ

బొగ్గు గనుల కార్యకలాపాలను వేగవంతం చేయాలని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి

Posted On: 20 JUN 2024 2:00PM by PIB Hyderabad

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, క్యాప్టివ్, కమర్షియల్ బొగ్గు బ్లాకుల నిర్వహణపై సమీక్షించేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కేటాయించిన బొగ్గు బ్లాకులను వీలైనంత త్వరగా ఆపరేషన్ లోకి తెచ్చేందుకు, సమస్యల సత్వర పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖతో సహా అందరు వాటాదారులతో సన్నిహిత సమన్వయంతో ఉండాలని మంత్రి పేర్కొన్నారు.

‘బొగ్గులో ఆత్మనిర్భరత’ సాధించేందుకు దిగుమతులను తగ్గించుకోవడానికి బొగ్గు అధిక ఉత్పత్తి అవసరాన్ని చెప్పిన కేంద్ర మంత్రి, రాష్ట్ర స్థాయిలో అవసరమైన సంస్థాగత పటిష్టతకు మద్దతునివ్వాలని ఆదేశించారు. బొగ్గు గనులు వీలైనంత త్వరగా పని చేసేందుకు వీలుగా అన్ని బొగ్గు గనులను కేటాయించిన వారికి క్రమ పద్ధతిలో సౌకర్యాలు కల్పించాలన్నారు.

ఇప్పటివరకు, బొగ్గు మంత్రిత్వ శాఖ 575 మెట్రిక్ టన్నుల గరిష్ట స్థాయి సామర్థ్యంతో 161 బొగ్గు గనులను కేటాయించింది/ వేలం వేసింది. అందులో 58 గనులకు, తెరవడానికి అనుమతి లభించగా, 54 గనులు పనిచేస్తున్నాయి. గత సంవత్సరం ఈ గనులు మొత్తం 147 మెట్రిక్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేశాయి, ఇది దేశం మొత్తం బొగ్గు ఉత్పత్తిలో 15%గా ఉంది.

క్యాప్టివ్/వాణిజ్య బొగ్గు గని తవ్వకాలు జరిపే ఎన్టీపీసీ, పశ్చిమ బెంగాల్ పవర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (డబ్ల్యూబిపిడిసిఎల్), పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (పిఎస్పిసిఎల్), కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (కేపిసిఎల్), వేదాంత, హిందాల్కో, అదానీ మొదలైన వాటితో సహా ప్రధానంగా పెద్ద వినియోగదారులున్నారు. ఈ కంపెనీలు అధిక ఉత్పత్తి చేయడం వలన సిఐఎల్ నుండి బొగ్గు డిమాండ్‌పై ఒత్తిడి తగ్గుతుంది, ఇది బొగ్గు వేలం ధరలపై పర్యవసాన ప్రభావాన్ని చూపుతుంది. క్యాప్టివ్/వాణిజ్య బొగ్గు బ్లాకుల నుండి అధిక ఉత్పత్తితో, వేలంలో ప్రీమియం తగ్గుతుంది. అందువల్ల, దేశంలోని వివిధ వినియోగదారులకు తక్కువ ధరలకు బొగ్గు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. బొగ్గు ఇంధనం వరకు మాత్రమే కాకుండా ఉక్కు, ఎరువులు, అల్యూమినియం, సిమెంట్, కాగితం, స్పాంజ్ ఐరన్ మొదలైన అన్ని ఇతర రంగాలకు ప్రధాన శక్తి వనరుగా ఉన్నందున ఇది ద్రవ్యోల్బణాన్ని పరిశీలించడంలో  సహాయపడుతుంది.

మరింత ఎక్కువ మంది ఇన్వెస్టర్లు పాల్గొనేందుకు వీలుగా తదుపరి రౌండ్ల వేలంలో మరిన్ని బ్లాక్‌లను అందించాలని, వివరణాత్మక అన్వేషణను వేగవంతం చేయాలని శ్రీ కిషన్ రెడ్డి ఆదేశించారు. బొగ్గు బ్లాకుల వేలంలో సాంకేతిక అర్హతకు బొగ్గు తవ్వకాలలో ఎలాంటి ముందస్తు అనుభవం అవసరం లేదని స్పష్టం చేయడం జరిగింది. బొగ్గు గనులు ఇప్పుడు బొగ్గు విక్రయం కోసం వేలం వేస్తుండడం వల్ల  ఆర్థిక బలం ఉన్న ఏ కంపెనీ అయినా పాల్గొనవచ్చు, అదీ తుది వినియోగ పరిమితి లేకుండా. ఏ పెట్టుబడిదారుడైనా బొగ్గు గనుల వేలంలో పాల్గొనవచ్చు. అటువంటి మైనింగ్‌లో ఉత్పత్తి చేసే బొగ్గును ఎగుమతితో సహా ఏ ఉద్దేశానికైనా బహిరంగ మార్కెట్‌లో ఉచితంగా విక్రయించవచ్చు.

2047 నాటికి ఇంధన స్వావలంబన, బొగ్గులో ఆత్మనిర్భర్త సాధించాలనే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా, క్యాప్టివ్/వాణిజ్య బొగ్గు బ్లాకుల నుండి ఈ సంవత్సరంలో కనీసం 175 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాలని, అన్ని వాటాదారులను కష్టపడి పని చేయాలని కేంద్ర మంత్రి సూచించారు. 19% వృద్ధిని చూపుతోంది.

కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి బొగ్గు గనుల 10వ రౌండ్ వాణిజ్య వేలాన్ని 21 జూన్ 2024న ప్రారంభించనున్నారు, బొగ్గు క్షేత్రాల వేలం, కార్యాచరణకు శ్రీకారం చుడుతున్నారు. 

***



(Release ID: 2027256) Visitor Counter : 33