సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైన ముంబై అంతర్జాతీయ చలన చిత్రోత్సవం: ఐదు నగరాల్లో మరచిపోలేని అనుభూతిని పంచనున్న 18వ ఎడిషన్


భారత క్రియేటర్లకు ప్రపంచం యొక్క ఊహలను ఆకర్షించేందుకు ఎంఐఎఫ్ఎఫ్ ఒక అవకాశాన్ని అందిస్తుంది: శ్రీ సంజయ్ జాజు, కార్యదర్శి, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ


డాక్యుమెంటరీ చిత్రాలు సమాచారం, ప్రేరణ, ఆత్మపరిశీలన, వినోదాన్ని అందించే శక్తి ఉన్న పెద్ద పరిశ్రమలో భాగం : శ్రీ సంజయ్ జాజు

Posted On: 14 JUN 2024 7:35PM by PIB Hyderabad

లఘు చిత్రాలుడాక్యుమెంటరీలుయానిమేషన్ చిత్రాల కోసం 18వ ఎడిషన్ ముంబయి అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (ఎంఐఎఫ్ఎఫ్) రేపు ఘనంగా ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ప్రేక్షకులుసినీ రంగ నిపుణులను ఆకట్టుకునే విధంగా సినీ వేడుకలకు నాంది పలికనుంది.

 

కేంద్ర సమాచారప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శిశ్రీ సంజయ్ జాజు కర్టెన్ రైజర్ పత్రికా సమావేశంలో మాట్లాడుతూవేడుకల్లో పాల్గొనేవారి కోసం సుసంపన్న అనుభవ దృశ్యాన్ని వివరించారు. ఇలాంటి ఉత్సవాల నిర్వహణ లక్ష్యం కేవలం సినిమాను ప్రోత్సహించడం మాత్రమే కాదని..స్థానికసామాజిక-ఆర్థిక సమస్యలను ప్రతిబింబించడం పరిష్కారాల వైపు విధాన రూపకర్తలకు మార్గనిర్దేశం చేయడం అని అన్నారు.

 

డాక్యుమెంటరీలఘు చిత్రాలకు పెరుగుతున్న మార్కెట్ గురించి సూచించిన శ్రీ సంజయ్ జాజుడాక్యుమెంటరీ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా 16 బిలియన్ల అమెరికన్ డాలర్ల విలువైన భారీ పరిశ్రమ అని పేర్కొన్నారు. సమాచారంప్రేరణఆత్మపరిశీలనవినోదాన్ని అందించే కళా ప్రక్రియను ప్రదర్శిస్తుందని అన్నారు. డాక్యుమెంటరీలతో పాటు డైనమిక్ వీఎఫ్ఎక్స్ కలిగిన యానిమేషన్ రంగం కూడా ఇందులో ఉంది. మనదేశంలో పెద్ద మొత్తంలో ఉపాధి అవకాశాలు ఉన్న పెద్ద పరిశ్రమ ఇది. ఈ రంగం కూడా ఈ ఏడాది ఎంఐఎఫ్ఎఫ్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు.

 

యానిమేషన్ విఎఫ్ఎక్స్ పరిశ్రమలో మన దేశం సాధించిన పురోగతిని ప్రధానంగా ప్రస్థావిస్తూఛోటా భీమ్చాచా చౌదరి వంటి భారతీయ విఎఫ్ఎక్స్ పాత్రలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయని...భారతీయ కథలకు విశ్వవ్యాప్తంగా ప్రతిధ్వనించే శక్తి ఉందని అవి నిరూపిస్తున్నాయని కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు అన్నారు. యానిమేషన్ రంగంలో మన దేశంలోనే మేధో సంపత్తిని సృష్టించడమే తమ లక్ష్యమన్నారు. ప్రపంచ ఊహలను ఆకర్షించే ఇటువంటి ఆలోచనలతో ముందుకు రావడానికి మా సృష్టికర్తలలో చాలా మందికి ఇది ఒక మంచి అవకాశం" అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

ముంబయిలో ఎంఐఎఫ్ఎఫ్ కర్టెన్ రైజర్ పత్రికా సమావేశంలో మాట్లాడుతున్న సమాచారప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు

వచ్చే వారంలో ఎంఐఎఫ్ఎఫ్ 61 భాషల్లో 59 దేశాలకు చెందిన 314 సినిమాలు, 8 వరల్డ్ ప్రీమియర్లు, 5 అంతర్జాతీయ ప్రీమియర్లు, 18 ఆసియా ప్రీమియర్లు, 21 ఇండియా ప్రీమియర్లను ప్రదర్శించనున్నట్లు శ్రీ సంజయ్ జాజు ప్రకటించారు.  అరవై దేశాలు తమ సినిమాలుఇతర కార్యక్రమాల ద్వారా ఈ వేడుకల్లో పాల్గొంటున్నాయి.

 

ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీలంక ప్రభుత్వం తమ సాంస్కృతిక వారసత్వ ప్రదర్శనను నిర్వహించనుంది. ముగింపు వేడుకల్లో అర్జెంటీనా ప్రభుత్వం తమ దేశ ప్రతిభను ప్రదర్శిస్తోంది.

 

శ్రీ సంజయ్ జాజు మాట్లాడుతూఎంఐఎఫ్ఎఫ్ కేవలం భారత్‌కు మాత్రమే సంబంధించినది కాదనిఇది ప్రపంచానికి సంబంధించినదన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఫిల్మ్ మేకర్లకు అవకాశాలను కల్పిస్తుందని ఆయన వివరించారు.

 

ఎంఐఎఫ్ఎఫ్‌లో పలు వినూత్న కార్యక్రమాలను చేపట్టనున్నట్లు కార్యదర్శి ప్రకటించారు. ఈ ఏడాది వేడుకల్లో మొట్టమొదటి డాక్ ఫిల్మ్ బజార్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. స్వతంత్ర చిత్ర నిర్మాతలుతమ ప్రాజెక్టుల కోసం కొనుగోలుదారులనుస్పాన్సర్లుసహకారులను కనుగొనడానికి ఒక ప్రత్యేక మార్కెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు కార్యదర్శి తెలిపారు.

 

మొట్టమొదటిసారిగాఎంఐఎఫ్ఎఫ్ మిడ్‌ఫెస్ట్ ఫిల్మ్డానియెలా వోల్కర్ దర్శకత్వం వహించిన "ది కమాండెంట్స్ షాడో" ను ప్రదర్శించనున్నారు. ఎంఐఎఫ్ఎఫ్ 2024 వేదికలను అందరికీ పూర్తిగా అందుబాటులోకి తీసుకురావడం కోసం ఎన్‌జీఓ స్వయమ్ అనే స్వచ్ఛంద సంస్థ భాగస్వామ్యంతో వికలాంగుల కోసం ప్రత్యేక చిత్రాలను ప్రదర్శించనున్నట్లు ఆయన తెలిపారు.

 

ఎంఐఎఫ్ఎఫ్ చరిత్రలో తొలిసారిగా ముంబయికోల్‌కతాచెన్నైపుణెఢిల్లీ నగరాల్లో ఏకకాలంలో ఎంఐఎఫ్ఎఫ్ స్క్రీనింగ్ లురెడ్ కార్పెట్ ఈవెంట్లు జరుగనున్నాయి. వివిధ ప్రాంతాల్లోని ప్రేక్షకులు సమాంతర ప్రదర్శనలను ఆస్వాదించవచ్చు. ఇది భారతదేశం అంతటా ఉన్న సినీ ఔత్సాహికులకు ప్రపంచ స్థాయి సినిమా మాయాజాలాన్ని మరింత దగ్గర చేస్తుంది.

 

భవిష్యత్ ఫిలిం మేకర్లను ప్రోత్సహించడానికి మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాలను కార్యదర్శి వివరించారు. ఈ ఏడాదిఎఫ్‌టీఐఐఎస్ఆర్ఎఫ్‌టీఐఐఐఎంసి వంటి ప్రముఖ సినీ సంస్థల నుండి విద్యార్థులను ఆహ్వానించడం ద్వారా ఈ వేడుకల్లో ఒక ముఖ్యమైన ముందడుగు పడుతుందని ఆయన తెలిపారు. ఇది విద్యార్థులకు పరిశ్రమ వ్యక్తులనుఅనుబంధాన్ని పెంచుకునే అవకాశాన్ని అందిస్తుంది. "వర్ధమాన చిత్రనిర్మాతలు ఒకరి నుంచి మరొకరు నేర్చుకోవడానికిఇప్పటికే తమదైన ముద్ర వేసిన వారితో పాటు మాస్టర్లునిపుణులుప్రముఖుల నుంచి నేర్చుకోవడానికి ఈ వేడుకలు వీలు కల్పిస్తాయి. ఎంఐఎఫ్ఎఫ్‌కు ఎందరో గొప్ప చిత్రనిర్మాతలను సృష్టించిన వారసత్వం ఉంది. భవిష్యత్తు కోసం ఛాంపియన్లను సృష్టించడంవారు ఎదిగేందుకు అవకాశం కల్పించడం దీని వెనుక ఉన్న ఆలోచన" అని ఆయన అన్నారు.

 

ఈ ఏడాది జరిగిన 77వ కేన్స్ చలన చిత్రోత్సవాల్లో ప్రశంసలు అందుకున్న ఎఫ్‌టీఐఐ విద్యార్థిని లఘు చిత్రం 'సన్ ఫ్లవర్స్ను ప్రారంభ వేడుకలో ప్రదర్శించనున్నట్లు శ్రీ సంజయ్ జాజు తెలిపారు. సాఫ్ట్ పవర్ లో భారత్ ఆధిక్యం వాస్తవికత అనివచ్చే వారం రోజులపాటు ఎంఐఎఫ్‌ఎఫ్‌లో భాగం కాబోతున్న ఈ సృజనాత్మక దర్శకుల ప్రతిభను చూస్తామని ఆయన తెలిపారు. "భారత్ ఒక పెద్దభిన్నత్వం కలిగిన దేశంఇందులో పెద్ద సంఖ్యలో భాషలు మరియు సృజనకారులు ఉన్నారు. సోషల్ మీడియా యుగంలో సినిమా స్కూల్ కు కూడా వెళ్లని క్రియేటర్లు చాలా మందే ఉన్నారు. కానీ వారు భారీ అభిమానులను కలిగి ఉన్నారు. వారు సృష్టించే కంటెంట్‌లో వాగ్దానాన్ని కలిగి ఉంటారు. అలాంటి వారందరికీ అవకాశం లభిస్తుంది. ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్లను ప్రోత్సహించడానికి ప్రభుత్వ పథకాలు చాలా ఉన్నాయని వివరించారు.

 

ఎన్ఎఫ్‌డీసి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రీతుల్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, 18 వ ఎంఐఎఫ్ఎఫ్ 2024లో ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శనలను వివరిస్తూ పిపిటిని సమర్పించారు. కర్టెన్ రైజర్ పిపిటిని ఇక్కడ చూడండి.

***


(Release ID: 2025431) Visitor Counter : 109