భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

7 రాష్ట్రాల్లో 13 శాసనసభ స్థానాలకు ఉప-ఎన్నిక నిర్వహణ ప్రకటన

Posted On: 10 JUN 2024 1:42PM by PIB Hyderabad

  దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కింద పేర్కొన్న శాసనసభ స్థానాల భర్తీ కోసం ఉప-ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.

వ.సం.

రాష్ట్రం

శాసనసభ స్థానం నం., పేరు

ఖాళీగా ఉన్న కారణం

01

బీహార్

60-రూపౌలి

శ్రీమతి బీమా భారతి రాజీనామా

02

 

 

పశ్చిమ బెంగాల్

35-రాణిగంజ్

శ్రీ కృష్ణ కల్యాణి రాజీనామా

03

90-రానాఘాట్ దక్షిణ (ఎస్సీ)

డాక్టర్ ముకుట్ మణి అధికారి రాజీనామా

04

94-బాగ్దా

శ్రీ బిశ్వజిత్ దాస్ రాజీనామా

05

167-మాణిక్తలా

శ్రీ సాధన్ పాండే మరణం

06

తమిళనాడు

75-విక్రవాండి

శ్రీ ఎన్.పుగళేంది మరణం

07

మధ్యప్రదేశ్

123-అమర్వారా (ఎస్టీ)

శ్రీ కమేలేష్ ప్రతాప్ సింగ్ రాజీనామా

08

 

ఉత్తరాఖండ్

04-బద్రీనాథ్

శ్రీ రాజేంద్ర సింగ్ భండారీ రాజీనామా

09

33-మంగ్లౌర్

శ్రీ సర్వత్ కరీమ్ అన్సారీ మరణం

10

పంజాబ్

34-జలంధర్ పశ్చిమ (ఎస్సీ)

శ్రీ శీతల్ అంగురల్ రాజీనామా

11

హిమాచల్ ప్రదేశ్

 

10-డేహ్రా

శ్రీ హోష్యార్ సింగ్ రాజీనామా

12

38-హమీర్ పూర్

శ్రీ ఆశిష్ శర్మ రాజీనామా

13

51-నలగఢ్

శ్రీ కె.ఎల్.ఠాకూర్ రాజీనామా

ఈ ఉప-ఎన్నిక నిర్వహణ కార్యక్రమ పట్టిక అనుబంధం-Iలో జతపరచబడింది.

  1. ఓటరు జాబితాలు

స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, విశ్వసనీయ ఎన్నికలకు తప్పులకు తావులేని, నవీకృత ఓటరు జాబితాలే ప్రాథమిక పునాది అన్నది ఎన్నికల సంఘం  దృఢ విశ్వాసం. ఆ మేరకు జాబితాల నాణ్యత, స్వచ్ఛత, విశ్వసనీయత మెరుగు దిశగా నిరంతరం నిశితంగా దృష్టి సారిస్తూంటుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల చట్టాల (సవరణ) చట్టం-2021 ప్రకారం ప్రజాప్రాతినిధ్య చట్టం-1950లోని సెక్షన్ 14కు సవరణ అనంతరం ఒక సంవత్సరం వ్యవధిలో పౌరులు ఓటరుగా నమోదు కావడానికి నాలుగు అర్హత తేదీల నిబంధన చేర్చబడింది. దీనికి అనుగుణంగా 2024 జనవరి 1వ తేదీని ఎన్నికల సంఘం ఒక అర్హత తేదీగా నిర్దేశించి, జాబితాల ప్రత్యేక సారాంశ సవరణ ప్రక్రియను నిర్వహించింది. ఇందులో భాగంగా నిర్దేశిత తేదీనాటికి జాబితాలో అర్హులైన ఓటర్ల నమోదుకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ మేరకు 2024 జనవరి 1వ అర్హత తేదీ ప్రకారం నిర్దిష్ట కాలపరిమితితో ఓటర్ల జాబితాల ప్రత్యేక సారాంశ సవరణను పూర్తిచేసి ఆయా రాష్ట్రాల తుది జాబితాను కింది తేదీలలో ప్రచురించింది.

  1. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర 2024 జనవరి 5;
  2. బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు 2024 జనవరి 22;
  3. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర 2024 జనవరి 23;
  4. తెలంగాణ, రాజస్థాన్ 2024 ఫిబ్రవరి 8;

అయినప్పటికీ, సామీప్య అర్హత తేదీకి సంబంధించి నామినేషన్లు దాఖలు చివరి గడువు తేదీవరకు ఓటరు జాబితాల నవీకరణ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుంది.

  1. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఇవిఎం).. ‘వీవీప్యాట్’లు

ఈ ఉప-ఎన్నిక నిర్వహణలో భాగంగా అన్ని పోలింగ్‌ కేంద్రాల్లోనూ ఈవీఎంలు, వీవీప్యాట్‌లను వినియోగించాలని కమిషన్‌ నిర్ణయించింది. ఈ మేరకు తగిన సంఖ్యలో యంత్రాలను అందుబాటులో ఉంచామని, ఈ యంత్రాలతో పోలింగ్ సజావుగా సాగేవిధంగా అన్ని చర్యలూ తీసుకున్నామని ప్రకటించింది.

  1. ఓటర్ల గుర్తింపు పత్రాలు

ఎన్నికల సంఘం జారీచేసిన గుర్తింపు కార్డు (ఇపిఐసి) ఓటర్లందరికీ ప్రధాన గుర్తింపు పత్రంగా ఉంటుంది. అయితే, కింద పేర్కొన్న వాటిలో దేన్నైనా పోలింగ్ కేంద్రంలో చూపించవచ్చు:

  1. ఆధార్ కార్డు.
  2. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లబ్ధిదారు గుర్తింపు కార్డు.
  3. బ్యాంకు/తపాలా కార్యాలయాలు ఫొటోతో జారీచేసిన పాస్ బుక్.
  4. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ పథకం కింద జారీచేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డ్.
  5. డ్రైవింగ్ లైసెన్స్.
  6. పాన్ కార్డ్.
  7. ఎన్‌పిఆర్ కింద ఆర్‌జిఐ జారీచేసిన స్మార్ట్ కార్డ్,
  8. భారతీయ పాస్‌పోర్ట్,
  9. ఫోటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్,
  10. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు/పీఎస్‌యూలు/పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు ఉద్యోగులకు జారీ చేసిన ఫోటోస‌హిత గుర్తింపు కార్డు,
  11. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు జారీచేయబడిన అధికారిక గుర్తింపు కార్డులు,
  12. కేంద్ర సామాజిక న్యాయ-సాధికారత మంత్రిత్వ‌శాఖ జారీచేసిన‌ ప్రత్యేక వైకల్య గుర్తింపు (యుడిఐడి) కార్డ్
  1. ఎన్నికల ప్రవర్తన నియమావళి

ఎన్నికల సంఘం 2024 జనవరి 02న (కమిషన్ వెబ్‌సైట్‌లో చూడవచ్చు) జారీచేసిన ఉత్తర్వు నం.437/6/1NST/ECI/FUNCT/MCC/2024/(బై ఎలక్షన్స్)లోని నిర్దేశాలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించే శాసనసభ నియోజకవర్గం మొత్తం లేదా అందులో ఏదైనా భాగాన్ని చేర్చిన జిల్లా(ల్లో) ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణం అమల్లోకి వస్తుంది.

  1. పూర్వ నేర చరిత్ర సమాచారం

నేరచరిత్రగల అభ్యర్థులు ప్రచార వ్యవధిలోగా మూడు సందర్భాల్లో వార్తాపత్రికలు, టీవీ చానళ్ల ద్వారా సంబంధిత సమాచారాన్ని వెల్లడించాలి.  అటువంటి అభ్యర్థులను ఎంపిక చేసిన రాజకీయ పార్టీలు కూడా వారి నేరనేపథ్య వివరాలను తమ వెబ్‌సైట్‌తోపాటు వార్తాపత్రికలు, టీవీ చానళ్లలో మూడు సందర్భాల్లో వెల్లడించడం తప్పనిసరి.

   ఎన్నికల సంఘం 2020 సెప్టెంబర్ 16న జారీ చేసిన ఉత్తర్వు నం.3/4/2019/SDR/Vol. IV నిర్దేశించిన మేరకు సదరు వ్యవధిని కింది పద్ధతి ప్రకారం మూడు అంచెలలో నిర్ణయించాల్సి ఉంటుంది. తద్వారా సదరు అభ్యర్థుల నేపథ్యం గురించి తెలుసుకోవడానికి ఓటర్లకు తగినంత సమయం లభిస్తుంది:

ఎ. ఉపసంహరణకు ముందు తొలి నాలుగు రోజుల్లోగా;

బి. తదుపరి 5-8 రోజుల మధ్య;

సి. అటుపైన 9వ రోజు నుంచి (పోలింగుకు 2 రోజుల ముందు) ప్రచారం ముగింపులోగా

(ఉదాహరణ: ఉపసంహరణకు చివరి రోజును ఆ నెల 10వ తేదీగా, పోలింగ్ రోజును 24వ తేదీగా పరిగణిస్తే- డిక్లరేషన్ ప్రచురణ కోసం ఆ నెల 11-14 తేదీలు తొలి అంచె గడువుగా ఉంటాయి. అదే నెలలో 15-18 రోజుల మధ్య రెండో అంచె, 19-22వ రోజుల మధ్య మూడో అంచెగా పరిగణించాలి.)

గౌరవనీయ సుప్రీం కోర్టు  2015 నాటి రిట్ పిటిషన్ (సి) నం.784 (లోక్ ప్రహరీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్), 2011నాటి రిట్ పిటిషన్ (సివిల్) నం.536 (పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫౌండేషన్ అండ్ అదర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ ఎఎన్ఆర్)లపై విచారణ అనంతరం వెలువరించిన తీర్పు అమలులో భాగంగా ఈ నిబంధనను తప్పక పాటించాలి.

   దీనికి సంబంధించిన సమాచారం ‘మీ అభ్యర్థులను తెలుసుకోండి’ (know your candidates) శీర్షికన అనువర్తనంలో కూడా లభ్యమవుతుంది.

  1. ఉప-ఎన్నిక నిర్వహణలో కోవిడ్ సంబంధిత ఏర్పాట్లు

సార్వత్రిక, ఉప-ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం ‘కోవిడ్’ మార్గదర్శకాలను (కమిషన్ వెబ్‌సైట్‌లో లభ్యం) జారీ చేసింది.

అనుబంధం-I

ఉప-ఎన్నిక ప్రక్రియ కార్యక్రమ జాబితా

ఎన్నికల ప్రక్రియ

కార్యక్రమ జాబితా

గజిట్ నోటిఫికేషన్ జారీ

14.06.2024 (శుక్రవారం)

నామినేషన్లకు తుది గడువు

21.06.2024 (శుక్రవారం)

నామినేషన్ల పరిశీలన తేదీ

24.06.2024 (సోమవారం)

అభ్యర్థుల ఉపసంహరణకు తుది గడువు

26.06.2024 (బుధవారం)

పోలింగ్ తేదీ

10.07.2024 (బుధవారం)

ఓట్ల లెక్కింపు తేదీ

13.07.2024 (శనివారం)

ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాల్సిన తేదీ

15.07.2024 (సోమవారం)

***


(Release ID: 2023860) Visitor Counter : 104