సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

మైక్రో, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రిగా శ్రీ జితన్ రామ్ మాంఝి, సహాయ మంత్రిగా సుశ్రీ శోభా కరంద్లాజే బాధ్యతల స్వీకారం

Posted On: 11 JUN 2024 2:38PM by PIB Hyderabad

కేంద్ర మైక్రో, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రిగా శ్రీ జితన్ రామ్ మాంఝి నేడు బాధ్యతలు స్వీకరించారు. 2014, 2015 సంవత్సరాల మధ్య కాలంలో ఆయన బిహార్ ముఖ్యమంత్రిగా పని చేశారు.

 

శ్రీమతి శోభా కరంద్లాజే కేంద్ర మైక్రో, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె గతంలో వ్యవసాయ, వ్యవసాయదారుల సంక్షేమ శాఖ సహాయమంత్రి; ఫుడ్  ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయమంత్రిగా కేంద్రంలో పని చేశారు.

బాధ్యతల స్వీకారం అనంతరం కేంద్ర మంత్రి శ్రీ జితన్ రామ్ మాంఝి మీడియాతో మాట్లాడుతూ విజన్ 2047, ఆత్మనిర్భర్ భారత్ ప్రయాణంలో తనను కూడా భాగస్వామిని చేసినందుకు గౌరవ  ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రయత్నంలో ఎంఎస్ఎంఇ శాఖ  కీలకంగా ఉంటుందని ఆయన అన్నారు.

ఎంఎస్ఎంఇ శాఖను స్వయం-సమృద్ధంగా తీర్చి దిద్ది జిడిపిలో పరిశ్రమల వాటా పెంచేందుకు తాను కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

ఎంఎస్ఎంఇలను సాధికారం చేయడంలో ఎలాంటి అలసత్వం వద్దని మంత్రులిద్దరూ మంత్రిత్వ శాఖ అధికారులను కోరారు.

***



(Release ID: 2024548) Visitor Counter : 20