ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆర్థిక శాఖ సహాయ మంత్రి హోదాలో వరుసగా రెండోసారి శ్రీ పంకజ్ చౌదరి బాధ్యతల స్వీకారం

प्रविष्टि तिथि: 11 JUN 2024 7:14PM by PIB Hyderabad

   కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి హోదాలో శ్రీ పంకజ్ చౌదరి వరుసగా రెండోసారి న్యూఢిల్లీలో ఇవాళ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన వయసు 59 సంవత్సరాలు. బీజేపీ పార్లమెంటు సభ్యుడుగా ఆయన ఎన్నికవడం ఇది ఏడోసారి. ఈ మేరకు 18వ లోక్‌సభకు తాజా ఎన్నికలలో ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ నుంచి ఆయన విజయం సాధించారు. పదవీ బాధ్యతలు స్వీకరించాక ఆర్థికశాఖ కార్యదర్శి డాక్టర్ టి.వి.సోమనాథన్, కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుసహా తమ శాఖలోని ఇతర కార్యదర్శులతోనూ శ్రీ చౌదరి కొద్దిసేపు సంభాషించారు.

 

   గోరఖ్‌పూర్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడైన శ్రీ చౌదరి మూడు దశాబ్దాలుగా ప్రజా జీవనంలో చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. లోగడ గోరఖ్‌పూర్ డిప్యూటీ మేయర్‌గానూ ఆయన బాధ్యతలు నిర్వర్తించారు.

 

   సుదీర్ఘ కాలం పార్లమెంటు సభ్యుడుగా పనిచేసిన శ్రీ చౌదరి అనేక సభా సంఘాల్లో సభ్యుడుగా ఉన్నారు. ఈ మేరకు ప్రధానమైన ప్రభుత్వరంగ సంస్థల కమిటీ; పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంతీయాభివృద్ధి నిధి పథకం (ఎంపీలాడ్స్) కమిటీ; శాస్త్ర-సాంకేతిక, పర్యావరణం-అడవులపై స్థాయీ సంఘం; గ్రామీణాభివృద్ధి-పంచాయతీ రాజ్, తాగునీరు-పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ; రసాయనాలు-ఎరువులపై స్థాయీ సంఘం; రైల్వేలపై స్థాయీ సంఘాల్లో బాధ్యతలు నిర్వర్తించారు.

****


(रिलीज़ आईडी: 2024497) आगंतुक पटल : 112
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Hindi_MP , Punjabi , Kannada , Malayalam