ఆయుష్

ప్రగతి-2024 ను నిర్వహించనున్న సెంట్రల్ కౌన్సిల్ ఫార్ రిసర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్(సిసిఆర్ఎఎస్)


ఆయుర్వేద పరిశోధన కు మరియు సంబంధి పరిశ్రమ కు ప్రోత్సాహాన్ని ఇవ్వడం కోసం ఒక సహకార ప్రధానమైన కార్యక్రమాన్ని చేపడుతున్న సిసిఆర్ఎఎస్

Posted On: 27 MAY 2024 10:21AM by PIB Hyderabad

‘‘ఫార్మా రిసర్చ్ ఇన్ ఆయుర్‌జ్ఞాన్ ఎండ్ టెక్నో ఇనొవేశన్ (పిఆర్ఎజిఎటిఐ-2024)’’ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం లోని స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అయినటువంటి సెంట్రల్ కౌన్సిల్ ఫార్ రిసర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సిసిఆర్ఎఎస్) న్యూ ఢిల్లీ లోని ఇండియా హేబిటేట్ సెంటర్ లో 2024 మే 28 వ తేదీ న నిర్వహించనుంది. ఈ చర్చ ప్రధానమైనటువంటి సమావేశం సిసిఆర్ఎఎస్ మరియు ఆయుర్వేద ప్రధానమైన ఔషధ పరిశ్రమ లకు మధ్య పరిశోధన అవకాశాల ను అన్వేషించడం తో పాటు సహకారాన్ని పెంపొందింపచేయడం పై శ్రద్ధ ను వహించనుంది.

ఈ కార్యక్రమాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రాజేశ్ కోటేచా ప్రారంభించనున్నారు. ఆయుర్వేద యొక్క అభివృద్ధి లో పరిశ్రమ యొక్క పాత్ర ను గురించి ఆయన కీలకోపన్యాసాన్ని ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమం లో ఆయుష్ మంత్రిత్వ శాఖ యొక్క సంయుక్త కార్యదర్శి కవిత గర్గ్ గారు మరియు ఆ మంత్రిత్వ శాఖ సలహాదారు డాక్టర్ శ్రీ కౌస్తుభ ఉపాధ్యాయ్ గారు లు కూడా పాలుపంచుకొంటారు.

సిసిఆర్ఎఎస్ యొక్క డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ శ్రీ వైద్య రబినారాయణ్ ఆచార్య, సిసిఆర్ఎఎస్ పక్షాన ఈ చర్చ ప్రధానమైన సమావేశానికి నాయకత్వాన్ని వహించనున్నారు. ఈ సమావేశం లో పరిశోధన ఆధారితమైన, నాణ్యత, సురక్షితమైన మరియు ప్రభావవంతమైనటువంటి ఆయుర్వేద ఉత్పాదన ల యొక్క ప్రాముఖ్యాన్ని గురించి వివరించడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. దీని ఉద్దేశ్యం ఆయుర్వేద సూత్రీకరణ (ఫార్ములేశన్) లు మరియు సాంకేతిక పరమైన నూతన ఆవిష్కారాల లో భాగం పంచుకొన్న పరిశోధకుల ను మరియు పారిశ్రమిక భాగస్తుల ను కలుపుకొని, ఔషధాలు మరియు పనిముట్టుల అభివృద్ధి లో ఆయుర్వేద రంగ స్టేక్ హోల్డర్స్ యొక్క శక్తియుక్తుల ను గరిష్ఠ స్థాయి కి పెంచడం అనేవి ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దశ్యాలు గా ఉన్నాయి.

 

ఈ సమావేశం యొక్క మౌలిక ధ్యేయాలు ఈ క్రింది విధాలు గా ఉన్నాయి:

 

1. సిసిఆర్ఎఎస్ తరఫు న అభివృద్ది పరచినటువంటి పరిశోధన ఫలితాల ను మరియు సాంకేతిక పరిజ్ఞాన ఫలితాలను ఉపయోగించుకోవడం.

 

2. నాణ్యత సంబంధి నియంత్రణ, ఔషధాల ప్రామాణీకరణ, ఉత్పాదన ల అభివృద్ధి మరియు చెల్లుబాటు ప్రక్రియల లో సహకార పూర్వకమైన పరిశోధన కోసం బలమైన నెట్ వర్క్ ను ఏర్పాటు చేయడం.

 

3. దేశీయ పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాలతో కూడినటువంటి పరిశ్రమ భాగస్వాముల ను గుర్తించడం.

 

4. ఔషధ నిర్మాణం లో మరియు ఉత్పాదన అభివృద్ధి లో పరిశోధకుల కోసం సామర్థ్య నిర్మాణం సంబంధి అవకాశాల ను అన్వేషించడం.

5. ఆయుర్వేదిక ఔషధి నిర్మాణ విజ్ఞానం (ఫార్మాస్యూటిక్స్) లో నవపారిశ్రమికత్వానికి దన్ను గా నిలవడం, స్టార్ట్-అప్స్ మరియు ఇన్ క్యూబేటింగ్ సెంటర్ లను తెరవడం లో ఆయుర్వేద వృత్తినిపుణుల కు సహాయాన్ని అందించడమూను.

 

 

ఈ కార్యక్రమం లో నాలుగు విశిష్ట సాంకేతిక సదస్సులు భాగం గా ఉంటాయి.

 

వాటిలో ఒకటోసదస్సు లో పరిశోధన- పరిశ్రమ ల సహభాగస్వామ్యాన్ని బలపరచడం కోసం సిసిఆర్ఎఎస్ యొక్క ఉత్పాదన అభివృద్ధి కార్యక్రమాన్ని మరియు వ్యూహాల ను స్పష్టంచేయడం జరుగుతుంది. దీనిలో అన్ని 35 ఉత్పాదనలు మరియు పనిముట్టుల ప్రదర్శన కలసి ఉంటుంది. దీనితో పాటు యావత్తు దేశం లో గల 5 సిసిఆర్ఎఎస్ ప్రయోగశాల లు మరియు 25 ఆసుపత్రుల సేవల ను గురించి కూడా చాటిచెప్పడం అనేది ఒక భాగం గా ఉంటుంది.

 

 

రెండో సదస్సు లో ప్రాంతీయ మరియు ప్రపంచ స్థాయి ఆయుర్వేద ఔషధ వికాసం లో లోటుపాటుల ను గుర్తించడం మరియు సవాళ్ళ ను పరిష్కరించడం కోసం ఒక బృంద చర్చ ను నిర్వహించడం జరుగుతుంది.

 

 

మూడో సదస్సు లో సహకార కార్యక్రమాల నిర్వహణకై ప్రాధాన్య రంగాల ను గుర్తించడం తో పాటే అనుభవాన్ని వెల్లడించుకోవడం మరియు సిసిఆర్ఎఎస్ నుండి పరిశ్రమ ఏమి ఆశిస్తున్నదీ తెలియ జేస్తారు.

 

 

నాలుగో సదస్సు లో సిసిఆర్ఎఎస్- పరిశ్రమ సహభాగస్వామ్యం కోసం మొట్టమొదటి సారి ‘‘పరిశోధన ప్రాథమ్యాల నిర్దేశం’’ అంశం పై ప్రత్యేకించినటువంటి సమూహ చర్చ ను నిర్వహించడం జరుగుతుంది.

 

 

ఈ కార్యక్రమం లో దేశవ్యాప్తం గా 35 ఔషధ నిర్మాణ వ్యాపార సంస్థల ప్రతినిధులు పాలుపంచుకనున్నారు. వారి లో హిమాలయ, ఇమామీ, బైద్యనాథ్, డాబర్, ఐఎమ్‌పిసిఎల్, ఆర్య వైద్య శాల, ఔషధి, ఇంకా ఐఎమ్‌పిసిఒపిఎస్ ల వంటి ప్రముఖ వ్యాపార సంస్థ ల సిఇఒ లు కొంత మంది పాల్గొంటారు. అదనం గా ఈ చర్చాత్మక సమావేశం లో పాల్గొనడం కోసం సిఐఐ, ఆయుష్ ఎక్సిల్, పిసిఐఎమ్‌హెచ్ మరియు ఎన్ఆర్‌డిసి ల నుండి ఆహ్వానించినటువంటి నిపుణులు వారి వారి పేరుల ను నమోదు చేసుకొన్నారు.

 

 

సిసిఆర్ఎఎస్ ద్వారా అభివృద్ధి పరచినటువంటి లేదా అభివృద్ధి ప్రక్రియ పురోగతి లో ఉన్నటువంటి మొత్తం 35 ఫార్ములేశన్ లు మరియు మూడు పనిముట్టుల ను గురించి వివరించేటటువంటి ఒక వివరణ పత్రాన్ని చర్చించడం మరియు సమీక్షించడం కోసం ఈ సమావేశం లో పాలుపంచుకొనేటటువంటి పరిశ్రమల ప్రతినిధుల ఎదుట సమర్పించడం జరుగుతుంది. వీటి లో ఆయుష్ 64, ఆయుష్ ఎస్‌జి, ఆయుష్ గుట్టీ, తదితరాలు భాగం గా ఉన్నాయి.

 

 

సిసిఆర్ఎఎస్ తో కలసి నడవనున్న శాస్త్ర విజ్ఞాన సంబంధి జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోనున్న, ఆయుర్వేద ఔషధాల అభివృద్ధి లో పరిశోధన ల ఫలితాలు మరియు ఉత్పాదనల ను ఉపయోగించుకోవాలన్న ఆసక్తి ని కలిగివున్న పారిశ్రామిక భాగస్తుల ను గుర్తించడం అనేవి ప్రగతి-2024’ ద్వారా అభిలషిస్తున్న పరిణామాల ను సూచిస్తున్నాయి. ఈ కార్యక్రమం నెట్ వర్కింగ్ ను మరియు సంస్థాగతమైన సంబంధాల ను సుదృఢపరచగలదు; తత్ఫలితం గా ఆయుర్వేదిక వైద్యశాలల కు మరియు ఆయుర్వేదిక రోగుల ప్రయోజనం చేకూరగలదు.

 

***

 

 



(Release ID: 2021816) Visitor Counter : 92