కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సంధాన సేవా ప్రదాతలు ఆర్‌బిఐ సెబి ఐఆర్‌డిఎఐ బ్యాంకులుస‌హా ఇతర ఆర్థిక సంస్థలతో ‘ట్రాయ్’ సమావేశం

Posted On: 14 JUN 2024 7:37PM by PIB Hyderabad

   టెలిక‌మ్యూనికేష‌న్ల నియంత్ర‌ణ ప్రాధికార సంస్థ (టిఆర్ఎఐ-ట్రాయ్‌) 2024 జూన్ 14న వివిధ ప్రాధికార సంస్థలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, టెలికం సేవప్రదాతలతో ఒక సమావేశం నిర్వహించింది. భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ), భారత సెక్యూరిటీలు-ఎక్స్ఛేంజ్ బోర్డు (సెబి), బీమా నియంత్రణ-అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డిఎఐ), 25కుపైగా ప్రభుత్వ-ప్రైవేటు, అంతర్జాతీయ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలుసహా అన్ని టెలికం సేవాప్రదాన సంస్థల నుంచి ప్రతినిధులతోపాటు జాతీయ ఎక్స్ఛేంజీల సమాఖ్య (ఎఎన్ఎంఐ) సభ్యులు కూడా ఇందులో పాల్గొన్నారు.

సమావేశంలో ప్రధానంగా చర్చించిన కీలకాంశాలు కిందివిధంగా ఉన్నాయి:

ఎ. ‘ట్రాయ్’ సిఫారసుల మేరకు లావాదేవీలు, సేవా సంబంధిత ‘వాయిస్ కాల్స్ చేయడం కోసం 160 సిరీస్ ప్రత్యేకంగా కేటాయించబడింది. తొలి దశలో ఇది ‘‘ఆర్‌బిఐ, సెబి, ఐఆర్‌డిఎఐ, పిఎఫ్ఆర్‌డిఎ’’ల నియంత్రణలోగల అన్ని సంస్థలకు అందుబాటులో ఉంటుంది. దీని అమలు అనంతరం కాల్ చేసే సంస్థ/వ్యక్తిని సులభంగా గుర్తించే సదుపాయం కలుగుతుంది. తద్వారా మోసగాళ్ల చేతిలో అమాయక పౌరులు  మోసపోకుండా నిరోధించే వీలు కలుగుతుంది. ఈ సిరీస్‌ను సమర్ధంగా వినియోగించుకోవడంపై నియంత్రణ సంస్థలు, కంపెనీలు, టెలికాం సేవా ప్రదాతల మధ్య ఆలోచనల మార్పిడికి ఈ సమావేశం వేదికగా ఉపయోగపడింది. ప్రస్తుతం ప్రచార ప్రయోజనం కోసం ఉపయోగించే 140 సిరీస్ నిర్వహణ ప్రక్రియ ‘డిఎల్‌టి’ ప్లాట్‌ఫారమ్‌కు  మార్చబడుతుంది. ఈ నేపథ్యంలో డిజిటల్ సమ్మతి స్క్రబ్బింగ్ అమలుపైనా ప్రతినిధులు చర్చించారు. పై రెండు చర్యల అమలుతో 10 అంకెలుగల నంబర్ల  నుంచి వచ్చే స్పామ్ కాల్స్‌పై గణనీయ నియంత్రణకు వీలుంటుంది.

బి. ‘ట్రాయ్’ అమలు చేస్తున్న టిసిసిసిపిఆర్-2018 నిబంధనల ప్రకారం టెలికాం సేవా ప్రదాతలు ఏర్పాటు చేసిన డిజిటల్ సమ్మతి సౌకర్యం (డిసిఎ)పైనా సమావేశం లోతుగా చర్చించింది. ఈ సదుపాయం ద్వారా ఖాతాదారు డిజిటల్ సమ్మతి పొందడంలో సౌలభ్యం కలుగుతుంది. దీనివల్ల బ్యాంకులు, బీమా కంపెనీలు, ఇతర సంస్థలు వంటి సందేశాలు పంపే సంస్థలు ‘డిఎన్‌డి’ స్థితితో సంబంధం లేకుండా సంక్షిప్త, (ఎస్ఎంఎస్) వాయిస్ సందేశాల ద్వారా ఖాతాదారులకు వ్యాపార ప్రచార సమాచారం పంపే వెసులుబాటు ఉంటుంది.

సి. ‘ట్రాయ్’ నిబంధనలకు సంబంధించి సందేశాలు పంపే బ్యాంకులు, బీమా కంపెనీలు, ఇతరత్రా సంస్థల పాత్రతోపాటు బాధ్యతలపైనా సమావేశం చర్చించింది. వీటిలోని ‘కంటెంట్ టెంప్లేట్‌’లలో ’యుఆర్ఎల్/ఎపికె’లను ‘వైట్‌లిస్ట్’ చేయడం, కనిష్ట సంఖ్యలో హెడర్‌, ‘కంటెంట్ టెంప్లేట్‌’ల వినియోగం, సందేశాలు పంపే వాస్తవ సంస్థల వివరాలను దుర్వినియోగం చేసే సంస్థ/టిఎంలపై తక్షణ చర్యలు చేపట్టడం తదితరాలపై సమావేశం నిర్ణయానికి వచ్చింది.

   స్పామ్ ముప్పును అరికట్టడానికి పరస్పర సహకారంతో కృషి చేయాల్సిన అవసరాన్ని నియంత్రణ ప్రాధికార సంస్థలు, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు నొక్కిచెప్పాయి. ముఖ్యంగా వాయిస్ కాల్స్ ద్వారా, ‘ట్రాయ్’ ద్వారా వివిధ కార్యక్రమాలను సమయానుగుణంగా అమలు చేయడంలో అన్నివిధాలా సహకరిస్తామని హామీ ఇచ్చాయి.

***


(Release ID: 2025439) Visitor Counter : 106