ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు ఆరోగ్య సంరక్షణసంస్థ లతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించిన సమావేశం లో రెగ్యులేటరీప్రోటోకాల్స్ మరియు అగ్ని బారి నుండి సురక్ష కు సంబంధించిన నియమాల ను కచ్చితం గాపాటించవలసిన అవసరాన్ని పునరుద్ఘాటించింది

Posted On: 03 JUN 2024 4:26PM by PIB Hyderabad

ఏదైనా ఆరోగ్య సంరక్షణ నిలయం లో రోగులు (బయటి నుండి వచ్చే రోగులు మరియు ఇన్ పేశంట్ లు), ఉద్యోగులు మరియు సందర్శకుల యొక్క సురక్ష, శ్రేయస్సు లు అత్యంత ప్రాముఖ్యాన్ని ఇవ్వవలసిన అంశాలు. ఇటీవల, కొన్ని స్థలాల లో అగ్ని ప్రమాదాలు సంభవించినట్లు గా వార్తలు వచ్చాయి. అవి విద్యుత్తు నిర్వహణ లో లోపాలు, ఎయర్-కండిశనర్ లు మరియు ఇతర విద్యుత్తు ఉపకరణాల ను అధికం గా వినియోగించినందువల్ల విద్యుత్తు లైనుల పై ఆ లైను ల సామర్థ్యాని కంటే ఎక్కువ భారం పడిన కారణం గా శార్ట్ సర్క్యూట్ తలెత్తిన ఫలితం గా చోటు చేసుకొన్నాయి.

 

 

ఆసుపత్రుల లో మంటలు చెలరేగే అపాయాల తో ముడిపడ్డ సంభావ్య ప్రమాదాల ను గమనిస్తూ ఉంటే మంటలు చెలరేగడాన్ని అడ్డుకొనే, అటువంట ఘటనల ప్రమాదాన్ని గుర్తించే మరియు ఆ కోవకు చెందిన స్థితుల ను పద్ధతి గా ఎదుర్కోవడం కోసం కఠినమైన ప్రోటోకాల్స్ ను మరియు ఉపాయాల ను అమలుపరచవలసి ఉంది. ఒక పటిషఫ్టమైన అగ్ని సురక్ష పథకాన్ని నెలకొల్పడం, అగ్ని నుండి బయటపడే మరియు సురక్ష సంబంధి అభ్యాసాల ను నిర్వహించడం వల్ల రెగ్యులేటరీ ఆవశ్యకత ల అనుపాలన ఒక్కటే కాకుండా సంపత్తినష్టం- ప్రాణనష్టాల బారి నుండి బయటపడవచ్చును.

 

 

ఈ కారణం గా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనేక పర్యాయాలు అన్ని రాష్ట్రాల కు/కేంద్ర పాలిత ప్రాంతాల కు వేసవి మాసాల లో వేడిమి పెరిగిపోతుందని, ఆసుపత్రుల లో మంట లు చెలరేగే ఘటనల అపాయం ఎదురవవచ్చని సూచిస్తూ వచ్చింది. అందుకని రాష్ట్రాల లో/కేంద్ర పాలిత ప్రాంతాల లో ఆ తరహా అపాయకర స్థితులు తలెత్తవచ్చన్న ప్రదేశాల ను గుర్తించడం కోసం తగిన ప్రమాద నివారణ చర్యల ను తీసుకోవాలని సలహా ఇవ్వడమైంది.

 

 

ఈ విషయం లో అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల తో తాజాగా ఒక సమీక్ష సమావేశాన్ని 2024 మే 29 వ తేదీ న నిర్వహించడమైంది. ఈ సమావేశాని కి అడిశనల్ సెక్రట్రి (ప్రజా ఆరోగ్యం మరియు విధానం) తో పాటు డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్థ్ సర్వీసెస్ లు సహ అధ్యక్షత వహించారు. దిల్లీ లోని ఒక ప్రైవేటు ఆరోగ్య కేంద్రం లో ఇటీవల శోచనీయమైనటువంటి అగ్ని ప్రమాదం చోటుచేసుకొన్న సంగతి ని ఈ సందర్భం లో ప్రముఖం గా ప్రస్తావించడమైంది.

 

 

ఆ సమావేశం లో రాష్ట్రాల ఆరోగ్య విభాగాల నుండి 15 మంది ప్రతినిధులు, ఆరోగ్య సంరక్షణ సంస్థల కు చెందిన సుమారు 390 మంది పాలు పంచుకొన్నారు. చర్చోప చర్చల తాలూకు ఫలితాలు ఈ క్రింది విధం గా ఉన్నాయి:

 

1. అగ్ని బారి నుండి సురక్ష పొందేందుకు ఆయా ఆరోగ్య కేంద్రాల లో సంబంధిత సురక్ష నిబంధనల ను కచ్చితం గా పాటించవలసిన అవసరం తో పాటు నిర్దిష్ట కాలాల్లో కఠినమైన అంచనా ను కూడా చేపట్టాలని స్పష్టం చేయడమైంది.

 

 

2. రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు మరియు సంస్థల కు పిడబ్ల్యుడి మరియు స్థానిక అగ్నిమాపక విభాగాల తో మెరుగైన సమన్వయాన్ని నెలకొల్పుకోవాలి; అలా చేయడం ద్వారా ఫైర్ సెఫ్టీ ఎన్ఒసి ని సకాలం లో అందుకొంటూ ఉండవచ్చును.

 

 

3. అగ్ని ప్రమాదాల బారి నుండి తప్పించుకోవడం మరియు అగ్ని సంబంధి సురక్ష చర్యల నిర్వహణ ల తాలూకు వివరాల తో ఒక పత్రాన్ని రాష్ట్రాల తో/కేంద్ర పాలిత ప్రాంతాల తో పంచుకోవడమైంది. ఆ పత్రాన్ని అన్ని ఆరోగ్య కేంద్రాలు వివరాల తో నింపి తిరిగి వెనుక కు ఇవ్వాలి అని కోరడమైంది.

 

 

4. అన్ని రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు అగ్ని సంబంధి సురక్ష విషయం లో నియంత్రణ పూర్వక ప్రోటోకాల్స్ ను కచ్చితం గా పాటించాలి, మరి అలాగే అగ్ని సంబంధి సురక్ష తాలూకు మాక్ డ్రిల్స్ ను క్రమం తప్పక చేపట్టాలి.

 

 

 

**

 


(Release ID: 2022989) Visitor Counter : 79