రాష్ట్రప‌తి స‌చివాల‌యం

భారతదేశ ప్రధాన మంత్రి యొక్క పదవీ స్వీకార ప్రమాణం కార్యక్రమానికి హాజరు అయిన ఇరుగు పొరుగు దేశాల నేతల గౌరవార్థం విందు ను ఇచ్చిన భారత రాష్ట్రపతి

Posted On: 09 JUN 2024 11:59PM by PIB Hyderabad

భారతదేశం యొక్క ప్రధాన మంత్రి పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం లో ఈ రోజు న (2024 జూన్ 9 వ తేదీ న) పాల్గొన్న ఇరుగు పొరుగు దేశాల నేతల గౌరవార్థం భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ లో ఓ విందు ను ఏర్పాటు చేసి, ఆ విందు కార్యక్రమం లో ఆతిథేయి గా ఉన్నారు.

 

విందు కార్యక్రమాని కి హాజరు అయిన నేతల లో శ్రీ లంక యొక్క అధ్యక్షుడు శ్రీ రణిల్ విక్రమ సింఘె, మాల్దీవులు యొక్క అధ్యక్షుడు శ్రీ మొహమ్మద్ ముయిజ్జు, సెశెల్స్ యొక్క ఉపాధ్యక్షుడు శ్రీ అహమద్ అఫిఫ్, బాంగ్లాదేశ్ యొక్క ప్రధాని శేఖ్ హసీనా గారు; మారీశస్ యొక్క ప్రధాని ప్రవింద్ కుమార్ జగన్నాథ్ మరియు శ్రీమతి కవిత జగన్నాథ్ లు; నేపాల్ యొక్క ప్రధాని శ్రీ పుష్ప కమల్ దహల్ ప్రచండ మరియు భూటాన్ యొక్క ప్రధాని శ్రీ శెరింగ్ తోబ్‌ గే లు ఉన్నారు.

 

రాష్ట్రపతి నేతల కు స్వాగత వచనాలను పలికారు. క్రొత్త ప్రభుత్వం యొక్క పదవీస్వీకార ప్రమాణం కార్యక్రమానికి తరలిరావలసిందన్న ఆహ్వానాన్ని మన్నించడం తో పాటు గా ప్రజాస్వామ్యం యొక్క ఈ సంబురం లో కలసి పాలుపంచుకొన్నందుకు నేతల కు ధన్యవాదాల ను రాష్ట్రపతి తెలియజేశారు.

 

ఈ సందర్భం లో నేత లు విచ్చేయడం భారతదేశం అనుసరిస్తున్న నేబర్ హుడ్ ఫస్ట్విధానానికి మరియు హిందూ మహాసముద్రం ప్రాంతం లో భారతదేశం అవలంబిస్తున్నటువంటి ఎస్ఎజిఎఆర్ (SAGAR) దృష్టికోణాని కి ఉన్న ప్రాముఖ్యానికి నిదర్శన గా ఉంది అని రాష్ట్రపతి అన్నారు. ఈ ప్రాంతం లోని ప్రతి దేశం యొక్క ప్రగతి లో మరియు శ్రేయస్సు లో స్టేక్ హోల్డర్స్ గా ఉన్న మేము, మన ప్రాంతం లోను మరియు మన ప్రాంతాని కి వెలుపల కూడా ను శాంతి ని, సమృద్ధి ని పెంపొందింప చేయడం కోసమని మా సన్నిహిత మిత్రులు, మా ఇరుగు పొరుగు దేశాలు మాతో కలసి నడవాలని కోరుకుంటున్నామని రాష్ట్రపతి అన్నారు.

 

విజయాన్ని సాధించినందుకు మరియు ప్రజల కు సేవ చేసేటటువంటి ఉన్నత బాధ్యత ను ఆయన స్వీకరించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి రాష్ట్రపతి శుభాకాంక్షల ను వ్యక్తంచేశారు.

 

 

 

***



(Release ID: 2023780) Visitor Counter : 67