కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

ఏప్రిల్ 2024 లో నికరంగా 18.92 లక్షల మంది చేరికతో అత్యధిక నమోదు చేసిన ఈపీఎఫ్ఓ


2024 ఏప్రిల్ నెలలో ఈపీఎఫ్ఓలో కొత్తగా చేరిన 8.87 లక్షల మంది సభ్యులు

Posted On: 20 JUN 2024 2:41PM by PIB Hyderabad

20 జూన్ 2024 న విడుదలైన ఇపిఎఫ్ఓ తాత్కాలిక పేరోల్ డేటా ప్రకారం ఏప్రిల్ 2024 లో ఇపిఎఫ్ఓ 18.92 లక్షల మంది నికర సభ్యులను నమోదు చేసింది. ఏప్రిల్ 2018 లో మొదటి పేరోల్ డేటా ప్రచురించబడినప్పటి నుండి ఈ నెలలో చేరడం అత్యధికం. అంతకుముందు మార్చి 2024 నెలతో పోలిస్తే ప్రస్తుత నెలలో నికర సభ్యుల చేరికలో 31.29% పెరుగుదల నమోదైంది.

 

2023 ఏప్రిల్ నెలతో పోలిస్తే నికర సభ్యుల చేరికల్లో 10 శాతం వృద్ధి నమోదైందని వార్షిక విశ్లేషణలో వెల్లడైంది. పెరిగిన ఉపాధి అవకాశాలుఉద్యోగుల ప్రయోజనాలపై పెరుగుతున్న అవగాహనఈపీఎఫ్ఓ ప్రచార కార్యక్రమాల ప్రభావం వంటి వివిధ అంశాలు ఈపీఎఫ్ఓ సభ్యత్వం పెరగడానికి కారణమని చెప్పవచ్చు.

 

ఏప్రిల్ 2024 లో 8.87 లక్షల మంది కొత్త సభ్యులు నమోదు చేసుకున్నట్లుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 18-25 సంవత్సరాల వయస్సు గల వారు ఆధిక్యం కలిగి ఉండగాకొత్త సభ్యులలో వారి శాతం 55.50% గా నమోదైంది. ఇది మునుపటి ధోరణికి అనుగుణంగా ఉంది. ఇది వ్యవస్థీకృత శ్రామిక శక్తిలో చేరేవారిలో ఎక్కువ మంది యువకులుప్రధానంగా మొదటిసారి ఉద్యోగార్థులు అని సూచిస్తుంది.

 

సుమారు 14.53 లక్షల మంది సభ్యులు నిష్క్రమించారనిఆ తర్వాత ఈపీఎఫ్ఓలో తిరిగి చేరారని పేరోల్ డేటా ప్రధానంగా ప్రస్తావిస్తోంది. 2024 మార్చి నెలతో పోలిస్తే ఇది 23.15 శాతం అధికం. ఈ సభ్యులు తమ ఉద్యోగాలను మార్చుకుని ఇపిఎఫ్ఓ పరిధిలోకి వచ్చే సంస్థలలో తిరిగి చేరారు. తుది పరిష్కారం కోసం దరఖాస్తు చేయడానికి బదులుగా వారి మొత్తాలను బదిలీ చేయడానికి ఎంచుకున్నారుతద్వారా దీర్ఘకాలిక ఆర్థిక శ్రేయస్సును కాపాడతారువారి సామాజిక భద్రతా రక్షణ కూడా విస్తరిస్తుంది.

 

8.87 లక్షల మంది కొత్త సభ్యుల్లో 2.49 లక్షల మంది కొత్త మహిళా సభ్యులు ఉన్నారని పేరోల్ డేటాను లింగాల వారీగా విశ్లేషణలో వెల్లడైంది. అలాగేఈ నెలలో నికర మహిళా సభ్యుల చేరిక సుమారు 3.91 లక్షలుగా ఉంది. ఇది మార్చి 2024 తో పోలిస్తే సుమారు 35.06% పెరిగింది. మహిళా సభ్యుల చేరికలు పెరగడం మరింత సమ్మిళితవైవిధ్యమైన శ్రామిక శక్తి వైపు విస్తృత మార్పును సూచిస్తుంది.

 

పేరోల్ డేటాను రాష్ట్రాల వారీగా విశ్లేషణ చేయగామహారాష్ట్రకర్ణాటకతమిళనాడుగుజరాత్హరియాణా వంటి 5 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో నికర సభ్యుల చేరిక అధికంగా నమోదైంది. ఈ రాష్ట్రాలు నికర సభ్యుల చేరికలో 58.30% ఉన్నాయి. ఈ నెలలో మొత్తం 11.03 లక్షల నికర సభ్యులు చేరారు. అన్ని రాష్ట్రాల కంటే మహారాష్ట్ర 20.42 శాతం నికర సభ్యులను చేర్చుకుని ముందంజలో ఉంది.

 

పరిశ్రమల వారీగా నెలవారీ డేటాను పోల్చి చూస్తే పరిశ్రమల్లో నిమగ్నమైన సంస్థల్లో పనిచేసే సభ్యుల్లో గణనీయమైన వృద్ధి కనిపిస్తోంది. నిపుణుల సేవలుట్రేడింగ్- వాణిజ్య సంస్థలుఎలెక్ట్రానిక్మెకానికల్ లేదా సాధారణ ఇంజినీరింగ్ ఉత్పత్తులుఇంజనీర్లు - ఇంజనీరింగ్ కాంట్రాక్టర్లుస్కూల్బిల్డింగ్ అండ్ నిర్మాణ సంస్థలువిశ్వవిద్యాలయాలుకాలేజీలుస్కూల్స్ మొదలైనవి. మొత్తం నికర సభ్యత్వంలో 41.41% అదనంగా నిపుణుల సేవలు (మానవ వనరుల సరఫరాదారులుసాధారణ కాంట్రాక్టర్లుభద్రతా సేవలుఇతర కార్యకలాపాలు మొదలైనవి) నుండి ఉన్నాయి.

 

పై పేరోల్ డేటా తాత్కాలికమైనది ఎందుకంటే డేటా జనరేషన్ అనేది నిరంతర ప్రక్రియఎందుకంటే ఉద్యోగి రికార్డును అప్‌డేట్ చేయడం ఒక నిరంతర ప్రక్రియ. అందువల్ల మునుపటి డేటా ప్రతి నెలా నవీకరించబడుతుంది. ఏప్రిల్-2018 నుండిసెప్టెంబర్ 2017 నాటి నుంచి ఇపిఎఫ్ఓ పేరోల్ డేటా కవరేజీని విడుదల చేస్తోంది. నెలవారీ పేరోల్ డేటాలోఆధార్ ధృవీకరించిన యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యుఎఎన్) ద్వారా మొదటిసారిగా ఇపిఎఫ్ఓలో చేరిన సభ్యుల సంఖ్యఇపిఎఫ్ఓ కవరేజీ నుండి నిష్క్రమించిన ప్రస్తుత సభ్యులునిష్క్రమించి తిరిగి సభ్యులుగా చేరిన వారి సంఖ్యను నికర నెలవారీ పేరోల్ కు  తీసుకుంటారు.

***



(Release ID: 2027251) Visitor Counter : 42