ఆయుష్
azadi ka amrit mahotsav g20-india-2023

2024 వ సంవత్సరం లో యోగ యొక్క అంతర్జాతీయ దినం తాలూకు పదోసంచిక ను ఒక ఉత్సవం వలె జరుపుకోవడాని కి సంబంధించి ఒక చైతన్య ప్రధానకార్యక్రమాన్ని నిర్వహించిన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద


2024 వ సంవత్సరం లోనియోగ అంతర్జాతీయ దినం మరో 30 రోజుల లో జరుగనుండగా, ‘‘మహిళల కు సాధికారిత కల్పన కోసం యోగ’’ అనే ఇతివృత్తం ఆధారం గా అనేక కార్యక్రమాల కు నడుం కట్టిన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ఆఫ్ ఆయుర్వేద

‘అందరి సమగ్ర అభివృద్ధి కి మహిళల కు సాధికారిత కీలకం’  అని ఈ కార్యక్రమాని కి  ముఖ్య అతిథి గా విచ్చేసిన సోదరి బి.కె. శివాని గారు స్పష్టంచేశారు

Posted On: 21 MAY 2024 6:16PM by PIB Hyderabad

యోగ అంతర్జాతీయ దినం యొక్క పదో సంచిక 2024 వ సంవత్సరం లో జరుగనుండగా ఆ సందర్భాన్ని స్మరించుకోవడం కోసం న్యూ ఢిల్లీ లోని ది ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఎఐఐఎ) ఒక భవ్యమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించింది. మహిళల కు సాధికారిత కల్పన కోసం యోగఅనేది ఈ కార్యక్రమాని కి ఇతివృత్తం గా ఉంది.

 

 

ఈ కార్యక్రమాని కి ముఖ్య అతిథి గా ప్రముఖ ప్రేరణాత్మక వక్త అయినటువంటి సోదరి బి.కె. శివాని గారు విచ్చేసి సభ ను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయుర్వేద మరియు ఆయుర్వేద తో అనుబంధం కలిగిన విజ్ఞానశాస్త్రాల విషయం లో ఎఐఐఎ ప్రస్తుత కాలం లో అందిస్తున్నటువంటి సేవల ను ఆమె ప్రశంసించారు. మానవ జాతి యొక్క హితం కోసం మార్పు ను తీసుకు రావడం కోసం దృఢత్వానికి మరియు యోగ కు గల ప్రాముఖ్యాన్ని యువతీ యువకులు గ్రహించాలి అని ఆమె అన్నారు. యోగ ను అభ్యసించడం వల్ల శాంతిపూర్ణమైన మనసు నుండి సమాజం యొక్క సంక్షేమం కోసం చక్కటి నిర్ణయాన్ని తీసుకోవడం లో సహాయం లభిస్తుంది అని ఆమె స్పష్టంచేశారు. అందరి సమగ్ర అభివృద్ధి కోసం మహిళల కు సాధికారిత కల్పన కీలక పాత్ర ను పోషిస్తుంది అని ఆమె అన్నారు. ఏదైనా ఒక ఆసుపత్రి వృద్ధి చెందాలి అంటే గనుక ఆ ఆసుపత్రి లో మౌలిక సదుపాయాల కల్పన, మానవ వనరుల వికాసం కీలకమైన పాత్ర ను పోషించే మాదిరి గానే ఏ అభివృద్ధి అయినా సరే అవశ్యం నిరంతరం గా కొనసాగుతూ ఉండవలసిందే అని ఆమె అన్నారు.

 

 

 

ఎఐఐఎ డైరెక్టరు, ప్రొఫెసర్, (డాక్టర్) తనూజ నెసారీ తన ప్రారంభోపన్యాసం లో సంస్థ లో మౌలిక సదుపాయాల ప్రాముఖ్యాన్ని గురించి మాట్లాడుతూ, మహిళా సశక్తీకరణ, మార్గదర్శకత్వం అనేటటువంటి వాటిని మనసు, భావన మరియు ఆత్మలను బలపరచుకోవడం కోసం ఈ యోగ దినాన్ని జరుపుకోవాలి అంటూ విజ్ఞప్తి చేశారు. ఆయుర్వేద లో సూచించినటువంటి జీవన శైలి ని అనుసరించామా అంటే గనక మన లోపలి మరియు బయటి ప్రపంచం తో ఏకమై మసలుకోవడం లో తోడ్పాటు లభించగలదన్నారు. ఆయుర్వేద మరియు యోగ ఒక నాణెం లోని బొమ్మ, బొరుసు ల వంటివి అని ఆమె అన్నారు. ఈ దృష్టి తో చూసినప్పుడు ఆయుర్వేద అనేది యోగ యొక్క భౌతిక కోణం. ఇక యోగ ఏమో ఆయుర్వేద తాలూకు ఆధ్యాత్మిక కోణం గా ఉంటాయి అని ఆమె వివరించారు. యోగ ను మరియు ఆయుర్వేద ను గురించి చదువుకోవడం ఒక్కటే కాకుండా వాటిని జీవనం లో ఆచరించాలి అంటూ ప్రతి ఒక్కరిని ఆమె కోరారు.

 

 

 

ఆయుష్ మంత్రిత్వ శాఖ యొక్క సంయుక్త కార్యదర్శి భావన సక్సేనా గారు ఈ సందర్బం లో మొరార్‌జీ దేసాయా నేశనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగ విద్యార్థులు సహా, అనేక మంది విద్యార్థులు ఇచ్చిన వివిధ కళా రూపాల ప్రదర్శన ను మరియు యోగ ఫ్యూజన్ ప్రోగ్రామ్ లను ప్రశంసించారు. ఆమె మాట్లాడుతూ, మహిళల సశక్తీకరణ ఒక సంపూర్ణమైనటువంటి భావన, దానిలో ఆర్థిక సాధికారిత కు తోడు ఆధ్యాత్మిక సాధికారిత కూడా భాగం గా ఉంటాయి అని పేర్కొన్నారు.

 

 

యోగ అంతర్జాతీయ దినం సంబంధి కార్యక్రమం లో భాగం గా థెరప్యూటిక్ యోగ అంశం పై ఒక చిన్న పుస్తకాన్ని ఎఐఐఎ ఆవిష్కరించింది. యోగ ను గురించి ఓ అయిదు రోజుల ప్రోటోకాల్ ను కూడా పాటిస్తున్నారు; దీనిని ఎఐఐఎ విద్వాన్ లు దిల్లీ లోని విభిన్న ప్రముఖ స్థలాల లో ప్రదర్శించనున్నారు. దీనిలో ఐటిబిపి సహకారం తో అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాల లో ఆయుర్ కు, యోగ కు ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈశాన్య భారతదేశం లో ఐటిబిపి అధికారులు మరియు ఆయుష్ సంస్థ ల సహకారం తో ఆరోగ్య శిబిరం మరియు హెల్థ్ కిట్ ల పంపిణీ, వృద్ధాశ్రమాలు మరియు ఎఐఐఎ యొక్క ఆసుపత్రి భవన సముదాయం లో యోగ ను గురించిన చైతన్యాన్ని చాటి చెప్పే కార్యక్రమాల వంటి వాటిని నిర్వహించనున్నారు.

 

 

 

 

ఎఐఐఎ ను ప్రాచీన భారతీయ వైద్యచికిత్స పద్ధతి అయినటువంటి ఆయుర్వేద తాలూకు జ్ఞానాన్ని మరియు అభ్యాసాన్ని ప్రచారం చేయడంతో పాటుగా ఆయుర్వేద సంబంధి జ్ఞానాన్ని మరియు అభ్యాసాన్ని మరింత ముందుకు తీసుకుపోవడం కోసం 2017 అక్టోబరు 17 వ తేదీ నాడు స్థాపించడమైంది. వెనుకటి ఆరు సంవత్సరాల లో ఈ సంస్థ ఈ రంగం లో చెప్పుకోదగ్గ పురోగతి ని సాధించింది. ఒక్క భారతదేశం లోనే కాకుండా ప్రపంచ స్థాయి లో ఆయుర్వేద సంబంధి విద్య కు మరియు పరిశోధన కు ప్రధాన కేంద్రం గా మారిపోయింది.

 

 

 

ఈ కార్యక్రమం ముగిసిన తరువాత వై బ్రేక్ మరియు యోగ ఫ్యూజన్ లను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఆయుష్ మంత్రిత్వ శాఖ కు చెందిన సీనియర్ అధికారులు మరియు మొరార్‌జీ దేసాయి నేశనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగ యొక్క డైరెక్టరు డాక్టర్ శ్రీ కాశీనాథ్ సమాగాండి, పద్మ శ్రీ పురస్కార గ్రహీతలు కమలినీ ఆస్థానా గారు, నళిని ఆస్థానా గారు లు పాలుపంచుకొన్నారు. ఇదే కార్యక్రమం లో ఎఐఐఎ యొక్క డీన్ లు, సీనియర్ అధ్యాపక సిబ్బంది మరియు సభ్యులు కూడా పాల్గొన్నారు.

 

 

 

***



(Release ID: 2021335) Visitor Counter : 97