సహకార మంత్రిత్వ శాఖ
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కేంద్ర సహాకార మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.
సహాకార్ సే సమృద్ధి అనే సూత్రాన్ని అనుసరిస్తూ రైతు సాధికారత సాధించటం ద్వారా గ్రామీణ, జాతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు సహాకార మంత్రిత్వ శాఖ పనిచేస్తుంది.
Posted On:
11 JUN 2024 7:01PM by PIB Hyderabad
దిల్లీలోని అటల్ అక్షయ్ ఊర్జా భవన్‌లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేడు సహాకార మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విజన్ అయిన 'సహాకార్ సే సమృద్ధి' అనుగుణంగా రైతు సాధికారత సాధించస్తూ... గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో పాటు జాతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు సహాకార మంత్రిత్వ శాఖ చేస్తున్న పనిని కొనసాగిస్తుందని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. "సహాకారం అనే ఆలోచనలో సాధికారత సాధిస్తూ ఈ రంగానికి సంబంధించిన కోట్ల మందికి కొత్త అవకాశాలను కల్పిస్తూ, వారి జీవితాల్లో సానుకూల మార్పు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇవాళ మోదీ 3.0లో సహాకార మంత్రిత్వ శాఖ బాధ్యతలు తీసుకునే గౌరవం నాకు దక్కింది"అని పేర్కొన్నారు.
***
(Release ID: 2024516)
Visitor Counter : 87