కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 220 మందికి పైగా సంచార మిత్రలతో వర్క్ షాప్ నిర్వహించిన డాట్, ఎన్టిపిఆర్ఐటి


డిపార్ట్మెంట్ కి చెందిన వివిధ పౌర కేంద్రీకృత సేవలపై చైతన్యం పెంచడానికి,
విద్యార్థులు సేవలు అందించే వేదిక సంచార మిత్ర

మార్పునకు, ప్రభుత్వ కార్యక్రమాలు-ప్రజలు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి
ఏజెంట్లు... సంచార మిత్రలు - డీసీసీ సభ్యులు (టి)

Posted On: 28 MAY 2024 4:15PM by PIB Hyderabad

టెలికమ్యూనికేషన్స్ విభాగం (డాట్), నేషనల్ టెలికమ్యూనికేషన్స్ ఇన్‌స్టిట్యూట్, ఘజియాబాద్ (ఎన్టిఐపిఆర్ఐటి) సహకారంతో ఈరోజు మే 28, 2024న సంచార మిత్రల కోసం ఒక అవగాహన వర్క్‌షాప్‌ని నిర్వహించింది. సంచార మిత్ర కార్యక్రమం కింద, పౌరులకు మరింత సురక్షణ కలిపించడానికి స్వచ్ఛంద సేవకులుగా విద్యార్థులు భాగస్వామ్యం అయ్యారు. డిపార్ట్‌మెంట్ వివిధ పౌర కేంద్రీకృత సేవలు, సైబర్ మోసం ప్రమాదాల గురించి అవగాహన పెంచడం ద్వారా డిజిటల్ ప్రపంచంలో అతి సున్నిత అంశాల పట్ల కూడా అవగాహన కలిపిస్తుంది ఈ వ్యవస్థ. 

 

A person sitting in a chairDescription automatically generated

                         వర్క్‌షాప్ సందర్భంగా సంచార్ మిత్రలను ఉద్దేశించి ప్రసంగించిన  డిజిటల్ కమ్యూనికేషన్ కమిషన్  మెంబర్ (టి)  శ్రీమతి మధు అరోరా
 

100 5జి యూజ్ కేస్ ల్యాబ్‌లను కలిగి ఉన్న ప్రతిష్టాత్మక విద్యా సంస్థల విద్యార్థుల నుండి సంచార మిత్ర ఎంపిక జరిగింది. 250 మందికి పైగా సంచార్ మిత్రలు, విద్యార్థి వాలంటీర్లు భారతదేశం అంతటా ఎంపిక అయ్యారు.

                          A screenshot of a video callDescription automatically generated

20కి పైగా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుండి వర్క్ షాప్ లో పాల్గొన్న 220కి పైగా సంచార మిత్రలు 

 

డిజిటల్ కమ్యూనికేషన్ కమిషన్ మెంబర్ (టి) శ్రీమతి మధు అరోరా, వర్క్‌షాప్ ప్రారంభోత్సవం సందర్భంగా సంచార్ మిత్రలతో సంభాషించారు. ఆమె మాట్లాడుతూ, “నేటి డిజిటల్ ప్రపంచంలో టెలికమ్యూనికేషన్స్ కీలక పాత్ర పోషిస్తోంది. నేటి డిజిటల్ ట్రెండ్స్ మరియు డెవలప్‌మెంట్‌ల గురించి పౌరులు తెలుసుకోవడం చాలా అవసరం, అందువల్ల, పౌరులకు అవగాహన పెంచడానికి, సాధికారత కల్పించడానికి మేము చేస్తున్న ప్రయత్నాలకు సంచార్ మిత్ర ఒక మెట్టు." అని అన్నారు. 

వారిని మన సమాజంలో 'మార్పునాకు ఏజెంట్లు'గా ఆమె అభివర్ణించారు, డిపార్ట్‌మెంట్ కార్యక్రమాలు, పౌరుల మధ్య అంతరాన్ని తగ్గించడంలో సహాయపడతారు, ముఖ్యంగా సమాచారానికి ప్రాప్యత పరిమితంగా ఉన్న మారుమూల ప్రాంతాలలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మెంబర్ (టి) ఫీడ్‌బ్యాక్ మెకానిజమ్‌గా సంచార్ మిత్రపై దృష్టి సారించి టూ-వే కమ్యూనికేషన్ ప్రాముఖ్యతపై మాట్లాడారు, డిపార్ట్‌మెంట్ మెరుగైన వ్యూహాలను రూపొందించడంలో సహాయం చేయడానికి పౌరులు డాట్  ఎదుర్కొంటున్న సవాళ్లకు సంబంధించిన విలువైన అంతర్దృష్టులను వివరించారు. టెలికాం, సంబంధిత రంగాలలో భవిష్యత్ అవకాశాలను మరిన్ని తెరవడానికి ఈ ప్రత్యేకమైన ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించుకోవాలని ఆమె వారిని కోరారు.

ప్రకృతి వైపరీత్యాల సమయంలో పౌరుల భద్రతకు భరోసా ఇవ్వడంలో,  సంచార్ సాథి వంటి వినూత్న పరిష్కారాల ద్వారా డాట్ చేస్తున్న కృషిని ఆమె ప్రశంసించారు. 

ఎన్టిఐపిఆర్ఐటి డైరెక్టర్ జనరల్ శ్రీ దేబ్ కుమార్ చక్రవర్తి, పౌరులు, డాట్ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్‌ను తగ్గించడంలో సంచార్ మిత్ర పాత్రపై మాట్లాడారు.  అందరికీ అందుబాటు స్థాయిలో కనెక్టివిటీని అందించడం, ఫిర్యాదుల పరిష్కారం, సైబర్ బెదిరింపులను పరిష్కరించడం, సురక్షితమైన పౌర కేంద్రీకృత పరిష్కారాలను, డాట్  ప్రాథమిక విధులుగా పేర్కొన్నారు. సంచార్ మిత్ర కార్యక్రమం విస్తరణపై ఆయన విలువైన సూచనలు ఇచ్చారు.

 

సంచార మిత్ర వర్క్ షాప్ ను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ఎన్టిఐపిఆర్ఐటి డైరెక్టర్ జనరల్ శ్రీ దేబ్ కుమార్ చక్రవర్తి(కుడి) 

 ఈ కార్యక్రమంలో సంచార్ మిత్రల పాత్రలు బహుళంగా ఉంటాయి: సంచార్ సాథి వంటి వివిధ టెలికాం సంబంధిత పౌర కేంద్రీకృత సేవలపై అవగాహన పెంచడం, డిజిటల్ అక్షరాస్యతను ప్రోత్సహించడం, సైబర్ మోసాల ప్రమాదాలపై అవగాహన కల్పించడంలో వారు కీలక పాత్ర పోషిస్తారు; సమస్యలను నివేదించడం, అభిప్రాయాన్ని సేకరించడం, క్షేత్ర కార్యాలయాలతో సమన్వయం చేయడం వారు నిర్వహించే కార్యక్రమాలలో ముఖ్యమైనవి. 

సంచార్ మిత్ర కోసం ఎన్టిఐపిఆర్ఐటి నిర్వహించిన వర్క్‌షాప్ వాలంటీర్ల సామర్థ్యాన్ని/అవగాహన, ప్రభావాన్ని పెంపొందించే ఒక ఇండక్షన్ ప్రోగ్రామ్‌గా పనిచేసింది. టెలికాం సమస్యలపై సమగ్ర అవగాహన లక్ష్యంగా, ఇంటరాక్టివ్ వర్క్‌షాప్ కమ్యూనికేషన్ స్కిల్స్‌పై దృష్టి సారించింది. కీలకమైన పౌర-కేంద్రీకృత సేవల పట్ల అవలోకనం అందించింది.


సంచార మిత్ర కార్యక్రమం నేపథ్యం :

వంద 5జి వినియోగ కేస్ ల్యాబ్‌లు పొందిన విశ్వవిద్యాలయాల నుండి గుర్తించబడిన విద్యార్థులను సంచార్ మిత్రలు అంటారు. ఇది 28 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలలోని విద్యా సంస్థలలో విస్తరించింది.

సంచార్ మిత్ర కార్యక్రమం మొబైల్ వినియోగదారుల భద్రతను మెరుగుపరచడం; రేడియేషన్ పై జరిగే ప్రచారంపై స్పష్టత; డాట్ కార్యక్రమాల గురించి అవగాహన పెంచడం, మొబైల్ సంబంధిత మోసాన్ని నిరోధించడంపై దృష్టి సారిస్తుంది. ఈ వ్యవస్థ పౌరుల మద్దతు విభాగం ప్రయత్నాల సామర్థ్యాన్ని పెంచుతుంది కాబట్టి, మొబైల్ వినియోగదారుల భద్రతను మెరుగుపరచడానికి, డాట్ చొరవ గురించి అవగాహన పెంచడానికి, సురక్షితమైన డిజిటల్ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడానికి డిపార్ట్‌మెంట్ ప్రయత్నాలకు వివిధ రాష్ట్రాల నుండి సంచార్ మిత్రల విలువైన పాత్ర  అదనంగా ఉంటుంది.

సంచార మిత్ర పాత్రలు :

  1. సంచార్ సాథీ పోర్టల్, ఈఎంఎఫ్ అవగాహన కోసం తరంగ్ సంచార్ పోర్టల్, స్థానిక నంబర్‌లతో అంతర్జాతీయ నంబర్‌లను నివేదించడానికి టోల్ ఫ్రీ నంబర్లు, స్పామ్, అనుమానిత మోసపూరిత కమ్యూనికేషన్ మొదలైన విస్తృత పౌర కేంద్రీకృత సేవలపై అవగాహన కల్పించాలి.
  2. పౌరులతో మరింత సాపేక్షమైన, సమర్థవంతమైన సంబంధాన్ని ఏర్పరుచుకోవడం ద్వారా వారి స్థానిక భాషలలో అట్టడుగు స్థాయిలో విస్తృత ప్రచారం, అవగాహన, తద్వారా చొరవ ప్రభావం పెరుగుతుంది. వారు కళాశాలలు, ఎన్జిఓలు, గ్రామ స్థాయి పారిశ్రామికవేత్తలు మొదలైన వాటితో సమన్వయం చేసుకుంటారు. 
  3.  రిపోర్టింగ్, సమస్యను పై స్థాయికి వివరించడంలో - వాలంటీర్లు పౌరులకు, టెలికమ్యూనికేషన్స్ విభాగానికి మధ్య అనుసంధానంగా వ్యవహరిస్తారు. నకిలీ మొబైల్ కనెక్షన్లు, పోగొట్టుకున్న పరికరాలు, ఇతర సంబంధిత సమస్యలను నివేదించడంలో వారు పౌరులకు సహాయం చేస్తారు. స్వచ్ఛంద సేవకులు పౌరులకు సంచార్ సాథీ పోర్టల్‌ను నావిగేట్ చేయడంలో సహాయపడగలరు. అవసరమైనప్పుడు సంబంధిత అధికారుల దృష్టికి కేసులను తీసుకెళ్తారు.
  4. ఫీల్డ్ ఆఫీసులు, రాష్ట్ర పోలీసులతో సమన్వయం: డిపార్ట్‌మెంట్ ఫీల్డ్ ఆఫీసులు, స్థానిక చట్ట అమలు సంస్థలతో సమన్వయం చేయడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తారు. వారు సమాచారాన్ని ధృవీకరించడంలో, అవసరమైన డాక్యుమెంటేషన్‌ను అందించడంలో, మోసం లేదా దుర్వినియోగ కేసులను సమర్థవంతంగా పరిష్కరించడానికి సున్నితమైన సహకారాన్ని అందించడంలో సహాయపడగలరు. 
  5. డేటా సేకరణ, అంతర్దృష్టులు: వాలంటీర్లు మొబైల్ భద్రతకు సంబంధించిన స్థానిక ట్రెండ్‌లు,  సవాళ్ల గురించి విలువైన అంతర్దృష్టులను సేకరించగలరు. వివిధ రాష్ట్రాలు, సంఘాలు ఎదుర్కొంటున్న నిర్దిష్ట సమస్యలను పరిష్కరించడానికి డిపార్ట్‌మెంట్ తన వ్యూహాలు మరియు విధానాలను రూపొందించడంలో ఈ డేటా సహాయపడుతుంది. 
  6. ఫీడ్‌బ్యాక్ మెకానిజం: వాలంటీర్లు ఫీడ్‌బ్యాక్ మెకానిజమ్‌గా పని చేయవచ్చు, పౌరుల ఆందోళనలు, సూచనలు,  అనుభవాలను తిరిగి విభాగానికి తెలియజేయవచ్చు. ఈ కొనసాగుతున్న ఫీడ్‌బ్యాక్ లూప్ సంచార్ సాథి చొరవను మెరుగుపరచడంలో, అభివృద్ధి చెందుతున్న అవసరాలకు అనుగుణంగా మార్చడంలో సహాయపడుతుంది. 

***



(Release ID: 2022033) Visitor Counter : 67