మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
మత్స్య, పశుసంవర్థక, డెయిరీ మంత్రిత్వశాఖ, పంచాయితీ రాజ్ మంత్రిత్వశాఖల బాధ్యతల్ని చేపట్టిన కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ బాధ్యతలు స్వీకరించిన సహాయ మంత్రులు శ్రీ జార్జ్ కురియన్, ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బగేల్
Posted On:
11 JUN 2024 3:10PM by PIB Hyderabad
కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ మత్స్య, పశుసంవర్థక, డెయిరీ మంత్రిత్వశాఖ, పంచాయితీ రాజ్ మంత్రిత్వశాఖల బాధ్యతల్ని చేపట్టారు. అధికారం చేపట్టిన వెంటనే మీడియాను ఉద్దేశించి మాట్లాడిన ఆయన శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వ దార్శనికత, విధానాలు కొనసాగుతాయని అన్నారు. శ్రీ మోదీ ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవడంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించడంపైనే తన దృష్టి వుంటుందని స్పష్టం చేశారు.

మత్స్య, పశుసంవర్థక, డెయిరీ శాఖ, పంచాయితీ రాజ్ శాఖల సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బగేల్, మత్స్య, పశుసంవర్థక, డెయిరీ శాఖ సహాయ మంత్రి శ్రీ జార్జ్ కురియన్ తమ తమ శాఖలలుబాధ్యతల్ని చేపట్టారు. అంతకు ముందు ఆయ విభాగాల కార్యదర్శులు, ఇతర సీనియర్ అధికారులు గౌరవనీయ మంత్రులకు స్వాగతం పలికారు.

***
(Release ID: 2024539)