వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వినియోగదారు వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రిగా నిముబెన్ జయంతిభాయ్ బంభానియా బాధ్యతలు తీసుకున్నారు.


వినియోగదారు వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రిగా బీఎల్. వర్మ బాధ్యతలు తీసుకున్నారు.

प्रविष्टि तिथि: 11 JUN 2024 3:25PM by PIB Hyderabad

 

నిముబెన్ జయంతిభాయ్ బంభానియా... వినియోగదారు వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రిగా దిల్లీలో బాధ్యతలు తీసుకున్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ, సహాయ మంత్రి బీఎల్. వర్మ అధ్వర్యంలో మాజీ కేంద్ర జౌళి శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంత్రికి పుష్పగుచ్చం అందించారు.

 



వినియోగదారు వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రిగా బీఎల్. వర్మ కూడా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషీ ఈ సందర్భంగా వర్మకు స్వాగతం పలికారు.

ఆహారం, ప్రజా పంపిణీ విభాగం సెక్రటరీ సంజీవ్ చోప్రా, వినియోగదారు వ్యవహారాలు విభాగం సెక్రటరీ నిధి కారే, ఇతర సీనియర్ అధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు.

***


(रिलीज़ आईडी: 2024518) आगंतुक पटल : 104
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , English , Urdu , हिन्दी , Hindi_MP , Gujarati , Malayalam