రైల్వే మంత్రిత్వ శాఖ
రైల్వే బోర్డు సభ్యులతో రైల్వేశాఖ సహాయ మంత్రి శ్రీ రవ్‌నీత్ సింగ్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం
Posted On:
12 JUN 2024 4:53PM by PIB Hyderabad
రైల్వేలు-ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ రవ్‌నీత్ సింగ్ 2024 జూన్ 11న రైల్వే బోర్డు సభ్యులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వేల సంబంధిత వివిధ అంశాలపై బోర్డు సభ్యులు ఆయనకు సంక్షిప్తంగా వివరించారు. అలాగే భారత రైల్వేల్లో కొనసాగుతున్న పలు కార్యకలాపాల గురించి మంత్రికి తెలియజేశారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను సాకారం చేయడంలో భాగంగా ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా భారత రైల్వేలను తీర్చిదిద్దడానికి సమష్టిగా కృషిచేద్దామని శ్రీ రవ్‌నీత్ సింగ్ అధికారులకు పిలుపునిచ్చారు. దేశంలోని సామాన్య ప్రజానీకానికి రైలు సదుపాయం ఎంతో సౌకర్యవంతమైన రవాణా సాధనమని ఆయన గుర్తుచేశారు. సమాజంలోని అన్నివర్గాల... ముఖ్యంగా పేదల అవసరాలకు తగినట్లు భారత రైల్వేలను రూపుదిద్దడానికి అన్నివిధాలా కృషి చేయాల్సిన అవసరాన్ని మంత్రి నొక్కిచెప్పారు.
***
(Release ID: 2024965)
Visitor Counter : 101