సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

మే, 2024కు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వ మంత్రిత్వ శాఖ‌లు, విభాగాల ప‌నితీరును తెలియ‌జేసే కేంద్రీకృత ప్ర‌జా ఫిర్యాదుల ప‌రిష్కారం, ప‌ర్య‌వేక్షణ వ్య‌వ‌స్థ ( సిపిజిఆర్ ఏ ఎం ఎస్)పైన 25వ మాస నివేదిక‌ను విడుద‌ల చేసిన ప‌రిపాల‌న సంస్క‌ర‌ణ‌లు మ‌రియు ప్ర‌జాఫిర్యాదుల (డిఏఆర్ పిజి) విభాగం.


మే, 2024లో మొత్తం 1, 05, 991 ఫిర్యాదులను ప‌రిష్క‌రించి కేంద్ర మంత్రిత్వ‌శాఖ‌లు, విభాగాలు

కేంద్ర స‌చివాల‌యంలో వ‌రుస‌గా 23వ నెల‌లో ల‌క్ష దాటిన ప‌రిష్కార కేసులు

మే, 2024కు గాను విడుద‌ల చేసిన ర్యాంకుల‌లో గ్రూప్ ఏ కేటగిరీకి సంబంధించి మొద‌టిస్థానం సాధించిన రెవిన్యూ విభాగం, ప‌రోక్ష ప‌న్నులు మ‌రియు సుంకాల విభాగం, తాగునీరు మ‌రియు పారిశుద్ధ్యం విభాగం

మే, 2024కు గాను విడుద‌ల చేసిన ర్యాంకుల‌లో గ్రూప్ బి కేటగిరీకి సంబంధించి మొద‌టిస్థానం సాధించిన నీతి ఆయోగ్‌, పార్ల‌మెంట్ వ్య‌వ‌హారాల శాఖ‌, ఆయుష్ మంత్రిత్వ‌శాఖ‌లు.

Posted On: 10 JUN 2024 8:37PM by PIB Hyderabad

 కేంద్ర ప్ర‌భుత్వ మంత్రిత్వ శాఖ‌లు, విభాగాల ప‌నితీరును తెలియ‌జేసే కేంద్రీకృత ప్ర‌జా ఫిర్యాదుల ప‌రిష్కారం, ప‌ర్య‌వేక్షణ వ్య‌వ‌స్థ ( సిపిజిఆర్ ఏ ఎం ఎస్)పైన 25వ మాస నివేదిక‌ను  ప‌రిపాల‌న సంస్క‌ర‌ణ‌లు మ‌రియు ప్ర‌జాఫిర్యాదుల (డిఏఆర్ పిజి) విభాగం విడుద‌ల చేసింది. ఇది మే, 2024కు సంబంధించిన నివేదిక‌.  ఈ నివేద‌క ప్ర‌జా ఫిర్యాదుల‌కు సంబంధించి వివ‌ర‌ణాత్మ‌క విశ్లేష‌ణ‌ను, వాటి కేట‌గిరీల‌ను అందిస్తోంది. అంతే కాదు ఆయా ఫిర్యాదుల ప‌రిష్కార తీరును తెలియ‌జేస్తుంది. 

మే, 2024కు సంబంధించిన ప్ర‌గ‌తి ప్ర‌కారం ఆయా కేంద్ర మంత్రిత్వ‌శాఖ‌లు, విభాగాలు 1,05,991 ఫిర్యాదుల‌ను ప‌రిష్క‌రించాయి. జ‌న‌వ‌రినుంచి మే, 2024వ‌ర‌కు తీసుకుంటే ఆయా కేంద్ర మంత్రిత్వ‌శాఖ‌లు, విభాగాల స‌రాస‌రి ఫిర్యాదు ప‌రిష్కార స‌మ‌యం 12 రోజులుగా న‌మోదైంది. కేంద్రీకృత ప్ర‌జా ఫిర్యాదుల ప‌రిష్కారం, ప‌ర్య‌వేక్షణ వ్య‌వ‌స్థ ( సిపిజిఆర్ ఏ ఎం ఎస్) సంస్క‌ర‌ణ‌ల ప్ర‌క్రియ‌లోని 10 అంచెల ప్ర‌క్రియ‌లో భాగంగా ఈ నివేదిక‌ల‌ను డిఏఆర్ పిజి అమ‌లు చేస్తోంది. త‌ద్వారా ఫిర్యాదుల నాణ్య‌త‌ను పెంచడం, స‌మ‌యాన్ని త‌గ్గించ‌డం జ‌రుగుతోంది. 

మే, 2024లో ప‌లు ఛానెళ్ల ద్వారా సిపిజిఆర్ ఏ ఎంఎస్ లో త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకున్న నూత‌న వినియోగ‌దారుల వివ‌రాల‌ను నివేదిక‌లో ఇచ్చారు. మే 2024లో మొత్తం 49486నూత‌న వినియోగ‌దారుల ఫిర్యాదులు న‌మోద‌య్యాయి. వీటిలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌నుంచి అధికంగా 7323 వున్నాయి. త‌ర్వాత మ‌హారాష్ట్ర నుంచి  5290 రిజిస్ట్రేష‌న్లు న‌మోద‌య్యాయి. 

ఉమ్మ‌డి సేవా కేంద్రాల ద్వారా మే, 2024లో న‌మోదైన ఫిర్యాదుల వివ‌రాల‌ను రాష్ట్రాల‌వారీగా కూడా ఈ నివేదిక పొందుప‌ర్చింది.  ఉమ్మ‌డి సేవా కేంద్రాల పోర్ట‌ల్ తో సిపిజిఆర్ ఏ ఎంఎస్ ను అనుసంధానం చేయ‌డంవ‌ల్ల అదిఇ 5 ల‌క్ష‌ల‌కు పైగా ఉమ్మ‌డ సేవా కేంద్రాల్లో అందుబాటులోకి వ‌చ్చింది. దాంతో రెండున్న‌ర ల‌క్ష‌ల గ్రామ‌స్థాయి ఔత్సాహిక వ్యాపార‌వేత్త‌లు దీన్ని ఉప‌యోగించుకున్నారు. మే, 2024లో సిఎస్ సి ల‌ద్వారా 6011 ఫిర్యాదులు న‌మోద‌య్యాయి. 

మే, 2024లో ఫీడ్‌బ్యాక్ కాల్ సెంట‌ర్ ద్వారా 71, 996 అభిప్రాయాల‌ను సేక‌రించ‌డం జ‌రిగింది. మొత్తం అభిప్రాయాల్లో 49 శాతం పౌరులు త‌మ త‌మ ఫిర్యాదుల ప‌రిష్కారం విష‌యంలో సంతృప్తి వ్య‌క్తం చేశారు. 

కేంద్ర‌మంత్రిత్వ‌శాఖ‌లు, విభాగాల‌కు సంబంధించి మే, 2024కుగాను న‌మోదైన ప్రజా ఫిర్యాదుల ముఖ్యాంశాలు 
ప్ర‌జా ఫిర్యాదుల కేసులు:   మే, 2024లో సిపిజిఆర్ ఏ ఎంస్ పోర్ట‌ల్ ద్వారా 1, 09, 889 ఫిర్యాదుల నమోద‌య్యాయి. వీటిలో 1,05, 991 ఫిర్యాదుల‌ను ప‌రిష్క‌రించ‌డం జ‌రిగింది. 31 మే, 2024 నాటికి పెండింగులో వున్న ప్ర‌జాఫిర్యాదులు 81, 331. 
ఉమ్మ‌డి సేవా కేంద్రాల ద్వారా మే, 2024లో సి 6011 ఫిర్యాదులు న‌మోద‌య్యాయి. 
ప్ర‌జల విజ్ఞ‌ప్తులు:   మే , 2024 లో 17,306 విజ్ఞ‌ప్త‌లను స్వీక‌రించారు. వాటిలో 18,607 విజ్ఞ‌ప్తుల‌ను ప‌రిష్కరించారు. 

ఫిర్యాదుల ప‌రిష్కార అంచనా మ‌రియు సూచిక ( జిఆర్ ఏ ఐ)- మే, 2024

మే, 2024కు గాను విడుద‌ల చేసిన ర్యాంకుల‌లో గ్రూప్ ఏ కేటగిరీకి సంబంధించి  రెవిన్యూ విభాగం, ప‌రోక్ష ప‌న్నులు మ‌రియు సుంకాల విభాగం, తాగునీరు మ‌రియు పారిశుద్ధ్యం విభాగం మొద‌టి స్థానం సంపాదించాయి. 

మే, 2024కు గాను విడుద‌ల చేసిన ర్యాంకుల‌లో గ్రూప్ బి కేటగిరీకి సంబంధించి  నీతి ఆయోగ్‌, పార్ల‌మెంట్ వ్య‌వ‌హారాల శాఖ‌, ఆయుష్ మంత్రిత్వ‌శాఖ‌లు మొద‌టి స్థానం సంపాదించాయి. 


 

***



(Release ID: 2023896) Visitor Counter : 46


Read this release in: English , Urdu , Hindi , Punjabi