రక్షణ మంత్రిత్వ శాఖ
ఐఎఎఫ్ కు చెందిన మొట్టమొదటి అత్యవసర వైద్యప్రతిస్పందన వ్యవస్థ ను బెంగళూరు లోని సిహెచ్ఎఎఫ్ లో ప్రారంభించిన వాయు సేన ప్రధానఅధికారి
Posted On:
22 MAY 2024 2:16PM by PIB Hyderabad
దేశం లో భారతీయ వాయు సేన (ఐఎఎఫ్) లో పని చేస్తున్న ఉద్యోగుల కు మరియు వారి కుటుంబాల కు వైద్య సంబంధి అత్యవసర పరిస్థితుల లో నిపుణుల ద్వారా మార్గదర్శకత్వం మరియు నిక్కచితనం తో కూడిన సంరక్షణ ను అందించడం కోసం ఉద్దేశించినటువంటి ఇమర్ జన్సి మెడికల్ రిస్ పాన్స్ సిస్టమ్ (ఇఎమ్ఆర్ఎస్) ను కమాండ్ హాస్పిటల్ ఎయర్ ఫోర్స్ బెంగళూరు (సిహెచ్ఎఎఫ్‌బి) లో 2024 మే 21 వ తేదీ నాడు భారతీయ వాయు సేన యొక్క ప్రధాన అధికారి (చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ - సిఎఎస్) ఎయర్ చీఫ్ మార్శల్ శ్రీ వి. ఆర్ చౌధరి ప్రారంభించారు.
ఇఎమ్ఆర్ఎస్ అనేది తనదైన కోవ కు చెందినటువంటి మొట్టమొదటి టెలిఫోన్ మాధ్యమం ప్రధానమైన వైద్య పరమైన హెల్ప్ లైన్. ఇది వారం లో ప్రతి రోజు 24 గంటల పాటు సేవ ను అందిస్తుంది. దేశం లో ఎక్కడ నుండి అయినా సరే అత్యవసర స్థితి లో ఫోన్ ద్వారా సాయం కోరే వ్యక్తి కి సకాలం లో మెడికల్, ఇంకా పారామెడికల్ వృత్తినిపుణుల తో కూడిన ఒక బృందం ద్వారా సమాధానాన్ని ఇవ్వాలి అనేదే ఈ వ్యవస్థ యొక్క లక్ష్యం. సదరు సమాధానాన్ని ఇచ్చే వైద్య వృత్తి నిపుణులు వారు అందుకొన్న ఫోన్ కాల్ కు ప్రతిస్పందించి సంబంధి సలహా ను తక్షణం ఇస్తారు. అంతేకాకుండా, ఫోన్ చేసిన వ్యక్తి కి అతి దగ్గర లో ఉండే ఐఎఎఫ్ ఆసుపత్రి తో కూడాను సంప్రదింపుల ను జరుపుతారు. ఏదైనా అత్యవసర స్థితి ఎదురైనప్పుడు అత్యున్నత నాణ్యత తో కూడిన ఆరోగ్య సంరక్షణ సేవ ను అందజేయడం కోసం సాంకేతిక విజ్ఞానాన్ని దన్ను గా తీసుకొనే విషయం లో ఈ సదుపాయం ఐఎఎఫ్ కు ఉన్న నిబద్ధత కు ప్రతీక అని చెప్పాలి. ఇఎమ్ఆర్ఎస్ కు ఉన్న ఒకే ఒక ధ్యేయం ఏమిటి అంటే అది బాధితుల విలువైన ప్రాణాల ను కాపాడాలి అనేదే.
ఈ కార్యక్రమం లో భాగం గా వ్యవస్థ యొక్క సామర్థ్యాన్ని మరియు శక్తి ని చాటి చెప్పే ఒక ఉదాహరణ ను ఇవ్వడమైంది. ఈ ఉదాహరణ అవస్థ పడుతున్న కాలర్ కు నిపుణుల ద్వారా మార్గదర్శనం ఎంత సులభమో ప్రముఖం గా ప్రకటించింది. దీనికి తోడు అత్యంత సమీపం లో అందుబాటు లో ఉండే వైద్య సంబంధి సదుపాయం నుండి సమర్థవంతమైన సేవ ను శీఘ్రగతి న అందించడం కూడా జరుగుతుంది.
ఈ భావన ను తొలుత చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (సిఎఎస్) సంకల్పించింది; ఇఎమ్ఆర్ఎస్ కు ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి సిఎఎస్ వ్యాఖ్యానిస్తూ, ‘‘ఈ కార్యక్రమం భారతీయ వాయు సేన కు సంబంధించిన ఒక మైలురాయి యే కాకుండా ఇది వైద్య సన్నద్ధత లో చెప్పుకోదగిన పురోగమనం కూడాను. అత్యవసర స్థితుల లో తక్షణం నిపుణులైన వైద్య అధికారుల సంరక్షణ ను సమకూర్చడం కోసం ప్రస్తుతం జరుగుతున్న ప్రయాసల లో ఒక కీలకమైన ముందడుగు కు ఇది ప్రాతినిధ్యం వహిస్తున్నది’’ అని పేర్కొన్నారు.
***
(Release ID: 2021815)
Visitor Counter : 75