నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ

నైపుణ్య అభివృద్ధి మరియు నవ పారిశ్రమికత్వ మంత్రిత్వ శాఖ సహాయమంత్రి (స్వతంత్ర బాధ్యత) గా పదవీబాధ్యతలను చేపట్టిన శ్రీ జయంత్ చౌధరి


మన దేశానికి కీలకం అయినటువంటి మంత్రిత్వ శాఖ లో నా వంతుపాత్ర ను నేను పోషిస్తాను: శ్రీ జయంత్ చౌధరి

Posted On: 11 JUN 2024 5:26PM by PIB Hyderabad

నైపుణ్యాభివృద్ధి మరియు నవ పారిశ్రమికత్వ మంత్రిత్వ శాఖ (ఎమ్ఎస్ డిఇ) కి సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) గా శ్రీ జయంత్ చౌధరి న్యూ ఢిల్లీ లోని కౌశల్ భవన్ లో పదవీబాధ్యతల ను స్వీకరించారు. మంత్రిత్వ శాఖ కార్యాలయానికి శ్రీ జయంత్ చౌధరి చేరుకోగానే, ఎమ్ఎస్ డిఇ కార్యదర్శి శ్రీ అతుల్ కుమార్ తివారి మరియు మంత్రిత్వ శాఖ లోని ఇతర సీనియర్ అధికారులు మంత్రి కి స్వాగతం పలికారు.

 

Image 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన మీద ఉంచిన విశ్వాసానికి గాను మంత్రి తన కృతజ్ఞ‌త‌లను వ్యక్తం చేస్తూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లో ఒక నాయకత్వ భూమిక ను పోషించే విధం గా భారతదేశం మారే క్రమం లో దేశానికి కీలక మంత్రిత్వ శాఖ అయినటువంటి నైపుణ్యాభివృద్ధి మరియు నవ పారిశ్రమికత్వ మంత్రిత్వ శాఖ లో తన వంతు పాత్ర ను తాను పోషిస్తానన్నారు.

 

ఈ సందర్భం లో శ్రీ జయంత్ చౌధరి మాట్లాడుతూ, అపారమైనటువంటి మరియు యవ్వనభరితం అయినటువంటి జనాభా ను కలిగివున్న భారతదేశానికి, భారతీయులు వారి ఆకాంక్షలను నెరవేర్చుకోవాలి అంటే అందుకోసం వారికి నైపుణ్యాలను సాధించుకోవడం, ఎప్పటికప్పుడు తాజా నైపుణ్యాలను సంపాదించుకొంటూ ఉండడం తో పాటుగా నైపుణ్యాల ను పెంపొందింప చేసుకొంటూ ఉన్నత స్థాయి కి ఎగబాకుతూ ఉండేందుకు తగిన అవకాశాలు అందుతూ ఉండాలి కూడాను అని పేర్కొన్నారు. ఇది ప్రతి పౌరుడు/ప్రతి పౌరురాలు అతడి వంతుగా/ఆమె వంతు గా ఎదుగుతూ, మన దేశం యొక్క సమృద్ధి కి తోడ్పాటు ను ఇచ్చేటటువంటి ఒక అభివృద్ధి చెందిన భారతదేశాన్ని (‘వికసిత్ భారత్’ ను) సాకారం చేయాలన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోది యొక్క దృష్టికోణానికి అనుగుణం గా ఉంది అని మంత్రి అన్నారు. జీవనం లోని అన్ని రంగాల లో క్రొత్తవైన నైపుణ్యాలను మరియు పరిశ్రమ అవసరాలకు తులతూగగలిగిన నైపుణ్యాలను సంపాదించుకొంటూ ఉండవలసిన నిరంతర ఆవశ్యకత ఉందని, మరి నైపుణ్యాభివృద్ధి మరియు నవ పారిశ్రమికత్వ మంత్రిత్వ శాఖ యొక్క నిరంతర ప్రయాసలు నైపుణ్యాల సాధన, ఇంకా ఉపాధి కల్పన ల సంబంధి ముఖచిత్రం లో గుర్తించదగ్గ ప్రభావాన్ని ప్రసరించగలవని కూడా మంత్రి నొక్కిచెప్పారు.

 

ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (పిఎఎమ్ కెవివై), నేశనల్ అప్రెంటిస్ శిప్ ప్రమోశన్ స్కీము (ఎన్ఎపిఎస్) ల వంటి ప్రధాన పథకాలు సహా వ్యూహాత్మకమైన కార్యక్రమాల ను అమలు చేయడం కోసం ఈ మంత్రిత్వ శాఖ కంకణం కట్టుకొంది; అలాగే, ఉద్యోగాన్ని చేజిక్కించుకొనే అర్హతను వృద్ధి చెందింప చేయడం పైన మరియు నవ పారిశ్రమికత్వాన్ని ప్రోత్సహించడం పైన నిరంతర శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. డిజిటల్ సాంకేతికతలను అక్కున చేర్చుకోవడం, మౌలిక సదుపాయాలను పెంచడం మరియు అన్ని వర్గాల వారికి విద్య ఫలాలు అందేటట్టుగా చొరవ ను తీసుకోవడం వంటి మాధ్యాల ద్వారా శరవేగంగా మార్పుచేర్పులకు లోనవుతున్న ఉద్యోగ బజారు లో నిలదొక్కుకోవడానికి కావలసిన నైపుణ్యాల ను మరియు జ్ఞానాన్ని వ్యక్తుల కు సంతరించాలన్నది ఎమ్ఎస్ డిఇ యొక్క ధ్యేయం గా ఉన్నది. శీఘ్రమైనటువంటి మరియు స్పష్టంగా కనుపించగలిగినటువంటి ప్రగతి కై మన లోని సమర్పణ భావాన్ని చాటి చెప్పే అధిక ప్రభావయుక్త కార్యక్రమాలను త్వరిత గతిన అమలుపరచడంపైన ఎమ్ఎస్ డిఇ శ్రద్ధ వహిస్తున్నది.

 

వివిధ రంగాల లోను మరియు దేశ వ్యాప్తంగాను వృద్ధి మరియు అభివృద్ధి ప్రక్రియలు నిరంతరంగా కొనసాగుతూ ఉండేలాగా నిరాదరణ కు లోనైన వర్గాల వారిని వికాసం తాలూకు ప్రధాన స్రవంతి లో అంతర్భాగం గా చేయగల కార్యక్రమాల ను మరియు పథకాల ను తీసుకు వచ్చి అమలు చేయాలి అన్నదే శ్రీ జయంత్ చౌధరి అభిప్రాయం గా ఉంది. ఆయన అపారమైనటువంటి అనుభవం కలిగిన వ్యక్తే కాకుండా ప్రజల సంక్షేమం పట్ల తీవ్ర నిబద్ధత ను కూడా ఆయన కలిగివున్నారు. ఆయన వాణిజ్య విషయాల స్థాయి సంఘం, ఆర్థిక విషయాల సంప్రదింపుల సంఘం, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసిఎఆర్) మరియు ప్రభుత్వ హామీల సంఘం లలో సభ్యుని గా పనిచేశారు. వ్యవసాయం స్థాయిసంఘం మరియు ఆర్థిక విషయాల స్థాయిసంఘాల తో పాటు గా నైతికసూత్రాల సంఘం లో కూడా ఆయన తన యొక్క సేవలను అందించారు.

 

శ్రీ జయంత్ చౌధరి దిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన శ్రీ వేంకటేశ్వర కళాశాల లో అండర్ గ్రాడ్యుయేట్ స్టడీస్ ను ముగించుకొని, 2002వ సంవత్సరంలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఎండ్ పొలిటికల్ సైన్సు నుండి అకౌంటింగ్, ఇంకా ఫైనాన్స్ లో ఎమ్.ఎస్ సి. పట్టా ను అందుకొన్నారు.

 

***



(Release ID: 2024562) Visitor Counter : 27