రక్షణ మంత్రిత్వ శాఖ
భారతదేశం అంతటా నాలుగు బ్యాంకుల కు చెందిన 1,128 బ్రాంచీల లో పింఛన్ దారుల కోసం స్పర్శ్ సేవాకేంద్రాల ను ఏరర్పాటు చేయడం కోసం ఎమ్ఒయు లను కుదుర్చుకొన్న రక్షణ మంత్రిత్వ శాఖ
Posted On:
05 JUN 2024 4:40PM by PIB Hyderabad
దేశవ్యాప్తం గా బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల కు చెందిన 1,128 బ్రాంచీల లో రక్షణ శాఖ పింఛన్ దారుల కోసం ఎస్‌పిఎఆర్ఎస్‌హెచ్ [సిస్టమ్ ఫార్ పెన్శన్ అడ్మినిస్ట్రేశన్ (రక్ష).. లేదా ‘స్పర్శ్’] సేవా కేంద్రాల ను ఏర్పాటు చేయడం కోసం తో రక్షణ మంత్రిత్వ శాఖ లోని డిఫెన్స్ అకౌంట్స్ డిపార్ట్ మెంటు (డిఎడి) న్యూ ఢిల్లీ లో అవగాహన పూర్వక ఒప్పంద పత్రాల (ఎమ్ఒయు) పై సంతకాలు చేసింది. ఈ ఎమ్ఒయు లు పింఛనుదారుల కు, ప్రత్యేకించి స్పర్శ్ తో సంధానాన్ని దొరకబుచ్చుకొనే సాంకేతిక అవగాహన లేని అటువంటి మారుమూల ప్రాంతాల కు చెందిన వారికి కనెక్టివిటీ కి పూచీ పడుతుంది.
ఈ సేవా కేంద్రాలు పింఛనుదారుల కు ఫిర్యాదుల ను నమోదు చేయడం, డిజిటల్ ఆధారిత డేటా ప్రమాణీకరణ కు ఉపయోగపడుతాయి. ఈ సేవా కేంద్రాల ద్వారా సంవత్సరాని కి ఒకమారు డిజిటల్ గుర్తింపు ను పొందడం, సమాచారాన్ని సరిచూసుకోవడం లతో పాటు నెల వారీ పింఛను కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తెలుసుకోవడం వీలుపడుతుంది. ఎటువంటి రుసుము ను చెల్లించకుండా వీటి సేవల ను వినియోగించుకోవచ్చును; కేంద్రాలకు నామమాత్రపు సేవా రుసుముల ను డిఎడి తాను చెల్లిస్తుంది.
ఈ ఎంఒయు లు కుదరడం తో స్పర్శ్ సేవలు ఇక దేశం అంతటా 15 బ్యాంకుల కు చెందిన 26,000 కు పైగా శాఖలలో అందుబాటు లోకి వస్తున్నాయి. ఈ క్రొత్త సేవా కేంద్రాలు దేశం లోని 3.75 లక్షలకు పైచిలుకు కామన్ సర్వీస్ సెంటర్ లకు మరియు డిఎడి కి చెందిన 199 ప్రత్యేక సేవా కేంద్రాల కు అదనం అన్నమాట.
స్పర్శ్ అనేది రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క కార్యక్రమాల లో ఒకటి. దీని ఉద్దేశ్యం రక్షణ శాఖ లో పని చేసి పింఛను కు అర్హులు అయిన వారికి ఒక సమగ్రమైన పరిష్కారాన్ని అందించాలి అనేదే. ఇది దక్షత కలిగినటువంటి, బాధ్యతాయుక్తమైనటువంటి మరియు పారదర్శకత్వంతో కూడినటువంటి పద్ధతి లో రక్షణ శాఖ పింఛన్ ల నిర్వహణ లో తీసుకు వచ్చిన ఒక మౌలికమైన మార్పు గా ఉన్నది.
***
(Release ID: 2023000)
Visitor Counter : 120